కర్నూలు సిటీ: ఉపాధి కోర్సులు, సీబీసీఎస్ సిలబస్‌పై అభిప్రాయాలను సేకరించేందుకు శనివారం ఆర్‌యూలో వర్క్‌షాపు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వర్క్‌షాపులు నిర్వహించేందుకు ఉన్నత విద్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి వర్క్‌షాప్‌నకు రాయలసీమ పరిధిలోని నాలుగు జిల్లాలో ఉన్న వర్సిటీలకు చెందిన వీసీలు, డీన్లు, ప్రొఫెసర్లు, ఏపీఎస్‌ఎస్‌డీసీ, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఆర్‌యూ వీసీ వై.నరసింహూలు అధ్యక్షత వహించనున్నారు.