- సామాజిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి
- బాలవక్త వర్క్‌షాప్‌లో ఏజేసీ కృష్ణారెడ్డి
విద్యారణ్యపురి : విద్యార్థి దశ నుంచే ప్రాక్టీస్ చేస్తే విద్యార్థులు భవిష్యత్‌లో వక్తలుగా రాణించే అవకాశం ఉంటుందని అదనపు జారుుంట్ కలెక్టర్ (ఏజేసీ) కె.కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ, కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాలోని అన్ని డివిజన్లలో బాలవక్త పోటీలను నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఎంపిక చేసిన సుమారు 50 మంది విద్యార్థులకు రెండు రోజులుగా హన్మకొండలోని ఎస్‌ఆర్‌వీ హైస్కూల్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు.
శనివారం వర్క్‌షాప్‌ను ఏజేసీ కృష్ణారెడ్డి సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలతోపాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వివిధ అంశాలపై నిర్వహించే ఉపన్యాస పోటీల్లో భాగస్వాములు కావడం వల్ల స్టేజీ ఫికర్ పోతుందన్నారు.
విద్యార్థులకు కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంటాక్ సంస్థ బాధ్యులు ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మూడింటిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయకుమార్ మాట్లాడుతూ ఇక్కడ నేర్చుకున్న అంశాలను తోటి విద్యార్థులతో పంచుకోవాలని సూచించారు.
రాజీవ్ విద్యామిషన్ జిల్లా ప్రాజెక్ట్ ఏఎంఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జీవితంలో విజయం సాధించాలంటే చిన్నతనం నుంచే నైపుణ్యాలను అలవర్చుకోవాలన్నారు. వర్క్‌షాప్‌లో భాగస్వాములవుతున్న విద్యార్థులకు ఈనెల 14న జిల్లాస్థాయి వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టాప్ టె న్‌లో నిలిచిన పది మందికి ‘బాలవక్త’ బిరుదును ప్రదానం చేయనున్నట్లు వివరించారు.
వర్క్‌షాప్‌లో డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, ప్రధాన కార్యదర్శి జి.కృష్ణ, డిప్యూటీ డీఈఓ డి.వాసంతి మాట్లాడారు. ఉపాధ్యాయుడు ఎన్.రాజ్‌గోపాల్, నటుడు, వ్యాఖ్యాత కె.తిరుమలయ్య, సైకాలిజిస్టు జి.భవాని, పాఠ్యపుస్తక రచయిత డాక్టర్ ఆర్.గణపతి, కేయూ ప్రొఫెసర్ నర్సింహారావు వర్క్‌షాప్‌లో విద్యార్థులకు పలు మెళకువలు నేర్పించారు. రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సతీష్ ప్రకాశ్ పాల్గొన్నారు.