
వర్క్‌షాప్‌లో...
‘36 వయదినిలే’... (36 ఏళ్ల వయసులో అని అర్థం). దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత జ్యోతిక నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం చూసినవాళ్లు నటిగా జ్యోతిక ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని ప్రశంసించారు. ఈ చిత్రం విడుదల సమయంలో ‘మంచి కథలు వస్తే ఇక వరుసగా సినిమాలు చేస్తా’ అని జ్యోతిక, ‘నా భార్య జ్యోతిక నటిగా కంటిన్యూ అయితే నాకేం అభ్యంతరం లేదు’ అని హీరో సూర్య పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత జ్యోతికకు మంచి కథే దొరి కింది. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘కుట్రమ్ కడిదల్’ అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన బ్రమ్మ జి. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వర్క్‌షాప్ జరుగుతోంది. 20 రోజుల తర్వాత షూటింగ్ మొదలు పెడతారు. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ.