అత్యవసర వైద్యంపై వర్క్‌షాప్
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం ఎమర్జన్సీ అండ్ క్రిటికేర్ వైద్యంలో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతులను వివరించేందుకు ఎనిమిదవ జాతీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో తొలిరోజు ప్రాణాప్రాయ, అత్యవసర వైద్యసేవలపై వర్క్‌షాపు నిర్వహించారు. íపీడియాట్రిక్ ఎమర్జన్సీ రీసెర్చి మెథడాలజీ, పీడియాట్రిక్, అడల్డ్ క్రిటికల్ కేర్ అంశాలను యువ వైద్యులకు వివరించారు. అమెరికాకు చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ అజయ్‌లు వైద్య విద్యార్థులకు పరిశోధనల కోసం పేపర్లు ఎంపిక చేసే విధానం, పేపర్ ప్రజెంటేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చండ్ర రాధికారాణి, డాక్టర్ చంద్రశేఖర్‌లు బేసిక్‌లైఫ్ సపోర్ట్ గురించి, ట్రామా, ఎమర్జన్సీ ట్రీట్‌మెంట్‌లో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతుల గురించి వర్క్‌షాపులో వివరించారు. కాగా ఈ సదస్సును శనివారం సాయంత్రం వైద్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మళ్లీ లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధికారాణి తెలిపారు.