GMC
-
Indian Super League 2021: పరాజయంతో మొదలు
బంబోలిమ్ (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ తాజా సీజన్‌ను హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఓటమితో ఆరంభించింది. ఇక్కడి జీఎంసీ అథ్లెటిక్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0–1 గోల్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీ చేతిలో పరాజయంపాలైంది. చెన్నైయిన్ తరఫున వ్లాగిమిర్ కొమన్ (66వ నిమిషంలో) పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ను హైదరాబాద్ జట్టు దూకుడుగా ఆరంభించింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదిస్తూ చెన్నైయిన్ ‘డి’ బాక్స్‌లోకి పదే పదే చొచ్చుకొచ్చింది. అయితే గోల్ చేయడంలో మాత్రం సఫలం కాలేదు. చెన్నైయిన్ గోల్ కీపర్ విశాల్ కెయిత్ హైదరాబాద్ దాడులను సమర్థంగా అడ్డుకున్నాడు. అదే క్రమంలో గోల్ చేసే అవకాశాలను హైదరాబాద్ ఆటగాడు ఒగ్బెచె జారవిడిచాడు. అదే సమయంలో చెన్నైయిన్ పూర్తి రక్షణాత్మకంగా ఆడటంతో తొలి అర్ధ భాగం గోల్ లేకుండానే ముగిసింది. రెండో అర్ధ భాగంలో చెన్నైయిన్ జట్టుకు అదృష్టం కలిసొచ్చింది. హైదరాబాద్ ‘డి’ బాక్స్‌లో ఆ జట్టు ఆటగాడు హితేశ్ శర్మ ప్రత్యర్థి ప్లేయర్ అనిరుధ్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడంతో రిఫరీ చెన్నైయిన్ జట్టుకు పెనాల్టీని కేటాయించాడు. ఇక్కడ ఎటువంటి పొరపాటు చేయని కొమన్ పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. అనంతరం గోల్ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. -
సీనియర్ నేత మృతి.. విచారణకు కాంగ్రెస్ డిమాండ్
పనాజీ : వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ సీనియర్ నేత, రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన జితేంద్ర దేశ్ ప్రభు మృతిచెందారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. న్యుమోనియా తీవ్రతతో గత నెలలో జితేంద్ర ప్రభు మరణించారు. దేశ్ ప్రభుకి వైద్యసహాయం అవసరమైన సమయంలో ఆసుపత్రిలోని ఇద్దరు కీలక డాక్టర్లు గైర్హాజరయ్యారని కాంగ్రెస్ పార్టీ గోవా అధ్యక్షులు గిరీష్ చొడాంకర్ ఆరోపించారు. అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన తమ నేత మృతిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ ఘటనపై సీనియర్ రెసిడెంట్ వైద్యుడిని, గోవా మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి డీన్ సస్పెండ్ చేశారు. రేడియాలజీ విభాగం అధిపతి డాక్టర్ జీవన్ వెర్నేకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దేశ్ ప్రభు జీఎంసీలో చేరాక, సిటీ స్కాన్ నిర్వహించడంలో ఆలస్యం జరిగనట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ దేశ్ ప్రభుతో కలిసి అక్కడికి వెళ్లినప్పుడు సిటీ స్కాన్ చేయడానికి జూనియర్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు అక్కడ లేరని, దీంతో 35 నిమిషాలు అక్కడే వేచి ఉండాల్సి వచ్చిందని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే వైద్యుడిని సస్పెండ్ చేయడాన్ని గోవా అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్లు నిరసిస్తున్నారు. కరోనా మహమ్మారితో ముందుండి పోరాడుతున్న డాక్టర్లపై ఇప్పటికే అధిక భారం ఉందని, వైద్యుడిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. -
జీఎంసీలో అవకతవకలపై ఆరా
సాక్షి గుంటూరు: నగరపాలక సంస్థ కార్యాలయంలో పూర్తి అడిషనల్ ఇన్చార్జి కమిషనర్ బాధ్యతలు నిర్వహించిన కె. రామచంద్రారెడ్డి అమోదించిన పలు ఫైళ్లపై అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ వ్యక్తిగత సెలవులపై అక్టోబర్ 28 నుంచి నవంబరు 11వ తేదీ వరకు వెళ్లడంతో ఎఫ్ఏసీ కమిషనర్‌గా అదనపు కమిషనర్ కె. రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు కేటాయించారు. ఆయన హయాంలో పలు విభాగాలకు చెందిన ఫైళ్ల అమోదంపై అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతస్థాయి అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ అనేక కారణాలతో పెండింగ్‌లో పెట్టిన ఫైళ్లను అధికార పార్టీ నాయకులు, దళారీల ప్రలోభాలకు లొంగి ఇన్చార్జి కమిషనర్ అమోదించినట్లు సమాచారం. సమగ్ర మంచినీటి పథకానికి సంబంధించిన ఒక కాంట్రాక్టు సంస్థకు రూ.2 కోట్లు వరకు బిల్లులు చెల్లింపులకు అమోదం చేసినట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి తనఖా స్థలాన్ని రిలీజ్ చేస్తూ మాన్యువల్ ఫైల్, పలు బిల్డింగ్‌లకు ఆన్లైన్లో అక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ అమోదించినట్లు సమాచారం. ఎలక్షన్ విభాగంలో ఎనిమిది మంది కాంట్రాక్టు ఉద్యోగులను నియమించడం, సస్పెండ్ నుంచి రీకాల్ అయిన ఇంజనీరింగ్ సిబ్బందికి కీలక రిజర్వాయర్‌లో నియమకాలు చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో పది వరకు నామినేషన్లు పనులకు అనుమతులు, టెండర్లు సైతం ఫైనలైజేషన్ చేశారు. కమిషనర్ శ్రీకేష్ పెండింగ్‌లో ఉంచిన పలు పనుల్ని నామినేషన్ మీద చేసిన బిల్లులు అమోదించినట్లు సమాచారం. కమిషనర్ చాంబర్ నుంచి వివరాల సేకరణ ఇన్చార్జి కమిషనర్ అమోదించిన ఫైళ్లపై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో విభాగాల వారీగా వివరాలను కమిషనర్ చాంబర్ సిబ్బంది సేకరిస్తున్నట్లు సమాచారం. అమోదించిన ఈ–ఫైల్ నంబర్ ఇవ్వాలని పలువురు విభాగాధిపతులను కోరినట్లు తెలుస్తోంది. ఎలక్షన్ సెల్లో నియమించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పిలిపించి డబ్బులు ఏమైనా ఇచ్చారా? అనే దానిపై విచారిస్తున్నట్లు తెలిసింది. ఇన్చార్జి కమిషనర్ దళారులు, కొందరు ఉద్యోగుల మధ్యవర్తిత్వంతో పలు పెండింగ్ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని, ఆయన చాంబర్ వద్ద పెద్దఎత్తున అధికారులు, మధ్యవర్తులు పైళ్లతో తిరుగుతున్నారని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ కోన శశిధర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ శనివారం ఇన్చార్జి కమిషనర్‌కు ఫోన్ చేసి పిలిపించి ఆర్థికపరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవద్దని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సోమవారం విధులకు హాజరైన కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ ఎన్నికల విభాగంలో నూతనంగా నియమించిన అభ్యర్థుల్ని చాంబర్‌కు పిలిపించి విచారించినట్లు తెలిసింది. ఇన్చార్జి కమిషనర్ అమోదించిన బిల్లులపై ఆరా తీస్తుండటంతో కొందరు అధికారులు, దళారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగుల నియామకాలతోపాటు, సస్పెండ్ నుంచి రీకాల్ అయిన పలువురు అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలోనూ కొందరు దళారులు భారీ మొత్తంలో వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ వీరందరినీ పిలిచి విచారిస్తుండటంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోననే వణికి పోతున్నారు. అవకతవకలకు పాల్పడలేదు ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్న సమయంలో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశాను. ఉద్యోగుల నియామకంలో గానీ, సస్పెండ్ నుంచి రీకాల్ అయిన సిబ్బందికి పోస్టింగ్‌లు మాత్రమే ఇచ్చాను. కలెక్టరేట్ హెచ్ సెక్షన్ ఆదేశాల మేరకే అత్యవసరంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాం. టౌన్ ప్లానింగ్‌లో డ్రీమ్డ్ అప్రూవల్ అయ్యే అవకాశం ఉన్న ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్లు మాత్రమే ఆమోదించాను. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తామంటూ ఎన్సీసీ సంస్థ ప్రతినిధులు చెప్పడంతో గతంలో చేసిన పనులకు రూ. 2.50 కోట్లు మంజూరు చేశాను. ఈఫైళ్లపై నన్ను ఎవరు వివరాలు అడగలేదు. – కె.రామచంద్రారెడ్డి, అదనపు కమిషనర్ -
పీఎఫ్ రుణాల్లో భారీ కుంభకోణం..!
సాక్షి, గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో మరో కుంభకోణం వెలుగు చూసింది. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి పీఎఫ్ రుణాల వ్యవహారంలో వారికి సంబంధం లేకుండా దళారులు మార్చేసిన వైనం బయటపడింది. ఏకంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్వో), ఓ క్లర్క్ సంతకాలను ఫోర్జరీ చేసి పారిశుద్ధ్య కార్మికులకు తెలియకుండా వారి పీఎఫ్ ఖాతాల నుంచి రుణాలు మంజూరు చేస్తూ ఆ డబ్బును వేరే ఖాతాలకు మళ్లిస్తున్నట్లు అధికారులు మంగళవారం గుర్తించి, వాటిని నిలిపివేయడంతోపాటు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అధికారులు వెళ్లే సమయానికి ఐదుగురు కార్మికులకు పీఎఫ్ రుణాలు మంజూరు చేయడంతోపాటు డీడీలు సైతం సిద్ధం చేశారు. తాను పీఎఫ్ లోనుకు దరఖాస్తు చేసుకోకపోయినా తన పేరుతో రుణం రావడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఓ కార్మికుడు ఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయడం, ఆమె పీఎఫ్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయడంతో పీఎఫ్ రుణాల కుంభ కోణం బయటపడింది. రుణాలను నిలిపివేయించి విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... నిరక్షరాస్యులే లక్ష్యంగా.. గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులకు 2000 సంవత్సరం నుంచి పీఎఫ్ కట్ చేస్తూ నగరపాలక సంస్థ సైతం పీఎఫ్ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. అయితే పారిశుద్ధ్య కార్మికుల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులు కావడంతో వారికి పీఎఫ్ చెల్లింపులు, ఈఎస్ఐ వ్యవహారాలు చూస్తూ చనిపోయిన వారికి క్లయిమ్‌లు ఇప్పించేందుకు ఓ కాంట్రాక్టు సంస్థను అప్పట్లో నగరపాలక సంస్థ అధికారులు నియమించారు. అయితే కార్మికులకు సంబంధించి పీఎఫ్ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిన కాంట్రాక్టు సంస్థ పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో దళారులు చేరి పారిశుద్ధ్య కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి అప్పులు ఇవ్వడం, ఖాళీ పేపర్ల మీద సంతకాలు చేయించుకుని వారి డబ్బులు కాజేయడం పరిపాటిగా మారింది. దీంతో కష్టపడి పనిచేసిన డబ్బు ఇళ్లకు చేరక, కుటుంబాలకు గడవక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ వ్యవహారం బయటపడిందిలా.. నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలోని మలేరియా విభాగంలో గోడౌన్ కీపర్‌గా పనిచేస్తున్న కేశవరావు అనే కార్మికునికి బుధవారం ఓ మెసేజ్ వచ్చింది. మీరు పెట్టుకున్న పీఎఫ్ లోను మంజూరు అయిందనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో అవాక్కు అయిన కేశవరావు తాను పీఎఫ్ లోను కోసం అసలు దరఖాస్తు చేయలేదని ఫిర్యాదు చేశాడు. రికార్డులు పరిశీలించిన ఎంహెచ్వో డాక్టర్ శోభారాణి కేశవరావు పేరుతో పీఎఫ్ లోనుకు ఎటువంటి సిఫార్సు చేయలేదని నిర్ధారించుకున్నారు. వెంటనే పీఎఫ్ కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించగా కేశవరావు పేరుతో ఉన్న దరఖాస్తులో తన సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన ఆమె మరో నాలుగు లోన్లకు సంబంధించి డీడీలు సైతం సిద్ధమైనట్లు తెలుసుకుని వాటిని నిలిపివేయించారు. సదరు డబ్బును చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి అకౌంట్‌కు జమ చేసేలా ఏర్పాట్లు చేయడంపై పూర్తి వివరాలు తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాంట్రాక్టు సంస్థ, అధికారులు పాత్ర ఏ మేరకు ఉందనేది వేచి చూడాల్సి ఉంది. పారిశుద్ధ్య కార్మికులకు తెలియకుండా పీఎఫ్ లోన్లు కాజేస్తున్న వైనం బయటకు రావడంతో గతంలో సైతం ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరిగాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరెవరి పేర్లతో ఎంతెంత లోన్లు మార్చుకున్నారో తెలియక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో క్రిమినల్ కేసు పెడతాం నా సంతకాన్ని ఫోర్జరీ చేసి కేశవరావు అనే పారిశుద్ధ్య కార్మికునికి తెలియకుండా ఆయన పీఎఫ్ ఖాతా నుంచి లోన్లు మంజూరు చేయించుకుని కాజేస్తున్న వైనం బయటపడింది. దీనిపై పీఎఫ్ అధికారులతో పాటు, మేము పూర్తి విచారణ జరుపుతాం. గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా అనేదానిపై ఆరా తీస్తున్నాం. ఫోర్జరీ వ్యవహారంపై కమిషనర్ ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదు చేయిస్తాం. ఇకమీదట పారిశుద్ధ్య కార్మికుల ఆధార్ కార్డులను ఆన్లైన్ చేసి వారి బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసి పీఎఫ్ లోన్లు నేరుగా వారి అకౌంట్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ శోభారాణి, ఎంహెచ్వో -
వీరింతే.. మారరంతే
తప్పు చేసి తప్పించుకోవడం అక్కడ అధికారులకు పరిపాటి.. అక్రమాలకు సహకరిస్తూ అవినీతికి పాల్ప డడం .. ఉన్నతాధికారులు చర్యలు చేపడితే అధికార పార్టీ నేతల ద్వారా ఒత్తిడి తెచ్చి తప్పించుకోవడంవీరికి వెన్నతో పెట్టిన విద్య. అవినీతి వ్యవహారం బయటపడిన ప్రతిసారీ విచారణల పేరుతో హడావుడి చేయడం.. ఆ తరువాత చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం షరామామూలే. ఇదీ కార్పొరేషన్లో కొందరు అధికారులు తీరు. కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి వచ్చినా.. కలెక్టర్ మందలించినా.. ఉన్నతాధికారులు తలంటినా వీరు మారరంతే. సాక్షి, గుంటూరు: నగరపాలక సంస్థలో చిన్న అవినీతి వ్యవహారాల నుంచి భారీ స్థాయి కుంభకోణాల వరకు ఏది బయటకు వచ్చినా రెండు, మూడు రోజుల్లో తూతూమంత్రపు చర్యలతో దృష్టి మరల్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కమిషనర్ల ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ కొందరు అధికారులు సమాంతర వ్యవస్థను నడుపుతున్నారు. కలుషిత నీటితో 20 మందికి పైగా మృత్యువాత పడిన సంఘటనతో కమిషనర్‌ను మార్చి ఐఏఎస్ అధికారిని నియమించినప్పటికీ అవినీతి అధికారులు తమ పంథాను మార్చుకోవడం లేదు. పింఛన్లు మింగేసినా పట్టించుకోరు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏడాదిన్నర క్రితం వృద్ధులు, వితంతులు, వికలాంగులకు నెలనెలా ఇచ్చే పింఛన్లను ఉన్నతాధికారుల డిజిటిల్ సైన్ దుర్వినియోగం చేసి లక్షల్లో డబ్బు కాజేసిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏడాదిన్నర దాటుతున్నా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారే తప్ప ఇంత వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులను గుర్తించి తమకు ఫిర్యాదు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ పోలీసు అధికారులు సూచించినప్పటికీ వీరు స్పందించడం లేదు. బదిలీ చేసినా కదలరు గుంటూరు నగరంలోని ఓల్డ్ క్లబ్ రోడ్డులో గత కమిషనర్ అనురాధ అక్రమ నిర్మాణాలను గుర్తించి పట్టణ ప్రణాళిక అధికారులపై చర్యలు తీసుకున్నారు. అనధికారిక నిర్మాణాలకు సహకరించిన ముగ్గురు చైన్మెన్లను అంతర్గత బదిలీలు చేశారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న సదరు చైన్మెన్లు మాత్రం బదిలీ చేసిన డివిజన్లకు వెళ్లకుండా తమ స్థానంలోనే కొనసాగుతున్నారు. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినప్పటికీ ఏదో ఒక సాకు చూపుతూ వారిని అక్కడే కొనసాగిస్తున్నారు. ఖాతాలు తారుమారైనా బేఖాతరే.. తాజాగా కమిషనర్ ఖాతాలో జమ కావాల్సిన ఉద్యోగుల జీపీఎఫ్, పీఎఫ్, లోనులకు చెల్లించాల్సిన రూ. 20 లక్షల నిధులు పారిశుద్ధ్య కార్మికుని ఖాతాల్లో జమ కావడం తీవ్ర కలకలం రేపింది. పారిశుద్ధ్య కార్మికుడు రూ. 2.5 లక్షలు విత్ డ్రా చేసుకుని సొంత ఖర్చులకు వినియోగించుకున్నట్లు సమాచారం. కమిషనర్ ఖాతాలో జమ కావాల్సిన నిధులు పారిశుద్ధ్య కార్మికుని ఖాతాలోకి ఎలా వెళ్లాయి. ఎవరు మార్చారనే దానిపై విచారణ చేస్తున్నారు. అయితే ఈ అంశాన్నీ ఏదో ఒక సాకు చూపి పక్కన పడేస్తారా ? నిజమైన దోషులను తేల్చి కఠిన చర్యలు తీసుకుంటారా ? అనేది వేచి చూడాలి. ఇవే కాకుండా నగరపాలక సంస్థ పరిధిలో ఇంజినీరింగ్, టౌన్, ప్రజారోగ్య, రెవెన్యూ విభాగాల్లో అనేక అవినీతి వ్యవహారాలు, కుంభకోణాలు బయటపడినప్పటికీ విచారణల పేరుతో తాత్సారం చేస్తున్నారు. అన్నీ అక్రమాలే.. టీడీఆర్ బాండ్ల పంపిణీలో అవకతవకలు, లేబర్ చెస్‌లో గోల్మాల్, అనధికార నిర్మాణాల వ్యవహారంలో, బిల్డింగ్ ప్లాన్ మంజూరు సమయంలో ఖాళీ స్థలాలపై 14 శాతం పన్ను రాయితీ వ్యవహారంలో జరిగిన భారీ స్థాయి కుంభకోణాల్లో సైతం తూతూమంత్రపు చర్యలు తప్ప, సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో అవినీతి అధికారులకు ఉన్నతాధికారులంటే లెక్క లేకుండాపోతోంది. దీంతో ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా వచ్చినప్పటికీ ఏ మాత్రం లెక్క చేయకుండా అవినీతి వ్యవహారాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కమిషనర్, కలెక్టర్లు దీనిపై సీరియస్‌గా దృష్టి సారించి చర్యలు చేపట్టకపోతే వీరిని అదుపు చేయడం ఎవరి తరం కాని పరిస్థితి ఏర్పడుతుంది. పన్నులు వసూలు కాగానేబదిలీ చేస్తాం అనధికారిక నిర్మాణాల విషయంలో ముగ్గురు చైన్మెన్లను గత కమిషనర్ అనురాధ అంతర్గత బదిలీ చేసిన విషయం వాస్తవమే. వాళ్లు ప్రస్తుతం బదిలీ ప్రాంతాలకు వెళ్లకుండా ఇదే ప్రాంతంలో కొనసాగుతున్నారు. ప్రకటనల పన్నుల వసూళ్లు పూర్తయ్యాక బదిలీ స్థానానికి పంపుతాం. – చక్రపాణి, సిటీ ప్లానర్ -
కాసుక్కూర్చున్నారు..
► జీఎంసీలో ఏళ్ల తరబడి తిష్టవేసిన అవినీతి అధికారులు ► నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలను పెంచిపోషిస్తున్న వైనం ► గతంలో విజిలెన్స్ విచారణలో బయటపడిన అవినీతి బాగోతం ► ప్రస్తుత కలెక్టరైనా అడ్డుకట్ట వేస్తారా ? నిబంధనలను పునాది రాళ్లలో తొక్కేసి గుంటూరు నగరంలో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారా ?. నగరంలో ఏదైనా పనులు చేపట్టి నాణ్యతకు తిలోదకాలిచ్చేసి బిల్లులు తీసుకోవాలనుకుంటున్నా ?. ఇంటి కుళాయి దగ్గర నుంచి ఏదైనా సర్టిఫికెట్ వరకు అక్రమంగా పొందాలనుకుంటున్నారా ? అయితే మీ దగ్గర ముడుపులు దండిగా ఉండాలి. వీటిని ఆశ చూపితే చాలు గుంటూరు నగరపాలక సంస్థలో ఎలాంటి పనైనా చిటికెలో అయిపోతుంది. ఉన్నతాధికారులు అడ్డుపడతారని భయపడాల్సిన పని లేదు. వారినీ ఈ అవినీతి అనకొండలు మేనేజ్ చేస్తాయి. అవసరమైతే పక్కదారి పట్టించి బలి చేసేస్తాయి కూడా.. –సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు: నిషేధిత, ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు నిర్మించినా రెవెన్యూ విభాగం అధికారులు ఇంటి పన్నులు వేసేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకపోయినా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. అభివృద్ధి పనులు నాణ్యత లేకున్నా ఇంజినీరింగ్ అధికారులు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తున్నారు. వాస్తవంగా 50 శాతానికి మించి శుభ్రత లేకపోయినా ప్రజారోగ్య విభాగం అధికారులు రికార్డుల్లో 99 శాతం ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇదంతా చేతులు తడిపితేనే. జీఎంసీలో ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ డబ్బులు ఇచ్చుకోలేని సామాన్యుల వద్ద నిబంధనల చిట్టా వల్లెవేస్తున్నారు. వీరి అవినీతిని అడ్డుకోవాలని చూసిన ఎంతో మంది కమిషనర్లను సైతం ఏడాది తిరక్కుండానే బదిలీపై పంపేస్తున్నారు. ఇదీ అనేక ఏళ్లుగా గుంటూరు నగరపాలక సంస్థలో సాగుతున్న అవినీతి దందా. బయటపడినవి కొన్ని..తెలియనివి ఎన్నో ముఖ్యంగా ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ప్రజారోగ్య విభాగాల్లోని కొందరు అధికారులు తమ అవినీతి సామ్రాజ్యాన్ని రోజురోజుకూ విస్తరిస్తూనే ఉన్నారు. వీరికి కమిషనర్లంటే భయం లేదు. పైకి స్వామి భక్తి నటిస్తూ తమ విభాగాల్లోని ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తూ అవినీతి దందా కొనసాగిస్తున్నారు. కొత్తపేట శివాలయం ఎదురుగా ఓ వైద్యుడు అక్రమ నిర్మాణం చేపడుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు భారీగా ముడుపులు తీసుకొని సహకరించారు. దీనిపై మరో వైద్యుడు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పటి కమిషనర్ నాగలక్ష్మికి హైకోర్టు నెల రోజులు జైలు శిక్ష విధించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి ఐఏఎస్ అధికారి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. గతంలో ఇదే విభాగంలో టీడీఆర్ బాండ్లు, లేబర్‌సెస్ కుంభకోణాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు నిగ్గు తేల్చి పది మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇది జరిగి ఏడాది దాటుతున్నా ఇంత వరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. చర్యలు శూన్యం రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు డబ్బులు దండుకుని పన్ను తగ్గించిన విషయం అప్పటి ఆర్డీ, ప్రస్తుత కమిషనర్ అనూరాధ గుర్తించి చర్యలకు సిఫార్సు చేశారు. గతేడాది కృష్ణా పుష్కరాల సమయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో కొందరు కాంట్రాక్టర్లు నాణ్యత గాలికొదిలి, పనులను మధ్యలోనే ఆపేశారు. అయినా వారి వద్ద పర్సంటేజీలు పుచ్చుకున్న ఇంజినీరింగ్ అధికారులు పూర్తిగా బిల్లులు చెల్లించేశారు. మరి కొందరు ఇంజిరింగ్ అధికారులైతే బినామీ పేర్లతో టెండర్లు దక్కించుకుని వారే పనులు చేసి బిల్లులు చేసుకొన్నట్లు బయటపడింది. ఇంత జరిగినా జీఎంసీలో అంతర్గత బదిలీలు మినహా కఠిన చర్యలు తీసుకోలేదు. ఇటీవల నగరంలోని ఆదిత్యానగర్ కాలనీలో నిషేధిత స్థలంలో నిర్మిస్తున్న ఇంటికి అధికారులు శారాదా కాలనీ అడ్రస్‌తో నీటి కుళాయి కేటాయించారు. దీనిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజారోగ్య విభాగంలోని కొందరు అధికారులు పారిశుద్ధ్య కార్మికుల లెక్కలు సక్రమంగా చూపకుండా జీతాలు మార్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆయా విభాగాల ఉన్నతాధికారుల అండతో తప్పించుకోగలుగుతున్నారు. వారం రోజుల్లో తప్పులు సరిదిద్దుకోండి : కోన శశిధర్, కలెక్టర్ ‘నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు నా దృష్టికి వచ్చాయి. వారం రోజులు టైం ఇస్తున్నా.. సరి చేసుకోండి.. ఆ తరువాత నేను జరిపే విచారణలో అక్రమాలు బయటపడితే ఊరుకునేది లేదు. ఆన్లైన్ పేరుతో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు చేస్తున్న వ్యవహారం మొత్తం నాకు తెలుసు. ఐఏఎస్ అధికారినే ఇబ్బందులు పెట్టి పంపారు. ఎవరినీ వదిలిపెట్టను’ అంటూ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి కోన శశిధర్ జీఎంసీ అధికారులను హెచ్చరించారు. నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్లో ప్రజారోగ్య, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన సీరియస్‌గా క్లాస్ పీకారు. ప్రస్తుత కమిషనర్ అనూరాధ సైతం అధికారుల అవినీతిపై దృష్టి సారించారు. ఇప్పటికైనా జీఎంసీ అధికారుల అవినీతికి అడ్డుకట్ట పడుతుందో ? లేదో ? వేచి చూడాలి. -
అత్యవసర వైద్యంపై వర్క్‌షాప్
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం ఎమర్జన్సీ అండ్ క్రిటికేర్ వైద్యంలో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతులను వివరించేందుకు ఎనిమిదవ జాతీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో తొలిరోజు ప్రాణాప్రాయ, అత్యవసర వైద్యసేవలపై వర్క్‌షాపు నిర్వహించారు. íపీడియాట్రిక్ ఎమర్జన్సీ రీసెర్చి మెథడాలజీ, పీడియాట్రిక్, అడల్డ్ క్రిటికల్ కేర్ అంశాలను యువ వైద్యులకు వివరించారు. అమెరికాకు చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ అజయ్‌లు వైద్య విద్యార్థులకు పరిశోధనల కోసం పేపర్లు ఎంపిక చేసే విధానం, పేపర్ ప్రజెంటేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చండ్ర రాధికారాణి, డాక్టర్ చంద్రశేఖర్‌లు బేసిక్లైఫ్ సపోర్ట్ గురించి, ట్రామా, ఎమర్జన్సీ ట్రీట్మెంట్లో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతుల గురించి వర్క్‌షాపులో వివరించారు. కాగా ఈ సదస్సును శనివారం సాయంత్రం వైద్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మళ్లీ లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధికారాణి తెలిపారు. -
పింఛన్ ప్రహసనం
అరండల్‌పేట: వారంతా నిరాధార వృద్ధులు... వికలాంగులు... వితంతువులు. నెలనెలా సర్కారు అందించే పింఛనే ఆధారం. రోజుకో పద్ధతిలో పంపిణీ చేపడుతుండటం వారి ప్రాణాలమీదికొస్తోంది. తాజాగా పోస్టాఫీసులనుంచి పంపిణీ చేపడుతుండటంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నారుు. పేర్లు గల్లంతవడం... సర్వస్ మొరారుుంచడం... కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్టు తయారైంది నగరపాలకసంస్థ పరిధిలోని పింఛనర్ల పరిస్థితి. జీఎంసీ పరిధిలో మొత్తం 21,259 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతు, చేనేత పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి గతంలో బిల్కలెక్టర్లు వారి వారి ప్రాంతాలకు వెళ్లి పింఛన్లు అందజేసేవారు. ఆరునెలల క్రితం యాక్సిస్ బ్యాంకు ద్వారా అందజేసేవారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో ఆ నెల పింఛన్ లబ్ధిదారులకు అందలేదు. ఈ నెల 16వ తేదీనుంచి ఆ మొత్తాలు అందిస్తామని కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఇందుకోసం ప్రతి 600 మందిని ఒక పోస్టాఫీసుకు కేటారుుంచి, మొత్తం 40 పోస్టాఫీసుల్లో ఏర్పాట్లు చేశారు. పోస్టాఫీసుల కేటారుుంపులోనూ గందరగోళం లబ్ధిదారుల్లో చాలా మందికి వారు నివాసం ఉండే ప్రాంతాల్లో కాకుండా సుమారు 4, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టాఫీసులకు కేటారుుంచారు. దీనివల్ల ఎవరికి ఎక్కడ అందిస్తారో తెలియక గందరగోళంగా మారింది. కొంతమంది తమ ప్రాంతంలోని పోస్టాఫీసులకు ఉదయం 6 గంటల నుంచే ఎదురుచూశారు. తీరా అక్కడి అధికారులు వారి పేర్లు లేవంటూ సమాధానం చె ప్పేసరికి ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. కొందరు కార్పొరేషన్ కార్యాలయానికి క్యూ కట్టారు. అక్కడ వారికి సమాధానం చెప్పేవారు కరువయ్యారు. చాలా మంది వృద్ధులు ఎండతీవ్రతవల్ల కార్పొరేషన్ కార్యాలయంలో సొమ్మసిల్లిపడిపోయారు. అసలు పింఛన్ లిస్టులో పేరు ఉందో లేదో తెలియక తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. జీఎంసీ అధికారుల నిర్లక్ష్యం అసలు ఎవరికి ఎక్కడ పింఛన్లు పంపిణీ చేస్తారో ముందుగా కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారులకు తెలియజేయలేదు. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేక మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కార్పొరేషన్ కార్యాలయంలోనే గడిపారు. వారికి సమాధానం చెప్పే వారే లేరు. మంగళదాస్‌నగర్‌కు చెందిన వారికి మెడికల్ కళాశాల పోస్టాఫీసు కేటాయించగా, పాతగుంటూరులో నివసించే వారికి ఆటోనగర్ పోస్టాఫీసులో డబ్బులు తీసుకొనేలా చేశారు. ఇలా ప్రతి డివిజన్లో జరగడ ంతో తీవ్ర గందరగోళం నెలకొంది. మొరాయించిన ఆన్లైన్ సర్వర్లు పెన్షన్ లిస్టులో పేర్లు ఉన్న వారికి డబ్బులు అందించేందుకు గంటల తరబడి సమయం పట్టింది. ఆయా పోస్టాఫీసుల్లో సర్వర్లు మొరారుుంచడంతో ఒక్కో అభ్యర్థి మూడు గంటలకు పైగా మెషిన్వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. ఇలా నగరంలోని 40 పోస్టాఫీసు కేంద్రాల వద్ద లబ్ధిదారులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 600 మందిని ఒక పోస్టాఫీసుకు కేటాయించడంతో అక్కడకు ఒకేసారి అందరూ చేరుకుంటున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు పొరపాట్లు జరగకుండా చూస్తాం పింఛన్ల పంపిణీలో పొరపాట్లు జరగకుండా చూస్తాం. కొందరి వేలిముద్రలు పడకపోవడంతో పోస్టాఫీసుల వద్ద వారికి పింఛన్లు ఇవ్వలేదు. అటువంటి వారి ఇళ్లకే వెళ్లి అందజేస్తాం. అలాగే మరికొందరి పేర్లు వివిధ కారణాలతో తొలగించారు. వారికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే నెలలో కొంతమందికి పునరుద్ధరిస్తాం. - సింహాచలం, పీఓ, ఉపాసెల్ -
జీఎంసీ అధికారులపై ముగిసిన విచారణ
అరండల్‌పేట: నగరపాలకసంస్థ ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ ముగిసింది. జీఎంసీ ఉన్నతాధికారులను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేకా విచారణాధికారి సాంబశివరావు గురు, శుక్రవారాలు రెండురోజులపాటు కార్పొరేషన్లో విచారణ నిర్వహించారు. శుక్రవారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలు తనిఖీచేశారు. భవన నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల ఫైల్స్, ఆ ప్రాంతానికి చెందిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్లతో కలిసి ఆయన భవనాలను తనిఖీచేశారు. తొలుత అమరావతిరోడ్డులో నిర్మించిన ఓ ఫంక్షన్‌హాల్‌తో పాటు బ్రాడీపేటలోని ఓ బంగారు నగల దుకాణం, అరండల్‌పేటలోని ఓ భనం, ముత్యాలరెడ్డి నగర్లో నిర్మించిన వాణిజ్య సముదాయం, ఆటోనగర్‌లో నిర్మించిన భవన సముదాయాలను ఆయన తనిఖీ చేశారు. భవన నిర్మాణానికి తీసుకున్న ప్లాన్‌ను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆయన వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో సెట్‌బ్యాక్స్ వదలలేదని, అటువంటి వాటికి ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేయలేదని తెలిపారు. అనంతరం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశమందిరంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులను విచారించారు. సంబంధిత ఫైల్స్‌ను ఆయన తనిఖీచేశారు. బిల్లుల చెల్లింపులపై అకౌంట్స్ విభాగం అధికారులతో మాట్లాడారు. అనంతరం ప్రజారోగ్యవిభాగంలోజరిగిన మందుల కొనుగోళ్లు, అందుకు సంబంధించిన బిల్లులను పరిశీలించారు. ఎంహెచ్‌ఓలుగా పని చేసిన విక్టర్‌బాబు, నరసింహారావు నియామకాలకు సంబ ంధించిన ఫైల్స్‌ను తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల నియామకం, మేనేజరు పోస్టు భర్తీ తది తర అంశాలపై ఆయన విచారణ జరిపారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విచారణ జరిపామన్నారు. పూర్తినివేదికను రాష్ట్ర పురపాలకశాఖ డెరైక్టర్ వాణీమోహన్‌కు అందజేస్తామన్నారు. దీని ఆధారంగా తదుపరి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.