సరికొత్త యాప్స్ సృష్టించండి!
సరికొత్త యాప్స్ సృష్టించండి!
Published Wed, Sep 7 2016 5:40 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
* రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో,
మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారావు
నంబూరు (పెదకాకాని): నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మంగళవారం ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఫంyŠ lమెంటల్స్‌పై రాష్ట్రస్థాయి వర్స్‌షాపు ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఘంటా సుబ్బారావు మాట్లాడుతూ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో 85 శాతం గూగుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లేనని తెలిపారు. ప్రజల అవసరాల కోసం నూతన యాప్స్ రూపొందించాలని సూచించారు. దేశంలోనే మొదటిసారిగా 100 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన అధ్యాపకులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వీరు తమ కళాశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తారని, దీంతో కనీసం పదివేల మంది బీటెక్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మనదేశంపై ఎంతో నమ్మకంతో గూగుల్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, మొదట మన రాష్ట్రంలో వీవీఐటీలో వర్క్‌షాపును ప్రారంభించినట్లు లె లిపారు. సీమన్స్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)ని ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విభాగాన్ని 15 రోజుల్లో వీవీఐటీలో ప్రారంభించనుందని తెలిపారు. 20 లక్షల మంది డెవలపర్స్‌ను తయారు చేయడమే లక్ష్యం గూగుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ హెడ్ పియోస్ సరస్వత్ మాట్లాడుతూ 20 లక్షల మంది ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్స్‌ను తయారు చేయాలనే సంకల్పంతో గూగుల్ ఉందని, భారతదేశంపై ఎక్కువగా దృష్టి సారించిందన్నారు. గూగుల్ సంస్థ తమ కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌లో మొదటిగా నైపుణ్యాభివృద్ధి పై వర్క్‌షాపును నిర్వహించడం సంతోషంగా ఉందని, నైపుణ్యాభివృద్ధి ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. పదో తేదీన కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు, నైపుణ్యాభిసంస్థ నిపుణులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement