అత్తాపూర్లో అగ్నిప్రమాదం | Fire accident in workshop at attapur | Sakshi
Sakshi News home page

అత్తాపూర్లో అగ్నిప్రమాదం

Published Sun, Jan 31 2016 8:20 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

అత్తాపూర్లో అగ్నిప్రమాదం - Sakshi

అత్తాపూర్లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ :రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో ఆదివారం తెల్లవారుజామున ఓ వర్క్షాపులో ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఇదే ప్రాంతంలో రెండో అగ్నిప్రమాదం సంభవించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement