- సబ్ యూనిట్ అధికారులకు డీఎంహెచ్‌ఓ సూచన
మలేరియాను అరికట్టాలి
Published Wed, Aug 17 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
ఎంజీఎం/హసన్‌పర్తి : సబ్ యూనిట్ అధికారులు పీహెచ్‌సీల్లోని సిబ్బంది కి, ప్రజలకు మధ్య సమన్వయకర్తలుగా పనిచేసి మలేరియా అరికట్టాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అన్నారు. హసన్‌పర్తి పీహెచ్‌సీ ఆవరణలోని క్లస్టర్ సమావేశ మందిరంలో జోనల్ (వరంగల్, కరీంనగర్) మలేరియా వర్క్‌షాప్ మంగళవారం జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్యఅతిథిగా హాజరైన డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. ఏటా 1.5 మిలియన్ల ప్రజలు మలేరియా బారిన పడుతున్నారని తెలిపారు. సబ్ యూనిట్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్న సమయంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దోమలతో ప్రాణాంతక మెదడువాపు, డెంగీ, మలేరియా, చికున్ గున్యా, బోధకాలు వ్యాపిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మలేరియా అధికారి జయశ్రీ, జిల్లా మలేరియా అధికారి పైడిరాజు, జిల్లా హెల్త్ ఎడ్యూకేటర్ అన్వర్, సమన్వయర్తగా వ్యవహరించిన పరంజ్యోతి, పళినాకుమారి, విప్లవ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement