
నేడు జనసేన ఆధ్వర్యంలో వర్క్‌షాప్
మంచిర్యాల జిల్లాకేంద్రంలోని జనసేన ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకుడు పర్దిపూర్ నర్సింహా తెలిపారు.
► రాష్ట్ర నాయకుడు నర్సింహా
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మంచిర్యాల జిల్లాకేంద్రంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాలులో జనసేన ఆధ్వర్యంలో వర్క్‌షాప్ శనివారం నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకుడు పర్దిపూర్ నర్సింహా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీలోకి వచ్చేవారికి కార్యకర్తలు, నాయకులకు సామర్థ్యపు పరీక్షలు నిర్వహి స్తామన్నారు. విశ్లేషకులు, విషయ రచయితలు, వక్తలుగా రాణించే వారికి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీలో పదవిని ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రజాస్వామ్యం కోసం ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు వర్క్‌షాప్ ఉంటుందన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి శంకర్‌గౌడ్, మీడియా హెడ్ హరిప్రసాద్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సైదాల శ్రీనివాస్, గుంత సంతోశ్, ఆవునూరి రమేశ్, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.