కుట్ర రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు | Chandrababu is a carafe for conspiracy politics | Sakshi
Sakshi News home page

కుట్ర రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు

Published Sat, Nov 2 2024 3:58 AM | Last Updated on Sat, Nov 2 2024 10:40 AM

Chandrababu is a carafe for conspiracy politics

పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే..

2022లో విజయమ్మ వాహనం టైర్‌ పంక్చర్‌నూ రాజకీయంగా వాడుకున్న వైనం

టీడీపీ ట్విటర్‌ హ్యాండిల్‌ వేదికగా దుష్ప్రచారం.. హామీలు అమలు చేయలేక, అసమర్థతను కప్పిపుచ్చుకునే యత్నం 

మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ 

నీ సొంత చెల్లెలికి తిరుపతిలో యాక్సిడెంట్‌ చేయించింది నువ్వేనా?   

మీ బావమరిది నందమూరి హరికృష్ణ, జానకీరామ్‌లను చంపించింది నువ్వేనా? 

జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా కారు యాక్సిడెంట్‌లో చంపాలనుకున్నావా? 

నీ తమ్ముడు రామ్మూర్తినాయుడిని గొలుసులతో కట్టేసి చంపాలనుకున్నావా?

మరోవైపు టీడీపీ వైఖరిని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఎన్టీఆర్మరణం వెనుక ఉన్న కుట్ర అందరికీ తెలుసు

హరికృష్ణ మృతదేహం సాక్షిగా రాజకీయం చేసింది మీరు కాదా? 

దిగజారి పోవడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా  

సాక్షి, అమరావతి : చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక కుటుంబాల్లో కుంపట్లు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ నిప్పులు చెరిగింది. 2022లో వైఎస్‌ విజయమ్మ వాహనం టైర్‌ పంక్చరైన ఘటన 2024 ఎన్నికల ముందు జరిగినట్లుగా.. ‘ఎక్స్‌’లో వీడియో అప్‌లోడ్‌ చేసి, ఆ ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ.. దానిని జగన్‌కు ఆపాదిస్తూ నీచమైన కుతంత్రానికి పాల్పడింది. దీనిపై వైఎస్సార్‌సీపీ శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. 

చంద్రబాబును ట్యాగ్‌ చేస్తూ ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు.. వెన్నుపోటు రాజకీయాలు, హత్యా రాజకీయాలకు అలవాటుపడ్డ శాడిస్ట్‌ సీబీఎన్‌కు ఎక్కడ ఏం జరిగినా అలాగే కనిపిస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక కుటుంబాల్లో చంద్రబాబు చిచ్చు పెడుతూ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడు. ఈ సందర్భంగా చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఇవి మా అనుమానాలే కాదు.. ప్రజల అనుమానాలు కూడా. ‘

చంద్రబాబూ.. నీ సొంత చెల్లెలుకు తిరుపతిలో యాక్సిడెంట్‌ చేయించింది నువ్వేనా? మీ బావమరిది నందమూరి హరికృష్ణ బతికుంటే నీకు ఎప్పుడైనా ఇబ్బందే అనుకుని నువ్వే కారు యాక్సిడెంట్‌ చేయించి చంపించావా? నందమూరి హరికృష్ణ కొడుకు నందమూరి జానకీరామ్‌ని కూడా నువ్వే యాక్సిడెంట్‌ చేయించి చంపించావా? జూ.ఎన్టీఆర్‌ను కూడా కారు యాక్సిడెంట్‌లో చంపాలనుకున్నావా? నీ తమ్ముడు రామ్మూర్తినాయుడిని గొలుసులతో కట్టేసి, బంధించి చంపాలనుకున్నావా? దమ్ముంటే ఈ ప్రశ్న­లకు సమాధానం చెప్పాలి’ అని నిలదీసింది. 
 
ఏ పార్టీ దిగజారని నీచ స్థాయికి టీడీపీ 
నీచమైన ఆరోపణ చేయడం, దాన్ని టీడీపీ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేయడం చూస్తుంటే.. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత నీచ స్థాయికి దిగజారనంత పాతాళానికి టీడీపీ దిగజారి పోయిందని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్‌ మరణం వెనక ఉన్న కుట్ర ప్రపంచానికంతటికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

నందమూరి హరికృష్ణ మరణం వెనక కుట్ర ఉందని, ఆయన శవం వద్ద చంద్రబాబు రాజకీయాలు మాట్లాడిన తీరే అందుకు నిదర్శనం అని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్‌ కూడా చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు జూ.ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్‌ జరగడం వెనక.. ‘కొడుకు రాజకీయ భవిష్యత్‌’ను వెలిగించే కుట్ర ఉందనే విషయం చంద్రబాబు ‘రాజకీయం’ గమనిస్తున్న పరిశీలకులందరికీ తెలు­సని చెబుతున్నారు. 

సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడిని ఇంట్లో బంధించడం వెనుకా కుట్ర ఉందనే అనుమానాలు సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తమయ్యాయి. ఇంతకంటే దిగజారడు అని అనుకున్న ప్రతిసారీ.. అది తప్పు అని నిరూపించుకుంటారనే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement