
సాక్షి, వైఎస్సార్ కడప: అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని భూములతో వ్యాపారం చేశాడని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన స్వలాభం కోసం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చంద్రబాబు చుశాడన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రి పదవులు కట్టబెట్టి తమకు, తమ కుటుంబాలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కాగా ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదురించి సొంతంగా పార్టీ పెట్టిన నైజం ఆయనదన్నారు. తండ్రి దివంగత నేత వైఎస్సార్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను నెరవేర్చాలని, రాష్ట్రం అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కసిగా పని చేస్తున్నారని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment