సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి ఆది టీడీపీలో చేరింది మొదలు అనేక సందర్భాల్లో రామసుబ్బారెడ్డి ఆయన్ను బాహాటంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. శుక్రవారం చంద్రబాబు కడప ఎంపీ స్థానానికి ఆది, జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానానికి రామసుబ్బారెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఈ సందర్భంలో ఆది, రామసుబ్బారెడ్డిల మధ్య కొంత వివాదం జరిగినట్లు సమాచారం. కడప ఎంపీ స్థానానికి తాను వెళ్తున్నందున ఎమ్మెల్సీ స్థానానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని మంత్రి షరతు విధించారు. ఎంపీగా పోటీచేస్తున్న ఆది ఓడిపోతే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
మంత్రి షరతుతో మధ్యాహ్నమే రామసుబ్బారెడ్డి తన రాజీనామా లేఖను సీఎంకు అందించారు. జమ్మలమడుగు అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని ఖరారు చేయడంతో మంత్రి ఆది వర్గీయులు అలకబూని వెళ్లిపోయారు. వీరిమధ్య వివాదం సర్దుమణిగినట్లు పైకి కనబడుతున్నా.. ఒకరిని ఒకరు ఓడించుకుంటారనే భయంతో సీఎం చంద్రబాబు వీరిద్దరిని పిలిపించి మీడియా సమావేశం కలిసి నిర్వహించాలని ఆదేశించారు. దీంతో రాత్రికి వీరిరువురు కలిసి.. పార్టీని గెలిపించేందుకు కృషిచేస్తామని మీడియాతో చెప్పారు.
►జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి..
►ఇద్దరి పేర్లను ఖరారుచేసిన సీఎం చంద్రబాబు
►మంత్రి షరతుతో ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా!
►ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల మంత్రి వర్గీయుల అలక
Comments
Please login to add a commentAdd a comment