Ramasubba reddy
-
సృజనకు వివాహం ఆటంకమా?
భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించిన సందర్భంగా వివిధ పత్రికలు కలామ్ తన శాస్త్ర పరిశోధనలకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే బ్రహ్మచారిగా ఉండిపోయారని ప్రస్తావించాయి. మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా బ్రహ్మచారే! ప్రజాసేవకు సంసార జీవితం అడ్డు కాకూడదనే భావనతో ఆయన వివాహం చేసుకోలేదని అనేవారు. బ్రహ్మచారిగా మిగిలిపోయిన ప్రతి సెలబ్రిటీ గురించి ఇంచుమించు ఇలాంటి విషయమే చెబుతుంటారు. ఇందుకు తోడు ‘వివాహం విద్య నాశాయ’ అనే సూక్తి వింటూనే ఉంటాం.కానీ శాస్త్రీయంగా చెప్పాలంటే పెళ్ళి చేసుకోవడం వల్ల సృజనాత్మకత తగ్గిపోతుందని ఎక్కడా నిర్ధారణ కాలేదు. పెళ్ళయి చక్కటి వైవాహిక జీవితం గడుపుతూ సృజనాత్మక రంగంలో ప్రఖ్యాతి గాంచిన వారు చాలామందే ఉన్నారు. ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ మూడు సార్లు వివాహం చేసుకున్నారు. ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత, ప్రప్ర«థమ జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత కన్న దాసన్‌కు ముగ్గురు భార్యలన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కుశ్వంత్ సింగ్ చక్కటి వైవాహిక జీవితం గడుపు తూనే, ప్రముఖ రచయితగా పేరొందారు. చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలా మంది ప్రముఖులే ఉంటారు.కాకపోతే సృజనాత్మక రంగాలలో పని చేసేవారికి జీవిత భాగస్వాములుగా, క్రియే టివ్ రంగానికి చెందినవారు లేదా కనీసం దానిపట్ల ఆసక్తి ఉన్న వారు లభించే పక్షంలో ఆయా వ్యక్తులు మరింతగా రాణిస్తారు. క్రియేటివ్ వ్యక్తుల ఆలోచనా ధోరణికి ఇతరుల ఆలోచనా ధోరణులకు కొంత తేడా ఉంటుంది. దాని వల్ల వారి దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కొందరు రచయితలు రాత్రంతా మేల్కొని తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించి పగలు నిద్రపోతుంటారు. కళాకా రులు, నటులు... షూటింగ్‌లు, రిహార్సల్స్ అని అర్ధరాత్రి వరకు కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇంటికి వస్తే, ఇంట్లో వారి భాగస్వామి సర్దుకు పోలేక పోవచ్చు. వాస్తవానికి ఆ స్థితికి ఎవర్నీ తప్పు పట్టలేం! పరస్పర విరుద్ధ మైన మనస్తత్వం కలిగినవారు వివాహం చేసుకోవడమే కారణం.వైవాహిక పరమైన సమస్యలు సృజనాత్మక రంగంలో పనిచేసే వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. క్రియేటివ్ వ్యక్తులకు ఇంటి బాధ్య తలు, భాగస్వామి కోర్కెలు చిన్న విషయాలుగా కనిపిస్తాయి. సహజంగా రచయితలు తమ రచనలకు సంబంధించి మేధా మథనం చేస్తుంటారు. ఆ సమయంలో భార్య వచ్చి ఇంటి సమస్యలు ఏకరువు పెడితే అతని ఆలోచనలకు ఆటంకం కలగవచ్చు. ఇంకో ముఖ్య విషయమేటింటే, క్రియేటివ్ వ్యక్తులకు వారి భావాలు వెలికి వచ్చేందుకు ఒక ఉత్ప్రేరకం అవసరం కావచ్చు. ‘మేఘసందేశం’ సినిమాలో నాగేశ్వరరావుకు జయ సుధ ఉత్తమ ఇల్లాలైనప్పటికీ ఆయనలోని రచయితకు, గోదావరి ఒడ్డున నాట్యం చేసే జయప్రద ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.అయితే జీవిత భాగస్వామి ఏ మాత్రం సహకరించకపోయినా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేధావులు ఎందరో వున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ భార్య పరమ గయ్యాళి అని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ప్రముఖ రచయిత బెర్నార్డ్ షా భార్యతో కలిసి ఒక పార్టీకి వెళ్ళినపుడు అందరూ ఆనందంగా డాన్స్ చేస్తుంటే, భార్య కూడా చేద్దామని పిలుస్తుంది. ఆయన ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ, ‘తర్వాత రాసే నవల ప్లాన్ గురించి ఆలోచిస్తున్నాను, నేను రా’నంటాడు. ‘ఎప్పుడూ రచనలేనా, కొంచెం సేపు జీవితంలో ఎంజాయ్మెంట్ కూడా ఉండా’లంటుంది. అందుకాయన ‘ఈ డాన్స్ వల్ల వచ్చే ఆనందం క్షణికమైనది. కానీ నేను ఆలోచించి రాసే నవల వల్ల వచ్చే ఆనందం, కీర్తి శాశ్వతంగా ఉంటా’యంటాడు. వృత్తి ముఖ్యమా, ఆనందించడం ముఖ్యమా అంటే, ఎవరికి నచ్చిన దాంట్లోనే వారికి ఆనందం ఉంటుంది.క్రియేటివ్ రంగంలో ఉన్నవారు తమకు తగిన జీవిత భాగస్వామి లభించలేదని బాధపడాల్సిన పని లేదు. ఇరువురికి ఎలాంటి వాటిల్లో అభిప్రాయ బేధాలు వస్తున్నాయో, సమ స్యలు ఎదురవుతున్నాయో గుర్తించి, ప్రయారిటీ ప్రకారం వాటిని సామ రస్యంగా పరిష్కరించు కోవాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరికి చెప్పు కోవాలి. కార్లు, బంగళాలు లేకపోయినా, క్రియేటివ్ రంగంలో ఉండటం వల్ల సమాజంలో లభించే గౌరవం, కీర్తి గురించి అవతలి వ్యక్తికి తెలియ జెప్పాలి. క్రియేటి విటీకి ఆటంకం కల్గకుండా, వైవాహిక జీవితానికి ఇబ్బందులు కల్గకుండా వర్క్–లైఫ్ బేలన్స్ చేసుకోవాలి. అప్పుడు వైవాహిక జీవితం, సృజనాత్మకత కలకాలం పరిపూర్ణంగా ఉంటాయి.డా‘‘ ఇండ్ల రామసుబ్బా రెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ‘ 9348114948 -
‘జమ్మలమడుగు’లో వారిద్దరు కలిసి పని చేస్తారు: సజ్జల
సాక్షి, అమరావతి: ఏడాది క్రితమే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మా పార్టీలోకి వచ్చారు.. కోవిడ్ తీవ్రమవడంతో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం ఆలస్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు సీఎం జగన్‌ను రామసుబ్బారెడ్డి కలిశారు, పార్టీలో రామసుబ్బారెడ్డికి సముచిత గౌరవం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సుధీర్‌రెడ్డి కష్టకాలంలో నిలబడి పోరాడారు.. ఎమ్మెల్యేగా గెలిచారు.. వచ్చే ఎన్నికల్లో కూడా సుధీర్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని ప్రకటించారు. 2023లో వచ్చే శాసనమండలికి రామసుబ్బారెడ్డి అనుభవాన్ని వాడుకుంటాం.. నియోజకవర్గ విభజన జరిగితే ఇద్దరికీ చెరో స్థానం ఇస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా రాజకీయాల్లో రామసుబ్బారెడ్డి కీలకంగా ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి రామసుబ్బారెడ్డి పనిచేస్తారు అని ప్రకటించారు. సీఎం జగన్ నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని రామసుబ్బారెడ్డి తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా తగిన గుర్తింపు ఇస్తామని సీఎం చెప్పారని పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఇబ్బంది లేకుండా మేం పనిచేస్తాం, వచ్చే ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని చెప్పారు. సుధీర్‌రెడ్డి కోసం నేను, మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారని స్పష్టం చేశారు. చదవండి: డ్రగ్స్ ఎమ్మెల్యేలు, వసూల్ మంత్రిని తొలగించండి చదవండి: వాళ్ల కాళ్లు పట్టుకుని చంద్రబాబు సీఎం అయ్యారు -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: రామసుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. రామసుబ్బారెడ్డితో పాటు తుంగభద్ర హెచ్ఎల్సీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ గిరి వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ సీఎం వైఎస్ జగన్...కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. (వైఎస్సార్సీపీలో భారీ ఎత్తున చేరికలు) అనంతరం రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం ఆ పార్టీలో ఉంది. దశాబ్దాల పాటు టీడీపీలో ఉండి సేవలు అందించడమే కాకుండా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాం. నేను జైల్లో ఉన్నా మా కార్యకర్తలు టీడీపీలో ఉన్నారు. మా కార్యకర్తల అభిప్రాయం మేరకే నేను స్వచ్ఛందంగా వైఎస్సార్ సీపీలో చేరాను. మమ్మల్ని ఎవరూ బెదిరించడం లేదు. మనస్ఫూర్తిగా వైఎస్సార్ సీపీలో చేరాం. టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేక పార్టీ మారుతున్నాం. (వైఎస్సార్సీపీలో చేరిన కదిరి బాబూరావు) సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆయన అమలు చేస్తున్నారు. జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, సంక్షేమ పథకాలను సీఎం జగన్ చేపట్టారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఒక డైనమిక్ లీడర్ షిప్‌తో సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం మంచి నిర్ణయం. ప్రజాదరణతో ఏర్పడిన ప్రభుత్వంలో పాలుపంచుకోవాలని మేం వచ్చాం. పార్టీలో చేర్చుకున్నందుకు జగన్ గారికి కృతజ్ఞతలు. టీడీపీలో లోపాలు గుర్తించారు కాబట్టే ప్రజలు అలాంటి తీర్పునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్ సీపీ స్వీప్ చేస్తుంది’ అని అన్నారు. (‘సతీష్‌రెడ్డి మాటలకు బాబు సిగ్గుతెచ్చుకోవాలి’) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘సీజం జగన్ నాయకత్వంలో పని చేయాలని రామసుబ్బారెడ్డి భావించారు. ఆయన వైఎస్సార్ సీపీలో చేరడం మంచి శుభ పరిణామం. సీఎం జగన్ పాలనను చూసే టీడీపీలోని ముఖ్యనేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వం మీద నిస్తేజం వచ్చి ఆ పార్టీ నేతలు వైఎస్సార్ సీపీలోకి వస్తున్నారు. అయితే ఆయన ఆ విషయాన్ని గుర్తించకుండా వైఎస్సార్ సీపీని నిందిస్తున్నారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తిరస్కరించడమే కాకుండా, పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు’ అని పేర్కొన్నారు. (ఓటమికి ముందే సాకులు వెతుకుతున్న బాబు) -
షాద్‌నగర్ కేసులో రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్చిట్
సాక్షి, న్యూఢిల్లీ : షాద్‌నగర్ జంట హత్యల కేసులో మాజీమంత్రి రామ సుబ్బారెడ్డిని సుప్రీంకోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం రామ సుబ్బారెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. 1990లో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బంధువులు శంకర్‌రెడ్డి, గోపాల్ రెడ్డిలను ప్రత్యర్థులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏడాదిన్నరపాటు జైల్లో ఉన్నరామసుబ్బారెడ్డిని 2006లో హైకోర్టు కేసును కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆదినారాయణరెడ్డి కుటుంబం 2008లో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోగా దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆదినారాయణరెడ్డి అలాగే రామసుబ్బారెడ్డి ప్రస్తుతం ఒకే పార్టీ(టీడీపీ)లో ఉన్నారు. దీంతో ఆ పార్టీ అధినేత ఇరు వర్గాల మధ్య రాజీ కుదుర్చడంతో ఆదినారాయణ కుటుంబం సుప్రీంకోర్టులో తాము రాజీ పడుతున్నట్లు తెలిపింది. కాగా నేడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. -
ఫ్యాక్షన్ రాజకీయాల్లో బడుగులే సమిధలు!
సాక్షి, అనంతపురం : పది మంది బతుకు కోరేవాడు నాయకుడు.. తాను నాయకుడిగా ఎదగడం కోసం పది మిందిని సమిధలు చేసే వాడు స్వార్థపరుడు.. మరి ఈ నేతలను ఏమంటారో జనమే చెప్పాలి.. తమ నాయకుడి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారు కొందరు.. ప్రాణాలు కోల్పోయిన వారు మరికొందరు.. మనిషే కనిపించక, ఏమైపోయారో తెలియక కనుమరుగైన వారు ఇంకొందరు.. వీరంతా ఇల్లు, ఇల్లాలు, పిల్లలను వదిలి నేతల బాగు కోసం ప్రాణాలే ధారపోశారు. మంచో.. చెడో, తెలిసో.. తెలియకో వారి వెంట నడిచారు. ఇలాంటి తరుణంలో ఆ నేతలు వారి స్వార్థానికి జైకొట్టి.. ఇన్నాళ్లూ ఎవరితోనైతే ఫ్యాక్షన్ నడిపారో ఇప్పుడు వారితోనే కలిసి రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో గుల్లకుంట(బాంబుల) శివారెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి కుటుంబాల రాజకీయ మనుగడ కోసం ఇరువైపులా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లో ఆది పెద్దనాన్న దేవగుడి శంకర్‌రెడ్డి, బీమగుండం గోపాల్‌రెడ్డి హైదరాబాద్ నుంచి జమ్మలమడుగుకు వస్తుంటే.. షాద్‌నగర్ వద్ద బస్సు నిలిపేసి వారిద్దరినీ చంపారు. ఈ జంట హత్యలతో ఫ్యాక్షన్‌కు బీజం పడింది. ఈ కేసులో ఇప్పటి టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి రామసుబ్బా రెడ్డి రెండేళ్లు శిక్ష అనుభవించారు. ఈ హత్యకు ప్రతీకారంగా 1993లో శివారెడ్డిని.. ఆది వర్గం చంపింది. ఈ రెండు కుటుంబాల మధ్య నడిచిన ఫ్యాక్షన్‌లో కనీసం 300 మంది బలయ్యారు. రాజకీయంగా రెండు కుటుంబాలు బలపడిన తర్వాత పెద్దముడియం, కొండాపురం, ముద్దనూరు, మైలవరం మండలాల్లో జరిగిన హత్యలు కోకొల్లలు. మైలవరం మండలం కల్లుట్ల గ్రామాన్ని రామసుబ్బారెడ్డి వర్గీయులు పూర్తిగా తగలబెట్టారు. కొండాపురం మండలం కోడిగాండ్లపల్లి కూడా దహనమైంది. ఈ కేసుల్లో వందల మంది జైలు జీవితం గడిపారు. కర్నూలు, అనంతలో ఇదే తీరు.. కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి, గౌరు వెంకటరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కొనసాగింది. బైరెడ్డి తండ్రి శేషశయనారెడ్డి, గౌరు బంధువు మద్దూరు సుబ్బారెడ్డి హత్యకు గురయ్యారు. తర్వాత ఇరు కుటుంబాల మధ్య రాజకీయానికి కనీసం 30 మంది బలై ఉంటారు. ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం ఇద్దరూ ఏకమై టీడీపీలో చేరారు. కేఈ కృష్ణ్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబాల మధ్య మూడు తరాలుగా పోరు నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కేఈ మాదన్న కుటుంబాల మధ్య మొదలైన ఆధిపత్య పోరులో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడుతో సహా చాలామంది బలయ్యారు. అనంతపురం జిల్లాలో కలకలం రేపిన పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. జేసీ కనుసన్నల్లోనే హత్య జరిగిందని మొన్నటి వరకూ పరిటాల కుటుంబం ఆరోపించింది. ఇపుడు జేసీ టీడీపీతో జట్టు కట్టడంతో పరిటాల శ్రీరాం, జేసీ పవన్‌కుమార్‌రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరిగే పరిస్థితి. కృష్ణా జిల్లాలో కలకం రేపిన ఘటన వంగవీటి రంగా హత్య. దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా కుటుంబాల మధ్య ‘ఫ్యాక్షన్’ తరహాలో ‘రౌడీయిజం’ నడిచింది. ఈ రెండు కుటుంబాల రాజకీయ మనుగడ కోసం ఇక్కడ కూడా అనేక మంది బలయ్యారు. ఇప్పుడు వీరు కూడా గతం మరిచి టీడీపీలో కొనసాగుతున్నారు. కేఈ–కోట్ల, ఆది–రామసుబ్బారెడ్డిని ఒకే వేదికపై తెచ్చిన ఘనత టీడీపీది అని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. నిజానికి వీరంతా నిజంగా శాంతి కోసమో, తమ వర్గీయుల కోసమో రాజీ అయి ఉంటే నిస్వార్థంగా రాజీ కావాలి. కలిసిన ప్రతి కుటుంబం వెనుక స్వార్థ రాజకీయ కాంక్ష ఉంది. కేవలం ఎంపీగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు రాజకీయ సమీకరణల నేపథ్యంలో చేతులు కలిపారు. ఈ కలయికను ఆయా నాయకుల వెంట ఉండి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల వారు చీదరించుకుంటున్నారు. తిరిగి ఇలాంటి వారికి అండగా నిలిస్తే మళ్లీ వారి రాజకీయ ఎదుగుదల కోసం మళ్లీ ఫ్యాక్షన్ భూతాన్ని ఉసిగొల్పుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఈనెల 11న ఏం చేయాలో అది చేస్తామని చెబుతున్నారు. హత్య జరినప్పుడు ఒకరిద్దరు నాయకులపై కేసు కడతారు. తర్వాత కోర్టులో కొట్టేస్తారు. కానీ నాయకుల వెంట తిరిగిన బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై మాత్రం రౌడీషీట్లు తెరిచారు. ఈ పరిస్థితిలో ‘మా కోసం బలైన కుటుంబాల పరిస్థితి ఏంటి? అని నేతలు ఆలోచించలేదు. స్వార్థం కోసం మా త్యాగాలను కాదన్నారు. ఇలాంటి వారి కోసమా.. మేము ఇంతకాలం త్యాగాలు చేసింది?’ అని ఆయా వర్గాల ప్రజలు రగిలిపోతున్నారు. -
మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్
సాక్షి, జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్ తగిలింది. మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, సమన్వయకర్త సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలకు చెందిన కీలక శ్రేణులు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ ఇద్దరు నేతలకు మద్దతుగా ఉన్న 80 కుటుంబాలు తాజాగా వైఎస్సార్సీపీలోకి వచ్చాయి. వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం కొండపాంపల్లి గ్రామంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. -
కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి ఆది టీడీపీలో చేరింది మొదలు అనేక సందర్భాల్లో రామసుబ్బారెడ్డి ఆయన్ను బాహాటంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. శుక్రవారం చంద్రబాబు కడప ఎంపీ స్థానానికి ఆది, జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానానికి రామసుబ్బారెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఈ సందర్భంలో ఆది, రామసుబ్బారెడ్డిల మధ్య కొంత వివాదం జరిగినట్లు సమాచారం. కడప ఎంపీ స్థానానికి తాను వెళ్తున్నందున ఎమ్మెల్సీ స్థానానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని మంత్రి షరతు విధించారు. ఎంపీగా పోటీచేస్తున్న ఆది ఓడిపోతే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మంత్రి షరతుతో మధ్యాహ్నమే రామసుబ్బారెడ్డి తన రాజీనామా లేఖను సీఎంకు అందించారు. జమ్మలమడుగు అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని ఖరారు చేయడంతో మంత్రి ఆది వర్గీయులు అలకబూని వెళ్లిపోయారు. వీరిమధ్య వివాదం సర్దుమణిగినట్లు పైకి కనబడుతున్నా.. ఒకరిని ఒకరు ఓడించుకుంటారనే భయంతో సీఎం చంద్రబాబు వీరిద్దరిని పిలిపించి మీడియా సమావేశం కలిసి నిర్వహించాలని ఆదేశించారు. దీంతో రాత్రికి వీరిరువురు కలిసి.. పార్టీని గెలిపించేందుకు కృషిచేస్తామని మీడియాతో చెప్పారు. ►జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి.. ►ఇద్దరి పేర్లను ఖరారుచేసిన సీఎం చంద్రబాబు ►మంత్రి షరతుతో ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా! ►ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల మంత్రి వర్గీయుల అలక -
జమ్మలమడుగులో రెచ్చిపోయిన మంత్రి ఆది వర్గీయులు
-
సీఎం రమేష్‌పై మంత్రి ఆది సంచలన వ్యాఖ్యలు
-
వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్ నాదే
వైఎస్సార్ జిల్లా : జమ్మలమడుగులో రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్ తనదేనంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా సీనియర్ నాయకుడినని చెప్పారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఈ నెల 2న తనదైన శైలిలో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరని ప్రశ్నించారు . ‘జమ్మలమడుగులో పోటీ చేసేది తానేనని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో టికెట్స్ ప్రకటించే హక్కు మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు లేదు. పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నారు. లేని పోనీ ప్రకటనలు చేసి నియోజకవర్గంలో వర్గపోరు పెంచుతున్నారు’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఇద్దరూ పరస్పరం బహిరంగ వ్యాఖ్యలు చేసుకోవడంతో అదిష్టానానికి కూడా ఎవరికి టికెట్ కేటాయించాలో పాలుపోవడం లేదు. గత ఫ్యాక్షన్ గొడవలతో ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. -
మేం ఉండాలా? పోవాలా?
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకునేప్పుడు, మంత్రిని చేసేప్పుడు మాకెలాంటి ఇబ్బంది ఉండదనీ, పార్టీలో మా ప్రాధాన్యత అలాగే ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. పార్టీలో మాకు విలువే లేకుండా పోయింది. చిన్నస్థాయి అధికారులు కూడా మామాట వినడం లేదు. మా సహనానికీ హద్దు ఉంటుంది. అవసరం కోసం పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారు. అందుకే మహానాడుకు రాకుండా మా బాధ తెలియ చెప్పాం. ఇట్లా చేస్తా ఉంటే మేం ఉండాలా? పోవాలా?’ అని మాజీమంత్రి పి. రామసుబ్బారెడ్డి, ఆయన చిన్నమ్మ లక్ష్మీదేవమ్మ సీఎం చంద్రబాబునాయుడుతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం అమరావతిలో వారు చంద్రబాబును కలిశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తే గానీ మేం తలెత్తుకుని తిరగలేమని, ఆ తర్వాత మీ ఇష్టమని కుండబద్ధలు కొట్టారు. పీఆర్‌కు తగ్గిన ప్రాధాన్యం వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకునేప్పుడు, ఆయన్ను మంత్రిని చేసేప్పుడు రామసుబ్బారెడ్డి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. పార్టీ అవసరాల రీత్యా ఆదికి మంత్రి పదవి ఇస్తున్నామనీ, రామసుబ్బారెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం స్వయంగా బుజ్జగించారు. అయితే ఆది మంత్రి అయ్యాక రామసుబ్బారెడ్డి పరిస్థితి దయనీయంగా మారింది. మండలస్థాయి అధికారులు కూడా మంత్రి చెప్పిందే చేస్తూ పీఆర్ని ఆయన కుటుంబీకులను లెక్కలోకే తీసుకోవడం లేదు. దీంతో గత కొంతకాలంగా రామసుబ్బారెడ్డి, ఆయన కుటుంబీకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కడపలో నిర్వహించిన మినీ మహానాడుకు డుమ్మా కొట్టారు. విశాఖపట్నంలో జరిగిన మహానాడుకు హాజరుకావాలని సీఎం స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా హాజరుకాకుండా తమ నిరసన తెలియచేశారు. జిల్లా పార్టీ నేతృత్వంలోజరిగే ముఖ్య కార్యక్రమాలతోపాటు, నియోజకవర్గంలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదికీ, మాజీమంత్రి పీఆర్‌కి మధ్య సంబం«ధాలు మరింత చెడిపోయాయి. ఎమ్మెల్సీ పదవితో సమాంతర రాజకీయం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి పొంది ఆ అధికారంతో నియోజకవర్గంలో మంత్రి ఆదికి సమాంతరంగా రాజకీయం నడపాలని పీఆర్ కుటుంబం నిర్ణయించుకుంది. ఇదే సమయంలో సీఎం సమయం ఇవ్వడంతో శనివారం ఆయన్ను కలిశారు. ప్రాంతీయ సమన్వయం, సామాజిక సమన్వయం కారణాలు చెప్పి గవర్నర్ పదవి ఇవ్వకుండా మరోసారి తమను మోసగించొద్దని వారు చంద్రబాబుకు గట్టిగా చెప్పారు. ఆది నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇచ్చిన హామీ ఉత్తిదే అయ్యిందనీ, నియోజకవర్గంలోను, మా గ్రూపు జనం దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి కల్పించారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదినారాయణరెడ్డి నుంచి తమకు ఎదురవుతున్న సమస్యలన్నీ క్షుణ్ణంగా సీఎంకు వివరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం వారిని సముదాయించారు. మంత్రి ఆదితో తాను స్వయంగా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని బుజ్జగించి పంపారు. కమిషనర్ బదిలీపై ఆగ్రహం జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన లక్ష్మీరాజ్యం తమ మాట వినడం లేదని రామసుబ్బారెడ్డి ఆమెను బదిలీ చేయించారు. ఆ స్థానంలో మధుసూదన్‌రెడ్డిని నియమింప చేసుకున్నారు. ఆది మంత్రి కాగానే మధుసూదన్‌రెడ్డిని బదిలీ చేయించి మళ్లీ లక్ష్మీరాజ్యంను నియమింప చేసుకున్నారు. ఈ పరిణామం రామసుబ్బారెడ్డికి ఆయన కుటుంబీకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తాము వద్దని బదిలీ చేయించిన కమిషనర్‌ను తమతో ఒక్కమాట కూడా చెప్పకుండానే మళ్లీ తేవడం తమను అవమానించినట్లేనని భావించారు. ఈ విషయం మున్సిపల్‌శాఖ మంత్రి పి. నారాయణ దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేకపోయింది. నియోజక వర్గంలోని ఇతర అధికారులు కూడా మంత్రి చెప్పినట్లే వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక రాజకీయం చేయడం ఎందుకని రామసుబ్బారెడ్డి చేతులెత్తేసి కూర్చుకున్నారు. జమ్మలమడుగుకు కొత్తగా మంజూరైన బార్ అండ్ రెస్టారెంట్‌ను తమ మద్దతుదారులకు ఇప్పించుకోవాలని రామసుబ్బారెడ్డి భావించారు. ఇందుకోసం మున్సిపల్ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందే ప్రయత్నం చేశారు. ఈ నెల 28న మున్సిపాలిటీలోని సంబంధిత అధికారులందరూ సెలవు పెట్టో, అందుబాటులో లేకుండానో పోయారు. ఇదే ట్రేడ్ లైసెన్స్‌ను దేవగుడి నారాయణరెడ్డి అల్లుడు నరసింహారెడ్డికి మంజూరు చేశారు. పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న తాము మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోలేని దయనీయ స్థితికి చేరుకోవడంతో రాజకీయ భవితవ్యంపై రామసుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మకు భయం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయంగా అడ్రస్ లేకుండా పోతామనే నిర్ణయానికి వచ్చారు. -
ఆయన మనుషులు... మమ్మల్ని చంపేస్తారు
► మాజీ మంత్రి పీఆర్ వర్గీయుల ఆందోళన ► కన్నీటిపర్యంతమైన అనుచరులు జమ్మలమడుగు: ‘వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు రామాంజనేయరెడ్డి ఆదివారం (పెద్దదండ్లూరు) ఊళ్లో పర్యటించారు. మా ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలని మా ఆయన కోరాడు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కల్పించుకుని.. రోడ్డు, నీళ్ల ట్యాంకు మీ నాయన కట్టించినాడా అని అడిగాడు. ఆ ట్యాంకు మా కోసం కాదు.. పెద్ద రెడ్ల కోసం కట్టించారని మా ఆయన చెప్పాడ'ని దాడికి గురైన సుబ్బరాయుడు (గోపన్న) భార్య ఓలమ్మ.. మాజీ మంత్రి, టీడీపీ నేత పి.రామసుబ్బారెడ్డి(పీఆర్) ఎదుట వాపోయింది. ఇంకా ఆమె మాట్లాడుతూ..'దీంతో ఎమ్మెల్యే సోదరుడు రామాంజనేయులరెడ్డి మా ఆయన్ను దర్గా దగ్గర నుంచి చెప్పులతో కొట్టుకుంటూ వచ్చారు. మేము తక్కువ కులానికి చెందినవారం కాబట్టే దేవగుడి గ్రామంలో నుంచి ఐదు ట్రాక్టర్లలో జనాలను పిలుచుకుని వచ్చి మా వాళ్ల ఇండ్లపై దాడి చేశారు. మాకు కేసులు.. గీసులు వద్దు.. మీరు ఇప్పుడు మా ఇంటికి వచ్చినందున వాళ్లు మమ్మల్ని చంపడం ఖాయం. ఇక ఇక్కడ ఉండి పొలం పనులు చేసుకోలేమ’ని పి.రామసుబ్బారెడ్డి(పీఆర్)కు చెప్పింది. ఆదివారం పెద్దదండ్లూరులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయుల దాడికి గురైన బాధితులతో సోమవారం రామసుబ్బారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఆదివారం ట్రాక్టర్లలో జనాలు వచ్చి మా ఇంటి ఆవరణలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. ట్రాక్టర్ ట్రాలీ కోసం ఉంచుకున్న రూ. 50 వేల డబ్బులను కూడా తీసుకెళ్లారు’ అంటూ మరో బాధితురాలు ప్రమీల ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఎదుట ఎమ్మెల్యే సోదరునితో పాటు వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి కూడా నన్ను కొట్టాడు’ అని సుబ్బరాయుడు వివరించాడు. గ్రామాల్లో భయందోళన కలిగిస్తున్న వారిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. గ్రూపులను ప్రోత్సహిస్తున్న పీఆర్: ఆది గ్రూపు రాజకీయాలను ప్రొత్సహించడానికే రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామంలో పర్యటించారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. గ్రామంలో ఓ వ్యక్తి తనకు వ్యక్తిగతంగా ఏమీ చేయలేదని కత్తితో బెదిరించాడన్నారు. తాను ఎక్కడ కూడ ఫ్యాక్షన్‌ను ప్రొత్సహించడం లేదని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నానన్నారు. టీడీపీని బలోపేతం చేయాటానికి తామిద్దరిని(పీఆర్, ఆది) కలపాలని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డిని కోరానన్నారు. -
ఎమ్మెల్యేపై మాజీమంత్రి రామసుబ్బారెడ్డి ఫైర్
వైఎస్ఆర్ జిల్లా: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. వియ్యంకుడు కేశవరెడ్డి చేసిన రూ 850 కోట్ల అప్పును తప్పుదోవ పట్టించడానికే ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నారని రామసుబ్బారెడ్డి ఆరోపించారు. వైఎస్ కుటుంబం ద్వారా బతికిన ఆదినారాయణ ఇప్పుడు ఆ కుటుంబానికే వెన్నుపోటు పొడుస్తున్నారని రామసుబ్బారెడ్డి విమర్శించారు. -
జగన్‌ను కలిసిన టీడీపీ నేతలు
వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం బోడితిప్పనిపాడు గ్రామానికి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి బంధువు రామలింగేశ్వరరెడ్డి శనివారం జమ్మలమడుగులో వైఎస్ జగన్‌ను కలిశారు. త్వరలో తాము టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి వస్తామని తెలిపారు. అంతకుముందు పులివెందుల నుంచి జమ్మలమడుగుకు వెళ్తున్న జగన్‌ను మార్గంమధ్యలో ముద్దనూరు మండలం యామవరం, నల్లబల్లె గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు బాలమునిస్వామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి కలిశారు. వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలు వారిని జగన్‌కు పరిచయం చేయగా, ఆయన వారిని ఆప్యాయంగా పలకరించారు.