![MLA Kakani Govardhan Reddy Fires On TDP Leader Somireddy - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/10/mla-kaakani.jpg.webp?itok=IBKzAxst)
సాక్షి, నెల్లూరు జిల్లా: కంటెపల్లిలో గ్రావెల్ తవ్వకాలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. అటవీ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే టీడీపీ ఆరోపణలపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిజ నిర్థారణ చేపట్టారు. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకాగా, టీడీపీ నేతలు ముఖం చాటేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందన్నారు. పంచ భూతాలను దోచేసిన ఘనులు టీడీపీ నేతలంటూ ఎమ్మెల్యే కాకాణి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment