ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో సుబ్బారెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ కేంద్రకార్యాలయం లోటస్‌పాండ్‌లో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.