నిబంధనలు ఉల్లంఘించిన సోమిరెడ్డి | AP Mnister Somai Reddy Chandramohan Reddy Violated The Election Code | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘించిన సోమిరెడ్డి

Published Fri, May 3 2019 7:02 PM | Last Updated on Fri, May 3 2019 7:02 PM

AP Mnister Somai Reddy Chandramohan Reddy Violated The Election Code - Sakshi

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించారు. సచివాలయం ఆరుబయట మంత్రి ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఎన్నికల కోడ్‌ హద్దు మీరారు. ‘పొని’ తుపానుపై సమీక్ష నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో వ్యవసాయశాఖ అధికారులు మంత్రి సోమిరెడ్డిని కలిశారు. గతంలో రెండుసార్లు మంత్రి సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షకు అధికారులు గైర్హాజరైన సంగతి తెల్సిందే. తుపానుపై ఈసీ అనుమతితో ఈరోజు మంత్రికి అధికారులు బ్రీఫ్‌ చేశారు.

మంత్రులు మీడియాతో సమీక్షల వివరాలు మాట్లాడకూడదని నిబంధనలు ఉన్నాయి.. అయినా సచివాలయంలోని గార్డెన్‌లో సమీక్షల వివరాలను మంత్రి ప్రకటించారు. ఈ విషయంపై ఓ విలేకరి మంత్రిని ప్రశ్నించారు.  ఈసీ అనుమతితో సమీక్ష నిర్వహిస్తున్నారా అని ఓ విలేకరి, మంత్రి సోమిరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. దీనికి ఆయన పొంతలేని సమాధానాలు చెబుతూ సమాధానం దాటవేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement