టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్‌ | Minister Kakani Govardhan Reddy Counter To Tdp Leader Somireddy | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్‌

Published Sun, Apr 2 2023 8:10 PM | Last Updated on Sun, Apr 2 2023 8:19 PM

Minister Kakani Govardhan Reddy Counter To Tdp Leader Somireddy - Sakshi

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నిన్నటి వరకు ప్రభుత్వంపై ఫ్రస్టేషన్‌ చూపించారు.

సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నిన్నటి వరకు ప్రభుత్వంపై ఫ్రస్టేషన్‌ చూపించారు. ఉద్యోగులపై సోమిరెడ్డి వాడిన భాష మంచిది కాదు. సోమిరెడ్డి చెప్పినట్టు అధికారులు వినలేదనే వారిపై నోరు పారేసుకున్నారు. నీతి, నిజాయితీతో పనిచేసే అధికారులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అని  కాకాణి అన్నారు.

కాగా, ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నామని, తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement