సాక్షి, నెల్లూరు జిల్లా: తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లే అవుట్లు వేశారు. సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారని.. అక్రమ అక్రమ లే అవుట్‌లపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారని కాకాణి తెలిపారు.
‘‘40 లే అవుట్లు ఉన్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారు. 25 లే అవుట్లకు ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయలేదని వెల్లడించారు. టీడీపీ హయాంలోనే విజిలెన్స్ విచారణ చేసి రూ.6.5 కోట్లు జరిమానా విధించారు. కానీ అప్పట్లో సోమిరెడ్డి జోక్యం చేసుకుని డబ్బు కట్టకుండా చేశారు. ఈ వ్యవహారమంతా టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని’’ కాకాణి వివరించారు.
‘‘నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దమ్ముంటే విచారణ చేయండి. పొదలకూరులోని లేఅవుట్ దారులతో నెల రోజుల నుంచి సోమిరెడ్డి లావాదేవీలు జరుపుతున్నారు. అది కుదరకపోవడంతో నుడా అధికారుల వద్ద పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నేను ఏ విచారణకైనా సిద్ధం. సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు ఇస్తాం.. విచారణ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment