రైతు ముఖాముఖిలో మంత్రి సోమిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రామాపురం గ్రామంలో మంత్రి రైతు ముఖాముఖిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన రైతులు, 2013లో తాము తీసుకున్న రుణం ఇంతవరకూ మాఫీ కాలేదని మంత్రిని నిలదీశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం వల్లే టీడీపీకి ఓట్లేశామన్నారు.
దీంతో నష్టనివారణకు దిగిన మంత్రి వచ్చే ఎనిమిది నెలల్లో రుణమాఫీ 4, 5 విడతలు జరుగుతాయని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రైతులు ఉద్యాన పంటలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని, ఏడు గంటల నిరంతర విద్యుత్ అందించాలని మంత్రికి విన్నవించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment