loan wavier
-
మంత్రి సోమిరెడ్డిని నిలదీసిన రైతులు
సాక్షి, వైఎస్సార్ కడప : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రామాపురం గ్రామంలో మంత్రి రైతు ముఖాముఖిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన రైతులు, 2013లో తాము తీసుకున్న రుణం ఇంతవరకూ మాఫీ కాలేదని మంత్రిని నిలదీశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం వల్లే టీడీపీకి ఓట్లేశామన్నారు. దీంతో నష్టనివారణకు దిగిన మంత్రి వచ్చే ఎనిమిది నెలల్లో రుణమాఫీ 4, 5 విడతలు జరుగుతాయని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రైతులు ఉద్యాన పంటలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని, ఏడు గంటల నిరంతర విద్యుత్ అందించాలని మంత్రికి విన్నవించుకున్నారు. -
ఆత్మహత్యల్ని ఆపని రుణమాఫీలు
విశ్లేషణ సాధారణంగా రుణమాఫీ ప్రకటించిన తర్వాత రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గుముఖం పట్టాలి. రైతులందరికీ కాకున్నా, రుణ మాఫీ వల్ల సన్నకారు, చిన్నకారు రైతుల్లో ఒక సెక్షన్‌కు లభ్ది చేకూరుతుంది. కానీ రుణ మాఫీ ప్రకటించిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటే.. వ్యవసాయ సంక్షోభం గురించిన మన అవగాహనలో ఘోరమైన తప్పు ఏదో ఉందనే చెప్పాలి. బహుశా కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రుణ మాఫీ సరైన మార్గం కాకపోవచ్చు. తన ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు సన్నకారు రైతుల రుణాలను రద్దు చేస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పదే పదే నొక్కి చెబుతున్నారు. 10.25 లక్షల మంది రైతులకు మేలు చేకూర్చే ఈ రుణ మాఫీ వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 9,500 కోట్లు ఖర్చు అవుతుంది. మహారాష్ట్రలో తమ ప్రభుత్వం ప్రకటించిన రూ.34,000 కోట్ల రైతు రుణమాఫీ వల్ల 89 లక్షలమంది రైతులు లభ్ధి పొందుతారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. అయినప్పటికీ రుణమాఫీ ప్రకటిం చిన రాష్ట్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. గత 20 రోజుల్లో పంజాబ్‌లో 21మంది రైతులు ఆత్మహత్యల పాలబడ్డారు. తాను రుణ మాఫీ ప్రకటించినప్పటినుంచి రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి వాపోయారు. మహారాష్ట్రలో అయితే గత రెండు వారాల్లో 42మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క మరట్వాడా ప్రాంతంలోనే జూన్ 19 నుంచి జూన్ 25వరకు వారంరోజుల వ్యవధిలో 19మంది రైతులు తమ జీవితాలను ముగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లో పోలీసు కాల్పుల్లో 5గురు రైతులు చనిపోయిన నాటి నుంచి ఇప్పటివరకూ 38 మంది రైతులు ఆత్మహత్యల బారినపడ్డారు. రుణమాఫీల తర్వాత పెరుగుతున్న ఆత్మహత్యలు సాధారణంగా రుణమాఫీ ప్రకటించిన తర్వాత రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గుముఖం పట్టాలి. రైతులందరికీ కాకున్నా, రుణ మాఫీ వల్ల సన్నకారు, చిన్నకారు రైతుల్లో ఒక సెక్షన్‌కు లభ్ది చేకూరుతుంది. కానీ రుణ మాఫీ ప్రకటిం చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటే.. వ్యవసాయ సంక్షోభం గురించి మన అవగాహనలో ఘోరమైన తప్పు ఏదో ఉందనే చెప్పాలి. బహుశా కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రుణ మాఫీ సరైన మార్గం కాకపోవచ్చు లేదా రుణ మాఫీలు రూపొందించి అమలు చేస్తున్న విధానం సన్నకారు రైతులకు కూడా పెద్దగా లబ్ధి చేకూర్చకపోయి ఉండవచ్చు. వ్యవసాయ దిగుబడులకు తగిన ధర వచ్చే అవకాశం కనిపించని తరుణంలో, తదుపరి పంటకోసం తాను తీసుకోబోయే రుణాన్ని ఎలా చెల్లించాలి అన్నదే రైతుల సమస్య. రైతుల్లో చిన్న విభాగానికి ఇప్పటికే ఉన్న రుణం మాఫీ చేసినప్పటికీ, తదుపరి పంటకోసం కొత్తగా వీరు రుణం తీసుకోవలసిందే. ఇన్ని సంవత్సరాలుగా రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు పొందలేకపోయారని నేను అంగీకరిస్తున్నాను. అందుచేత రుణ మాఫీ అనేది రైతుకు ఎంతో కొంత చెల్లింపు సామర్థ్యాన్ని ఇస్తుందనే చూడాల్సి ఉంటుంది. అయితే రుణమాపీల వెనుక ఉన్న వాస్తవం కేసి కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని తలుస్తున్నాను. మన ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు మరింత సృజనాత్మకంగా వ్యవహరించి దీర్ఘకాలంలో రైతుల చేతుల్లో నిజ ఆదాయాలు చేకూరేలా చర్యలను సూచించాల్సి ఉంది. పంజాబ్ విషయం చూడండి. ఇది దేశానికే అన్నపూర్ణ. ఇక్కడ గోధుమ, వరి, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాల సాగు, ఉత్పత్తి 98 శాతం వరకు గ్యారంటీగా జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక శాతం సాగు, దిగుబడితో పంజాబ్ రికార్డు సృష్టిస్తోంది. కానీ ఇంత అభివృద్ధి సాధించిన రైతులు కూడా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో నాకు ఊహకు అందడం లేదు. పంజాబ్ ఇప్పుడు రైతు ఆత్మహత్యల ప్రధాన కేంద్రంగా మారింది. ప్రధాన కారణం... ఇక్కడి రైతులు కనీస మద్దతు ధర విధానం నుంచి తగిన ఆదాయం పొందకపోవడమే. విస్తృతమైన స్థాయిలో క్రమబద్ధీకరణకు గురైన మండీలు, గ్రామీణ రహదారులు ఉన్నప్పటికీ స్వామినాథన్ సిఫార్సు చేసినట్లుగా పంజాబ్‌లో వ్యవసాయానికి పెట్టిన ఖర్చుపై 50 శాతం లాభాలు కూడా రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయని నాకు ఆశ్చర్యం వేస్తుంది. పంటల సేకరణపై చక్కటి నెట్వర్క్ కలిగిన పంజాబ్, హరియాణాలకు ఇది మాత్రమే ఆచరణాత్మక పరిష్కారం, కానీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు మాత్రం నేను ఇదివరకే సూచించినట్లుగా రైతుల ఆదాయ కమిషన్‌ను ఏర్పర్చాల్సి ఉంది. దశాబ్దాలుగా క్షీణించిన కనీస మద్దతు ధర ఉదాహరణకు, పంజాబ్‌లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులకు సహాయం అందించాలంటే సంవత్సరానికి రూ. 8,237 కోట్లు ఖర్చవుతుంది. కానీ నా అంచనా మేరకు గోధుమ పంట పెట్టుబడి ఖర్చు క్వింటాలుకు రూ. 1,203లు అవుతుంది దీనికి 50 శాతం లాభాన్ని కలుపుకుంటే క్వింటాల్‌కు మొత్తం ఖర్చు రూ.1,805లు మాత్రమే అవుతుంది. క్వింటాలుకు కేంద్రం కనీస మద్దతు ధర కింద రూ.1,625లు చెల్లించింది కాబట్టి క్వింటాలుకు మిగిలిన రూ.180లను మాత్రమే ప్రభుత్వం రైతులకు అదనంగా చెల్లిస్తే చాలు. మరోవిధంగా చెప్పాలంటే, 2016–17 మార్కెటింగ్ సీజన్లో పంజాబ్‌లో రైతులు 106.5 లక్షల టన్నుల గోధుమ పండించారు. ఈ లెక్క ప్రకారం పంజాబ్ ప్రభుత్వంపై కేవలం రూ. 1,917 కోట్ల భారం మాత్రమే పడుతుంది. ఇక వరి విషయంలో, వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు, 50 శాతం లాభం కలిపితే కొంత ఎక్కువ మొత్తమే అవుతుంది. క్వింటాల్ వరికి ఈ ప్రాతిపదికన రూ. 1,484లు ఉత్పత్తి ఖర్చుకాగా 50 శాతం లాభాన్ని కలుపుకుంటే వరి క్వింటాల్ ఉత్పత్తి ధర రూ. 2, 226లు అవుతుంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తే పడే మొత్తం భారం రూ. 6,320 కోట్లు అవుతుంది. గోధుమ, వరి రెండు పంటలకూ పంజాబ్ ప్రభుత్వంపై పడే వార్షిక భారం రూ. 8,237 కోట్లు అవుతుంది. ప్రభుత్వంపై పడే ఈ రూ. 8,237 కోట్ల భారం అలవిమాలినదని, ప్రభుత్వ వనరులను వృధాపర్చడమేనని మీరనుకుంటే దీనిపై మళ్లీ ఆలోచించాల్సిందే. పంజాబ్ రైతులు గడచిన దశాబ్దాలుగా తమకు న్యాయంగా రావలసిన కనీస మద్దతు ధరకు దూరమైపోయారు. గతంలో బాదల్ ప్రభుత్వం నియమించిన డాక్టర్ ఆర్ఎస్ గౌమన్ కమిటీ రిపోర్టు ప్రకారం 1970–2007 మధ్య కాలంలో పంజాబ్ రైతులు కనీస మద్దతు ధరను అతి స్వల్పంగా పొందిన కారణంగా మొత్తం రూ. 62 వేల కోట్లు నష్టపోయారు. కాబట్టి వ్యవసాయంలో ఆర్థిక క్షీణత అనేది ఈనాటిది కాదు. హరిత విప్లవం మొదలైన కాలం నుంచే ఇలా జరుగుతూ వస్తోంది. మరి ఆ రైతులకు ఇది తిరిగి చెల్లించాల్సిన సమయం కాదా? ఇంకా ఎంతకాలం రైతులను రెండో తరగతి పౌరులుగా చూస్తూంటాం? రైతులకు కనీస మద్దతు ధర గురించి మాట్లాడితే చాలు, ఇది వాంఛనీయం కాదంటూ తీవ్రంగా నిరసనలు బయలుదేరతాయి. కనీస మద్దతు ధరను ఎన్నటికీ తక్కువగానే ఉంచాలని, లేకుంటే రిటైల్ ఆహార ధరలు పెరుగుతాయని వాదిస్తుంటారు. అంటే వినియోగదారులకు తక్కువ రేట్లకు ఆహార ధాన్యాలు అందించడం కోసం రైతులు నిత్య దారి ద్య్రంలో మునిగి తేలాల్సిందే అన్నమాట. ఉద్యోగులు సరే.. రైతుల, కూలీల సంక్షేమం ఎవరి బాధ్యత? పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య కూడా వ్యవసాయం అథఃపతనానికి దారి తీసింది. సంవత్సరాలుగా వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడంతో నగరాల్లో పనికి అవకాశాలు లేకపోవడంతో గ్రామీణ యువత డ్రగ్స్ తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. స్వావలంబనతో కూడిన జీవన పరిస్థితుల కల్పన ఒక్కటే ప్రస్తుతం వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చగలదు. పంజాబ్‌లోని 18 లక్షల వ్యవసాయ కుటుంబాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని ఈ కుటుంబాలు నమ్మినప్పుడే వ్యవసాయం విషయంలో పంజాబ్ గర్వంగా తలెత్తుతుంది. ఉడ్తా పంజాబ్ ఇమేజ్ను ముందుకు తీసుకుపోయి తక్కిన దేశానికి ఒక నమూనాగా నిలబడాలంటే దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి పంజాబ్‌కి ఇదే మంచి తరుణం. ఇక పంజాబ్ ప్రభుత్వం విషయానికి వస్తే తన ఉద్యోగులకు ఆదాయ ప్యాకేజ్, అలవెన్సుల పట్ల జాగ్రత్త తీసుకోవడం మాత్రమే కాకుండా, వ్యవసాయదారులు, కూలీల సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలి. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు hunger55@gmail.com దేవిందర్‌శర్మ -
బాధ్యత గుర్తించాలి
రైతు వ్యతిరేక ధోరణి ఉన్నవారు ఆర్ధికమంత్రులవుతారో, ఆ పదవి తీసుకున్న వారు అలా మారతారో చెప్పడం కష్టం. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రైతు రుణాల మాఫీపై చేసిన ప్రకటన అలాంటి సందేహాన్ని రేకెత్తిస్తోంది. రుణమాఫీ సంగతిని రాష్ట్రాలే చూసుకోవాలని, అందుకోసం కేంద్రం ఎలాంటి సాయమూ చేయబోదని ఒక సమావేశంలో సోమవారం ఆయన చెప్పారు. రైతు రుణాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు ప్రక్రియ ప్రారంభించాక తమకూ అమలు చేయాలంటూ వేర్వేరు రాష్ట్రాల్లో రైతులు ఉద్యమిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగ బోతున్న కర్ణాటకలో బీజేపీ సైతం అలాంటి డిమాండే చేస్తోంది. యూపీ ఎన్ని కల్లో బీజేపీ చేసిన ఈ వాగ్దానాన్ని అక్కడి రాష్ట్ర నేతలే ప్రచారం చేసి ఉంటే ఎలా ఉండేదోగానీ ప్రధాని నరేంద్ర మోదీ నోటి వెంబడి రావడంతో తేనెతుట్టె రేగింది. రుణమాఫీ రాష్ట్ర బీజేపీ వాగ్దానం మాత్రమేనంటూ ఇస్తున్న సంజాయిషీ ఎవరినీ సంతృప్తిపరచడం లేదు. పర్యవసానంగా పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు బయల్దే రాయి. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన పరిస్థితిని చక్కదిద్దకపోగా దాన్ని మరింత తీవ్రం చేస్తుంది. నిజానికి జైట్లీ చేసిన ప్రకటనలో కొత్తేమీ లేదు. కేంద్రం గతంలోనూ ఆ సంగతి చెప్పింది. అయితే తమ పార్టీయే యూపీలో హామీ ఇవ్వడం, ప్రభుత్వం ఏర్పాటు చేశాక దాని అమలుకు పూనుకోవడం, కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో సైతం దాని అమలు కోసం డిమాండ్ చేయడం పర్యవసానంగా కొత్త పరిస్థితి తలెత్తింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం 2014 ఎన్ని కల్లో ఇలాగే హామీ ఇచ్చింది. దాన్ని మోదీ సమక్షంలో అనేక సభల్లో చంద్ర బాబునాయుడు పదే పదే చెప్పారు. అమలులో బాబు ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యాక సహజంగానే తెలుగుదేశంతోపాటు బీజేపీపై కూడా ఆ మచ్చ పడింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ బాధ్యత రాష్ట్రాలదే అని చెప్పి చేతులు దులు పుకోవడం కాక మొత్తంగా రైతు సమస్య పట్ల స్పష్టతనివ్వాలి. రాష్ట్రాలదే బాధ్య తని చెప్పడం వల్ల అవి మహా అయితే మార్కెట్లో బాండ్లు విడుదల చేయడం ద్వారా నిధులు సమీకరించుకుని రుణమాఫీ చేపడతాయి. అన్ని రాష్ట్రాలూ ఆ పని చేస్తే ఇప్పటికే ఉన్న సర్కారీ రుణాల భారం అపరిమితంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణ భారం స్థూల దేశీయోత్పత్తిలో 67 శాతంగా ఉంది. ఆసియా దేశాల్లో ఇదే అత్యధికం. ఇప్పుడు రాష్ట్రాలే రుణమాఫీ వనరులు చూసుకోవాలని చెప్పడంవల్ల ప్రతి రాష్ట్రమూ బాండ్లపై ఆధారపడుతుంది. వాటికి మళ్లీ కేంద్రమే పూచీ పడాల్సి వస్తుంది. ఇప్పటికే యూపీ రుణమాఫీకి అలా పూచీ ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి రైతు ఉద్యమం పర్యవసానంగా 40 లక్షలమంది చిన్న, సన్నకారు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇలాంటి రుణాలు దాదాపు రూ. 30,000 కోట్లని అంచనా వేసింది. అయినా ఆ ఉద్యమం ఆగలేదు. ఇక చేసేదేమీ లేక రుణమాఫీని అందరికీ వర్తింపజేస్తానని అక్కడి సీఎం ఫడణవీస్ తాజాగా చెప్పకతప్పలేదు. ఉద్యోగులు, ఇతర వృత్తులు చేసుకుంటున్నవారు తదితరులను మినహాయిం చినా ఆ రుణాల మొత్తం కోటీ 40లక్షల రూపాయలు ఉండొచ్చనని ఒక అంచనా. మరి ఈ మొత్తానికి కూడా కేంద్రం పూచీ పడుతుందా? అలా పూచీ పడితే ఇతర రాష్ట్రాలు తమకూ దాన్ని వర్తింపజేయాలని ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం లేదా? మధ్యప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, హర్యానా, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఇప్ప టికే కొంత తేడాతో రుణమాఫీ దిశగా అడుగులేస్తున్నాయి. వీటన్నిటినీ గమనిస్తే ప్రస్తుతం అయిదు లక్షల కోట్ల మేర ఉన్న రాష్ట్రాల వార్షిక ద్రవ్యలోటు దాదాపు 8 లక్షల కోట్లు దాటేలా ఉంది. రాజ్యాంగంలోని 293(3) అధికరణ ప్రకారం రాష్ట్రాలు అదనంగా రుణాలు సేకరించాలంటే కేంద్రం ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు అరుణ్‌జైట్లీ సమస్యంతా రాష్ట్రాలదేనని చెప్పడం వల్ల ఏం పరిష్కార మైనట్టు? తిరిగి తిరిగి అది మళ్లీ కేంద్రం ముంగిటకే రాక తప్పదని జైట్లీకి తెలియదనుకోవాలా? సాగు దిగుబడులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటే, దళారులు రైతులను పీల్చిపిప్పి చేసే స్థితిని నివారిస్తే రుణమాఫీ కావాలని రైతులు అడగరు. ప్రభుత్వాలు ఆ విషయంలో విఫలం కాబట్టే... విత్తనాలు మొదలుకొని ఎరు వులు, పురుగుల మందులు ఆకాశాన్నంటుతుండటంవల్లే రైతులు రుణాలు తీర్చలేకపోతున్నారు. ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతు ఆత్మహత్యల గణాంకాలను గమనిస్తే సగటున ప్రతి 41 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని లెక్కేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గిట్టుబాటు ధర కావాలనడం గొంతెమ్మ కోర్కేమీ కాదు. 2014 ఎన్నికల్లో స్వయంగా బీజేపీయే తన మేనిఫెస్టోలో దిగుబడికైన వ్యయంపై 50 శాతం అదనంగా లెక్కేసి గిట్టుబాటు ధరను నిర్ణయిస్తామని చెప్పింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో సగటు రైతు వార్షికాదాయం రూ. 20,000 మించడం లేదని గత ఏడాది కేంద్రం విడుదల చేసిన ఆర్ధిక సర్వే చెప్పింది. ఇంత తక్కువ ఆదాయంతో ఆ రైతు కుటుంబాలు ఎలా బతకాలో, తిరిగి వ్యవసాయంపై పెట్టుబడులెలా పెట్టాలో విధాన నిర్ణేతలు ఆలోచించవద్దా? రైతులు ఎప్పటికీ సంఘటితం కాలేరన్న ధీమా నేతలకు ఉండొచ్చు. మన దేశంలో ఉన్న కులాల అంతరాల వల్ల, రైతుల్లో అక్షరాస్యత పెద్దగా లేకపోవడంవల్ల వారికా ధీమా ఏర్పడి ఉండొచ్చు. కానీ పరిస్థితి మునుపటిలా లేదు. ఎక్కడో కోనసీమ రైతు నాలుగేళ్లక్రితం ఆగ్రహంతో అమలు చేసిన ‘సాగు సమ్మె’ మరింత తీవ్ర రూపంతో ఇటీవల మహారాష్ట్రను గడగడలాడించింది. పర్యవసానంగా అక్కడి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కనుక రుణమాఫీ సరైన మార్గం కాదనుకుంటే దాని ప్రత్యామ్నాయాల విషయంలో ఏం ఆలోచిస్తున్నదో కేంద్రం సమగ్రమైన ప్రకటన చేయాలి. తప్పించుకునే ధోరణి వల్ల సమస్య మరింత జటిలమవు తుందని గుర్తించాలి. -
రైతుకు రుణ మాఫీ ఊరట
విశ్లేషణ పరిమిత రుణ మాఫీ సైతం రైతుల తక్షణ సమస్యలను తీర్చి, వ్యవసాయ పను లను మొదలెట్టగలిగేలా చేస్తుంది. కీలక పరిష్కారం మాత్రం సముచితమైన మద్దతు ధరలు, నిల్వ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్ వసతులను అందించడమే. రుణ మాఫీ, ప్రభుత్వానికి గానీ, రైతులకుగానీ ఆర్థి కంగా అర్థవంతమైన చర్యేమీ కాదని మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడణవిస్ గట్టిగా చెప్పేవారు. ఆయనే ఇçప్పుడు, కొన్ని షరతులతోనే అయినా అందుకు అంగీకరించారు. ఇప్పటికే రూ. 3.71 లక్షల కోట్ల రుణ భారాన్ని మోస్తున్న ఫడణవిస్ ప్రభుత్వానికి రూ. 30,000 కోట్ల రైతు రుణ మాఫీకి నిధులను సమకూర్చుకోవడం సులువేమీ కాదు. అందుకోసం గ్రామీణ ప్రాంతాల కోసం ఉద్దేశించిన పలు సంక్షేమ పథకాలకు కత్తెర వేయడం అవసరం అవుతుంది. రుణ మాఫీ నిజంగానే జరగాలంటే రుణగ్రస్తు లుగా ఉన్న్డ రైతులకు తిరిగి రుణాలను మంజూరు చేయడం ప్రారంభించమని బ్యాంకులకు సంకేతాలను పంపడం మాత్రమే సరిపోదు. బ్యాంకులు తమ ఖాతా పుస్తకాలను బ్యాలెన్స్ చేసుకోడానికి వీలుగా నిజంగానే వాటికి డబ్బును చెల్లించడం అవసరం. వాణిజ్య బ్యాంకులకు బకాయిపడ్డ కార్పొరేట్ సంస్థలు తమ రుణాలను ఇష్టానుసారం వాయిదా వేయించుకోవడం రైతుల రుణ మాఫీ డిమాండుకు నైతిక ప్రాతిపదికను సమకూరుస్తోంది. రుణ మాఫీకి అంగీకరించడం ద్వారా ఫఢణవిస్, మాఫీ కోసం డిమాండ్ చేయడం, నిరసనలు తెలపడం అనే క్రీడకు ప్రతిపక్షాన్ని దూరంగా ఉంచగిలిగారు, అంతే. ఇతర పార్టీలు తాము కూడా రైతులకు మద్ద తుగా ఉన్నామని అంటున్నా వారిని రెచ్చగొట్టేవేవీ కాదు. కాకపోతే అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన రైతుల పక్షాన నిలిచి, బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులను కలుగజేస్తోంది. ఇక పది రోజుల పాటూ జరిగిన రైతుల ‘‘సమ్మె’’ కు సంబంధించి ఆసక్తికరమైన అంశం అందుకు ఎంచు కున్న సమయమే. తర్వాతి పంట వేసే క్రమం మొదలు కావాల్సి ఉంది, అది ఎలాగూ రుతుపవనాల రాకతో ముడిపడి అనివార్యంగా జరిగేదే. చాలా మంది తమ భూములను విత్తడానికి సిద్ధం చేసుకున్నారు. చేతిలో చేయడానికి పనిలేక, ప్రదర్శనలు చేయడానికి వీలుగా ఖాళీగా ఉన్నారు. మొత్తంగా ఈ పంటల సీజనంతా ముందుం డటంతో రైతులు ఈ సమ్మెను ఎంతో కాలం కొనసాగిం చరనేది వాస్తవం. పళ్లు, కూరగాయలు పండించేవారు ఈ సమ్మెలో ప్రధానంగా పాల్గొంటున్నట్టు కనిపిస్తోంది. టోకు బజార్లకు సరఫరాలు క్షీణించడాన్నిSతట్టుకోడానికి ప్రధాన మహారాష్ట్ర నగరాలు ఇతర రాష్ట్రాలవైపు, ప్రత్యే కించి గుజరాత్‌వైపు చూస్తున్నాయి. ఈ రుణ మాఫీకి రెండు షరతులు వర్తిస్తాయి. ఒకటి, చిన్న రైతులందరికీ, అంటే ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న రైతులందరికీ ఇది వర్తిస్తుంది. రెండు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు తమకు ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకోడానికి కొంత కాలం, కనీసం ఒక నెలో లేక రెండు నెలలో వేచి చూడాలి. రెండో కోవకు చెందిన వారికి సంబంధించి, మంత్రులు, రైతులతో కూడిన బృందం ఇతర రాష్ట్రాల లోని రుణ మాఫీని అధ్యయనం చేస్తుంది. అయితే రెండో కోవలోని వారంతా ఆ ప్రయోజనాలకు అర్హులు కాక పోవచ్చు. వ్యాపారం, ఉద్యోగం వగైరా ఇతర వన రులు ఉన్నవారు దాని పరిధికి వెలుపలే ఉండాల్సి రావచ్చు. రైతులు దూకుడుగా ఉండటమే కాదు, చీలిపోయి ఉన్నారు కూడా. రైతులలోని ఒక విభాగం, భూమి ఎంత ఉన్నది అనే దానితో నిమిత్తం లేకుండా అందరికీ రుణమాఫీని కోరుతుండటమే అందుకు కారణం. అయితే, ఈ రుణమాఫీ వల్ల లబ్ధి చేకూరే వారి సంఖ్య తక్కువేమీ కాదు. రైతులలో దాదాపు 80 శాతం మంది ఐదు ఎకరాల లోపు భూయాజమాన్యం ఉన్న వారి వర్గంలోకే వస్తారు. రుణమాఫీ పట్ల సార్వత్రికంగా సంతోషం వ్యక్తం అవుతోంది గానీ, రాష్ట్ర ప్రభుత్వం కనీసం చిన్న రెతులకు సంబంధించైనా ఈ పథకం వివరాలను వెల్ల డించలేదు. ఒక్కో రైతు రుణ మాఫీ రూ. 1,00,000కు మించక పోవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పరిమితం అవు తుంది. లబ్ధిదారులు కాగల అర్హత ఉన్నవారికి ఈ పరిస్థితి ఇంకా అర్థం కాకపోయి ఉండవచ్చు. ఈ పరిమిత రుణ మాఫీ సైతం రైతుల తక్షణ సమస్యలను తీర్చి, వారు తిరిగి వ్యవసాయ కార్య కలాపాలను ప్రారంభించగలిగేలా చేస్తుంది. సాగుబడి లాభదాయకంగా ఉండటం లేదు కాబట్టి ఈ సహాయం సైతం ప్రభావశీలమైనదే. కీలకమైన పరిష్కారం మాత్రం సముచితమైన మద్దతు ధరలు, నిల్వ సదు పాయాలు, కోల్డ్ స్టోరేజ్ వసతులను కల్పించడమే. దశా బ్దాలు గడుస్తున్నా అది మాత్రం జరగడం లేదు. ధరల రూపేణా, మౌలిక సదుపాయాల రూపేణా లభించే మద్దతుతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ కుండా నిలవరించగలుగుతారు. గత దశాబ్ద కాలంలోనే దాదాపు 18,000 మంది రైతులు తక్షణ బాధల నుంచి వ్యక్తిగతంగా విముక్తి కావాలని ఉరి వేసుకున్నారు లేదా విషం తాగారు. తద్వారా వారు తమ కుటుంబాలను నిరాధారంగా గాలికి వదిలేశారు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ :mvijapurkar@gmail.com -
నేనున్నానని..
సాక్షిప్రతినిధి, అనంతపురం: మూడేళ్లుగా వరుస కరువులు... రుణమాఫీపై పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. అరకొరగా చిల్లర విదిల్చి చేతులు దులుపుకుంది. కొంతమంది రైతులకు అదీ లేదు. షరతులతో కూడిన రుణమాఫీ రైతులకు శరాఘాతంగా పరిణమించింది. బకాయిలు చెల్లించాలని ఓ వైపు బ్యాంకు నుంచి నోటీసులు.. మరోవైపు ప్రైవేటు వడ్డీవ్యాపారుల ఒత్తిళ్లు.. వెరసి 'అనంత' రైతులు తీవ్ర వేదన పడ్డారు. ఓ వైపు ప్రభుత్వం చేసిన మోసాన్ని భరించలేక... బ్యాంకులు, వడ్డీవ్యాపారుల ఒత్తిళ్లు భరించలేక... ఆత్మాభిమానం చంపుకోలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 83 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అన్నదాతల పరిస్థితి ఎంతభయంకరంగా ఉంటో ఇట్టే తెలుస్తుంది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చి 'అనంత'రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి మూడో విడత రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. 'అనంత' రైతులు ఏటా నష్టపోతూనే ఉంటారు. ఈ క్రమంలో బాధ్యత గల ప్రభుత్వాలు రైతులకు దన్నుగా నిలవాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఒడ్డుకు చేర్చాలి. అయితే చంద్రబాబు ప్రభుత్వం భిన్నంగా వ్యవహరించింది. వారికి మరింత ఇబ్బందులు కల్పించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. గద్దెనెక్కిన తర్వాత సాకులు చెప్పి షరతులతో కూడా రుణమాఫీ అంటూ దగా చేశారు. 'అనంత' రైతులకు కోలుకోలేని దెబ్బ: జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాల్లో రూ.6,817కోట్ల రుణాలు బకాయిలున్నాయి. సర్కారు చెప్పినట్లు పంటరుణాలు, బంగారు రుణాలు మాఫీ చేయాలన్నా 8.20లక్షల ఖాతాల్లో రూ.4,994కోట్ల మాఫీ చేయాలి. అయితే ప్రభుత్వం మాత్రం 6.62 లక్షల ఖాతాల్లో రూ.2,234.5 కోట్ల మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందులో తొలి విడతలో రూ.780.16కోట్ల మాత్రమే విడుదల చేసింది. దీంతో పాటు 2013-14కు సంబంధించి రావాల్సిన రూ.643కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీని ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ ఏడాదికి సంబంధించి 574 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరు చేయాలి. ఈ క్రమంలో కళ్లెదుట కొండలా కన్పిస్తోన్న అప్పులు తీర్చడం కష్టసాధ్యమవుతుందని గ్రహించి ఆత్మహత్యలకు తెగించారు. ఏడాదిలోనే జిల్లాలో 83మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే 'అనంత' రైతులు ఎంత వేధన చెందారో ఇట్టే తెలుస్తోంది. ప్రభుత్వాన్ని నిద్రలేపే దిశగా: ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడంతో వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలను స్వయంగా వచ్చి పరామర్శిస్తానని అసెంబ్లీలో ప్రకటించారు. జగన్ ప్రకటనతో ప్రభుత్వం హడావిడిగా స్పందించింది. ఫిబ్రవరి 22 నుంచి రైతుభరోసాయాత్ర ఉన్న నేపథ్యంలో 'అనంత'లో 30మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఫిబ్రవరి 21న ప్రభుత్వం ప్రకటించింది. చనిపోయిన కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. జాబితా ప్రకటనలో కూడా చిత్తశుద్ధి చూపలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతులందరినీ గుర్తించలేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 22-26వరకూ తొలి విడత భరోసా యాత్రను జగన్ చేపట్టారు. 5రోజులపాటు 781 కిలోమీటర్లు ప్రయాణించి 11మంది రైతుల కుటుంబాలను పరామర్శించారు. రెండోవిడతలో మే 11-18 వరకూ 1150కిలోమీటర్లు ప్రయాణించి 14కుటుంబాలను పరామర్శించారు. ఈ క్రమంలో మూడో విడతయాత్రను నేటి నుంచి చేపట్టనున్నారు. కళ్యాణదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించనున్నారు. తొలిరోజు పర్యటన ఇలా..: జగన్మోహన్రెడ్డి నేడు బెంగళూరు నుంచి శెట్టూరుకు చేరుకుంటారు. అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత కైరేవు చేరుకుని ఆత్మహత్య చేసుకున్న పెద్దనాగప్ప అనే రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. -
రెండోవిడత రుణమాఫీలోనూ గందరగోళం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత రుణమాఫీలోనూ గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ఆ జాబితాలను పంపింది. రెండో విడత రుణమాఫీకి 11లక్షల 27వేల ఖాతాలు ఎంపిక చేసింది. ఒక్క బ్యాంకులో ఒక ఖాతాకే రుణమాఫీకి అవకాశం ఉంది. దాంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. భార్యా, భర్తల పేరిట వేర్వేరుగా ఖాతాలున్నా 20శాతం వరకే మాఫీ వర్తిస్తుంది. మొత్తం రైతు ఖాతాలు కోటీ 15 లక్షలు ఉండగా బ్యాంకులు అప్లోడ్ చేసింది కేవలం 82లక్షల 66వేల ఖాతాలు మాత్రమే. దాంతో 51 లక్షల 70వేల ఖాతాలకు మాత్రమే అర్హత ఉండగా, సుమారు 30 లక్షల ఖాతాలకు చంద్రబాబు సర్కార్ మొండిచేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి తొలి విడతలో రూ.4,680కోట్లు విడుదల చేయగా, రెండో విడతలో రూ.2,315 కోట్లు విడుదల చేసింది.