
సాక్షి, నెల్లూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో ఉన్న పచ్చపార్టీ నేతలు పట్టపగలే ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీడీపీ నేత ప్రచారంలో భాగంగా రోడ్డుపైనే ఓటర్లులకు డబ్బులు పంచారు.
నెల్లూరు జిల్లాలోని సర్వేసల్లి నియజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బరితెగించారు. అక్కడ ఉన్న ఓటర్లకు డబ్బులు పంచారు. సోమిరెడ్డి పట్టపగలే మహిళా ఓటర్లుకు డబ్బుల, చీరలు పంచుతూ అడ్డంగా దొరికి పోయారు.