vote for money
-
పచ్చ ప్రలోభాలు.. పట్టపగలే టీడీపీ నేత సోమిరెడ్డి బరితెగింపు
సాక్షి, నెల్లూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో ఉన్న పచ్చపార్టీ నేతలు పట్టపగలే ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీడీపీ నేత ప్రచారంలో భాగంగా రోడ్డుపైనే ఓటర్లులకు డబ్బులు పంచారు. నెల్లూరు జిల్లాలోని సర్వేసల్లి నియజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బరితెగించారు. అక్కడ ఉన్న ఓటర్లకు డబ్బులు పంచారు. సోమిరెడ్డి పట్టపగలే మహిళా ఓటర్లుకు డబ్బుల, చీరలు పంచుతూ అడ్డంగా దొరికి పోయారు. -
రాజన్నా.. మరువలేమన్నా..
తెల్లని పంచెకట్టు..చెరగని దరహాసం..అందరినీ ఆదరించే ఆపన్నహస్తం..పేదల కన్నీళ్లకు ఆనకట్ట వేసే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సుందరరూపం..ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ప్రతి ఇంటి గదిలో..గుండె గుడిలో ఆ దేవుని రూపం కొలువై ఉంది. ప్రతి ఊరూ..ప్రతి వాడా..ప్రతి పల్లె..ప్రతి పట్టణం..ప్రతి కుటుంబం వైఎస్ తమ గుండె చప్పుడులో ఉన్నాడంటూ నినదించింది. బుధవారం వైఎస్ రాజశేఖరుని జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వాళులర్పించారు. మహానేత అందించిన సువర్ణయుగం మళ్లీ రావాలని..ఇప్పుడున్న ‘ఓటుకు కోట్లు’ కాలం పోవాలని ఆ దేవుడ్ని వేడుకున్నారు. -
ఓటుకు నోటు తప్పుకాదు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ‘ఓటుకు నోటు తప్పు కాదు. రూ.8 వేలకు తక్కువ కాకుం డా తీసుకోండి. నోటు తీసుకున్న తరువాత ఓటు మా త్రం టీడీపీకి వేయండి..’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన గుంటూ రు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఎన్నికల సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ఎన్నికలన్న తరువాత కొంత డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే కొన్ని పార్టీలు మాత్రం ప్రాంతానికో రేటు పెట్టాయి. అలాకాకుండా ప్రతి ఊళ్లో ఒకే రేటు ఉండేవిధంగా ఓటుకు రూ. 8 వేలు అడిగి తీసుకోండి. అది మన డబ్బే..’ అంటూ ప్రోత్సహించారు. కాగా, గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలు చొచ్చుకురావడంతో మైకుల పోల్ నేలకూలింది.ఆయన మాట్లాడుతున్నంతసేపూ గోలగోల చేయడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఇక బాపట్ల వచ్చిన దగ్గరనుంచీ అభిమానులు గోల చేస్తుండటంతో పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఏంటీ మీ గొడవ... నన్ను మాట్లాడనిస్తారా... లేదా...’ అంటూ అభిమానులపై చిందులు తొక్కారు. ‘మీ జెండాలు కిందకు దించండ్రా బాబోయ్... వచ్చినోళ్లకు కనీసం నా మోహాన్నైనా కనిపించనివ్వండి... చెప్పేది మీకేరా బాబు... రేయ్.. నాకు తిక్కెక్కిందునుకో.. నామాట నేనే వినను..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి తరఫునైతే ప్రచారానికి వచ్చారో వారిని కూడా పట్టించుకోలేదు. ఎంత హడావుడిగా వచ్చారో అంత హడావుడిగానే వెళ్లిపోయారు.