ఓటుకు నోటు తప్పుకాదు | do not wrong for vote for money says pavan kalyan | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు తప్పుకాదు

Published Mon, May 5 2014 1:23 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

ఓటుకు నోటు తప్పుకాదు - Sakshi

ఓటుకు నోటు తప్పుకాదు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్
 
‘ఓటుకు నోటు తప్పు కాదు. రూ.8 వేలకు తక్కువ కాకుం డా తీసుకోండి. నోటు తీసుకున్న తరువాత ఓటు మా త్రం టీడీపీకి వేయండి..’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన గుంటూ రు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఎన్నికల సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ఎన్నికలన్న తరువాత కొంత డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే కొన్ని పార్టీలు మాత్రం ప్రాంతానికో రేటు పెట్టాయి. అలాకాకుండా ప్రతి ఊళ్లో ఒకే రేటు ఉండేవిధంగా ఓటుకు రూ. 8 వేలు అడిగి తీసుకోండి. అది మన డబ్బే..’ అంటూ ప్రోత్సహించారు.

కాగా, గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలు చొచ్చుకురావడంతో మైకుల పోల్ నేలకూలింది.ఆయన మాట్లాడుతున్నంతసేపూ గోలగోల చేయడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఇక బాపట్ల వచ్చిన దగ్గరనుంచీ అభిమానులు గోల చేస్తుండటంతో పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఏంటీ మీ గొడవ... నన్ను మాట్లాడనిస్తారా... లేదా...’ అంటూ అభిమానులపై చిందులు తొక్కారు. ‘మీ జెండాలు కిందకు దించండ్రా బాబోయ్... వచ్చినోళ్లకు కనీసం నా మోహాన్నైనా కనిపించనివ్వండి... చెప్పేది మీకేరా బాబు... రేయ్.. నాకు తిక్కెక్కిందునుకో.. నామాట నేనే వినను..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి తరఫునైతే ప్రచారానికి వచ్చారో వారిని కూడా పట్టించుకోలేదు. ఎంత హడావుడిగా వచ్చారో అంత హడావుడిగానే వెళ్లిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement