![ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పవన్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71397457364_625x300.jpg.webp?itok=D1IX351L)
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పవన్
విజయనగరం: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించారు. టీడీపీ-బీజేపీ కూటమి తరపున శనివారం ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన పవన్.. ఎన్నికల్లో డబ్బు తీసుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. మిగత పార్టీల నాయకుల నుంచి డబ్బు తీసుకుని ఓటు మాత్రం టీడీపీ-బీజేపీ అభ్యర్థులకు వేయాలని సూచించారు. దీనికితోడు పవన్ ప్రసంగం తప్పుల తడకగా ఉండటంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు.