పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి | Minister Kakani Govardhan Reddy Challenges To Somireddy | Sakshi
Sakshi News home page

పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి

Published Tue, May 21 2024 6:14 PM | Last Updated on Tue, May 21 2024 7:04 PM

Minister Kakani Govardhan Reddy Challenges To Somireddy

నెల్లూరు:  బెంగళూరు రేవ్‌ పార్టీ అంశానికి సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ‘పచ్చమంద’కు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వాతలు పెట్టారు. తనకు సంబంధాలు ఉన్నా, తనకు సంబంధించిన వారు ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చన్నారు కాకాణి. ఎవరో అనామకుడు తన కారు స్టిక్కర్‌ను జిరాక్స్‌ తీసి వాడుకుంటే అందులో తాను ఉన్నానంటూ పచ్చ మంద రాద్దాంతం చేస్తుందని కాకాణి ధ్వజమెత్తారు.

‘నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా?’

‘బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?, నెల్లూరులో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తా. ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుంది. ఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలి. బెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నా. బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ? , రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది.

బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదు.రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు  పాసు పోర్ట్ నా దగ్గరే ఉంది.కుట్ర కోణం పై విచారణ చేయాలని  పోలీసులను కోరాను.రోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.సో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  లోఫర్’ అంటూ  మండిపడ్డారు.

‘రేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. సోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయి. నాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు. యూత్ మినిస్టర్‌గా ఉండి క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిది. నా పాస్ పోర్ట్ నెల్లూరులో ఉంది.  కారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి..  కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని కాకాణి తెలిపారు.

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement