సాక్షి, నెల్లూరు జిల్లా: ఏపీ సర్కార్ లిక్కర్ పాలసీపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ నేతల పేరుతో ఒక్కో లిక్కర్ షాపుకి ఐదు లక్షల చొప్పున వసూలు చేశారని ఆయన మండిపడ్డారు. 30 శాతం వాటా కార్యకర్తల పేరిట వసూళ్లు చేశారని.. బెల్ట్ షాపుల వేలం సోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని కాకాణి ధ్వజమెత్తారు.
నియోజకవర్గంలో 300 బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చారు. నెలకు ఒక్కో షాప్‌కు పదిహేను వేలు వసూలు చేస్తున్నారు. కూల్ డ్రింక్ షాపుల వాళ్లు నెలకు రూ.30 వేలు ఇవ్వాలని ఫిక్స్ చేశారు. కరప్షన్‌కి సోమిరెడ్డి బ్రాండ్ అంబాసిడర్’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు.
బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులపై ఉన్న ధ్యాస, సోమిరెడ్డికి ప్రజల మీద లేదు. నా ఆరోపణలపై దమ్ముంటే సోమిరెడ్డి విచారణకు సిద్ధమా..?’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment