సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఆయనపై కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
సోమిరెడ్డి మా డేటా చోరీ చేశారు: నర్మదారెడ్డి
ఫిర్యాదు అనంతరం శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ సంస్థపై సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ ప్రాజెక్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన సోమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. సోమిరెడ్డి తమ డేటా చోరీ చేశారని తెలిపారు. కాకాణికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నర్మదారెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది
బాలిక కిడ్నాప్ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
Comments
Please login to add a commentAdd a comment