అధికార పార్టీ కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా వారం నుంచి అధికార పార్టీ ఆత్మకూరు రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతోంది. జిల్లాలో మంత్రి సోమిరెడ్డి ఆయన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య ఆత్మకూరు నియోజకవర్గం వేదికగా వర్గపోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ పరిణామాల క్రమంలో ఆది వారం పరిస్థితి తీవ్రమై గత ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కన్నబాబు పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్షకు అనుచరులతో కలిసి కూర్చోవటంతో హైడ్రామా తారాస్థాయికి చేరింది.