resignation drama
-
మోగని ‘గంట’: ఉత్తుత్తి లేఖతో హడావుడి..
’’ఇల్లు కాలి ఒకాయన బాధ పడుతుంటే చుట్ట కాల్చడానికి నిప్పు అడిగాడట ఓ ప్రబుద్ధుడు.. ’’.. మోటు సామెతను కాస్త నీటుగా చెప్పామనుకోండి.. అది వేరే విషయం.. అయితే సరిగ్గా ఈ సామెత మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వందశాతం వర్తిస్తుంది. ఎన్నికలకో నియోజకవర్గం మారుస్తూ గత ఎన్నికల్లో ’ఉత్త’ర కుమారుడిగా ప్రయాస పడి ఎట్టకేలకు స్వల్ప ఓట్లతో బయటపడ్డ గంటా.. నాటి నుంచి ఇంటి గుమ్మం దాటి బయటకు రావడం లేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తాను ఎమ్మెల్యేగా గెలిచిన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత 20 నెలలుగా ఎక్కడా పర్యటించలేదు. నియోజకవర్గ సమస్యలపై ఏనాడూ స్పందించలేదు. అసెంబ్లీకి సైతం మొక్కుబడిగా హాజరు వేయించుకుని వస్తున్నారు. ఇక తెలుగుదేశం పారీ్టపై గెలిచిన సదరు గంటా... ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా టీడీపీ కార్యాలయానికి వెళ్లలేదు. పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొన్న దాఖలాల్లేవు. ఆ పార్టీ సంగతి వదిలేస్తే కనీసం బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఈ 20 నెలల కాలంలో ఒక్కసారి కూడా వ్యవహరించలేదు. అడపాదడపా పార్టీ మార్పు అంటూ అనుకూల మీడియాల్లో వార్తలు వేయించుకోవడం తప్పించి ఎక్కడా ’గంట’ మోగింది లేదు. (చదవండి: టీడీపీ డీలా: బరిలో దిగే వారేరీ..?) సరిగ్గా ఈ నేపథ్యంలోనే స్టీల్‌ప్లాంట్ ఉద్యమం రావడంతో ఇదే వేదికగా హడావుడి చేయాలని గంటా భావించినట్టున్నారు. అంతే.. చిత్తం వచ్చిన భాషలో ఓ లేఖ రాసి మీడియాకు వదిలేశారు. తాను శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి మొత్తం ఉక్కు ఉద్యమాన్ని తానే ముందుండి నడిపిస్తానని భీకర ప్రతిజ్ఞ కూడా చేసేశారు. కానీ స్పీకర్ ఫార్మాట్‌కు విరుద్ధంగా వదలిన ఆ రాజీనామా లేఖతోనే గంటా వ్యూహాత్మక ప్రచార ఎత్తుగడ బట్టబయలైంది. ఇరవై నెలలుగా గడప దాటి బయట రాని ఆయన ఇప్పుడు ఉక్కు ఉద్యమ ముసుగులో మళ్లీ జనానికి మొహం చూపించాలనే ఆరాటం తప్పించి... నిజమైన పోరాటానికి కాదని ఆ లేఖతో అర్ధమైంది. అందుకే ఆయనపై విమర్శల జడి మొదలైంది.(చదవండి: డ్రామా : ఫిరాయించిన ‘పిల్లి’ దంపతులు) లైట్ తీసుకున్న విశాఖ నేతలు.. ఓ సారి ఎంపీగా చేసి.. నాలుగో దఫా ఎమ్మెల్యేగిరీ వెలగబెడుతున్న గంటాకు కనీసం శాసన సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో కూడా తెలియలేదంటూ అన్ని పక్షాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. స్పీకర్ ఫార్మాట్లో కాకుండా తన లెటర్ హెడ్‌పై ఏదో నాలుగు ముక్కలు గీకి పారేసి.. అదే రాజీనామా అంటూ ప్రచారపర్వంలో మునిగిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలోనే వామపక్ష నేతలు మిన హా మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నాయకులూ గంటా రాజీనామాను చాలా ’లైట్’ తీసుకున్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బీజేపీ శాసనసభాపక్ష మాజీ నేత విష్ణుకుమార్ రాజు. జనసేన నేతలతో పాటు దళిత సంఘాల నేతలు ఆ రాజీ నామాను ఓ ప్రసహనంగా పేర్కొని గంటా వ్యవహారశైలిని ఎండగడుతున్నారు. ఇక టీడీపీలో కొనసాగుతూ... ఆ పార్టీకి సంబంధం లేకుండా.. పార్టీ అధినేత చంద్రబాబుకు కనీసమాత్రంగా చెప్పకుండా రాజీనామా చేశానంటున్న గంటా నిర్వాకంతో నగరంలోని మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు తల పట్టుకుంటున్నారు. గంటా రాజీనామా హాస్యాస్పదం పదవి లేకుండా బతకలేని మనిషి గంటా... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు పదవి ఉండాలి. రాష్ట్రంలో జరుగుతున్న చాలా పోరాటాలపై నోరు మెదపని గంటా స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారంటే వ్యక్తిగత స్వార్ధమే ఎక్కువ ఉంటుంది. స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా చేయడం హాస్యాస్పదం – కొత్తపల్లి వెంకటరమణ, విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక కో–కన్వీనర్ -
డ్రామా : ఫిరాయించిన ‘పిల్లి’ దంపతులు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆడలేక మద్దెల ఓడు.. అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. పార్టీ సానుభూతిపరులను పోటీకి పెట్టలేని వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రభుత్వంపై అభాండాలు వేసి, తప్పించుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి సహా అన్ని పదవులకూ రాజీనామా చేస్తు న్నట్టు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆమె భర్త, పార్టీ ప్రధాన కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు) శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే పదవుల్లో కొనసాగుతామంటూ శనివారం వారు ప్లేటు ఫిరాయించారు. 24 గంటలుగా ఆ పారీ్టలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ‘తెలుగు’ డ్రామా బాగానే రక్తి కట్టినట్టు కనిపిస్తోంది. జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం అసలు పారీ్టలో ఏం జరుగుతోందని సీనియర్లను ప్రశ్నిస్తున్నారు. పదవుల నుంచి వైదొలగుతున్నామని, వెనక్కు తగ్గేది లేదని గంభీరంగా ప్రకటించిన సత్తిబాబు, అనంతలక్ష్మి దంపతులు.. తెల్లవారేసరికి నాలుక మడత పెట్టేయడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ నేతలు జ్యోతుల నవీన్, వర్మ, రామకృష్ణారెడ్డి బుజ్జగించేసరికి ప్లేటు ఫిరాయించేసే దానికి ఇంత హడావుడి దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: టీడీపీ సేవలో బీజేపీ) వ్యూహాత్మకంగానే హడావుడి! పార్టీని విస్మరించారనే ఫిర్యాదు ఏడాది క్రితం అధిష్టానం వద్దకు వెళ్లినప్పుడే ఇన్చార్జిని మార్చాలనే ఆలోచన పై స్థాయిలో జరిగిందని చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మార్పు జరిగితే ఎదురయ్యే పరిణామాల దృష్ట్యా వేచి చూసే ధోరణికే పార్టీ మొగ్గు చూపింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల సమయంలో రూరల్‌లో ఉనికిని కాపాడుకోలేని దీనావస్థలోకి పార్టీ వెళ్లిపోయిందనే సమాచారం జిల్లా నేతల నుంచి హైకమాండ్‌కు మరోసారి వెళ్లింది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న బొడ్డు భాస్కర రామారావును పారీ్టలోకి ఆహ్వానించి, రూరల్ ఇన్చార్జిగా తీసుకోవాలని ప్రతి పాదనతో చినరాజప్ప మానసిక వేదనకు కారణమ య్యారని స్వయంగా సత్తిబాబే ప్రకటించారు. అయితే ఇన్చార్జిగా తమను తప్పిస్తారనే సంకేతాలతోనే ఆయన వ్యూహాత్మకంగా రాజీనామా డ్రామాకు తెర తీసి ఉండవచ్చనే చర్చ పార్టీ సీనియర్ల మధ్య జరుగుతోంది.(చదవండి: నిమ్మగడ్డకు జైలు శిక్ష తప్పదు) తనంత తానుగా వైదొలగితే అధిష్టానం నుంచి లభించే సానుభూతి, తననే లక్ష్యంగా చేసుకుని చినరాజప్ప సాగిస్తున్న రాజకీయానికి ముగింపు పలికే వ్యూహంలో భాగం గానే రాజీనామా రచ్చ చేశారని అంటున్నారు. పనిలో పనిగా తన వైఫల్యాన్ని ప్రభుత్వంపై నెట్టేసే ఎత్తుగడ కూడా ఆయన వేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని గతంలో కాకినాడ రూరల్‌లో నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల పనులకు ఎడాపెడా మంజూరు ఇచ్చేశారు. తీరా ప్రభుత్వం మారేసరికి అడ్డగోలు పనులన్నింటిపైనా విచారణ జరుగుతున్న క్రమంలో బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ తరుణంలో వచ్చిన పంచాయతీ పోరులో పార్టీ సానుభూతిపరులను బరిలోకి దింపే సత్తా లేకే వెనకడుగు వేశారని, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లడం తమ తప్పె లా అవుతుందని రాజప్ప వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పైగా కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ పడడంతో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేసినంత మాత్రాన వాస్తవం తెరమరుగైపోదని చెబుతున్నారు. గత వైరం కూడా ఉందనే వాదనలు చినరాజప్ప, భాస్కర రామారావు మధ్య వైరం ఈనాటిది కాదు. పార్టీ ఆవిర్భావం నుంచీ భాస్కర రామారావు, దివంగత మాజీ మంత్రి మెట్ల సత్య నారాయణరావు ఒక వర్గంగా ఉండేవారు. నిమ్మకాయల చినరాజప్ప వైరివర్గంగా కొనసాగే వారు. భాస్కర రామారావు వర్గంలో పిల్లి సత్తిబాబు ముఖ్యుడిగా ఉండేవారు. అమలాపురం అసెంబ్లీ స్థానం జనరల్ కేటగిరీలో ఉన్నప్పుడు చినరాజప్ప దానిని ఆశించి భంగపడ్డారు. అప్పట్లో ఈ స్థానం మెట్లకే దక్కింది. అపμట్లో భాస్కర రామారావు పక్కదోవ పట్టించి టిక్కెట్టు దక్కకుండా చేశారనే ఆగ్రహం చినరాజప్పకు ఉంది. పార్టీ ఏదైనా వారిద్దరి మధ్య రాజకీయ వైరం ఇప్పటికీ అలానే ఉంది. తాజా పరిణామాల్లోకి చినరాజప్పను లాగడం వెనుక ఈ నేపథ్యం కూడా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. అలాగని చినరాజప్ప వైఖరిని కూడా పార్టీ నేతలు ఏ కోశానా సమరి్థంచడం లేదు సరికదా తప్పు పడుతున్నారు. బీసీ నాయకుడైన సత్తిబాబును ఇలా అప్రతిష్ట పాలుచేసి బయటకు పంపే కుట్రలు పన్నుతారా అని వారు ప్రశ్నిస్తున్నారు. సత్తిబాబు వైఫల్యం ఉంటే జిల్లా స్థాయిలో అందరినీ కూర్చోబెట్టి చెప్పాలే తప్ప ఇలా చినరాజప్ప కక్ష సాధింపునకు దిగుతారా అని భాస్కర రామారావుతో పూర్వాశ్రమంలో కలిసి ఉన్న తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పార్టీలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో తేలాలంటే మరికొన్ని రోజులు తెలుగు డ్రామాను ఆసక్తిగా చూడాల్సిందే. టీడీపీ నేతల బుజ్జగింపులు కాకినాడ రూరల్: టీడీపీ పదవులకు రాజీనామాలు ప్రకటించిన ఆ పార్టీ కాకినాడ రూరల్ ఇన్ చార్జి పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులను ఆ పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, పిఠాపురం, అనపర్తి మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుజ్జగించారు. వారు శనివారం వాకలపూడిలోని అనంతలక్ష్మి దంపతుల నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు. దీంతో రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు అనంతలక్ష్మి దంపతులు ప్రకటించారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని, కొత్త ఇన్చార్జిని నియమించే వరకూ పదవిలో కొనసాగుతామని వెల్లడించారు. యనమల రామకృష్ణుడు శుక్రవారం రాత్రి తమతో మాట్లాడారని, ఆయనకు అన్నీ చెప్పామని సత్యనారాయణమూర్తి అన్నారు. పార్టీకి ఎవరు వచ్చినా పని చేస్తామని చెప్పారు. అధికారంలో ఉండగా చేపట్టిన పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను పోటీకి పెట్టలేక పోయానని వివరించారు. పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. ఈ పరిణామాలు బాధాకరమని, ఇటువంటివి టీ కప్పులో తుపానులాంటివని జ్యోతుల నవీన్ అన్నారు. -
రాజ్‌నాథ్ రాజీనామాకు సిద్ధపడ్డారా?
న్యూఢిల్లీ: సాధారణంగా ప్రధానమంత్రి తర్వాత ప్రమాణం స్వీకారం చేసే వ్యక్తినే ప్రభుత్వంలో నంబర్ 2గా భావిస్తారు. అలా చూస్తే మోదీ తర్వాత ప్రమాణం చేసిన రాజ్‌నాథ్‌కే ఆ స్థానం దక్కాలి. కానీ మొత్తం ఎనిమిది కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని కమిటీల్లోనూ అమిత్ షాకి సభ్యత్వం కల్పించారు. రాజ్‌నాథ్‌కు తొలుత కేవలం రెండింటిలో మాత్రమే ప్రాతినిధ్యం కల్పించడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. మోదీ ప్రొటోకాల్ ప్రకారం వ్యవహరించలేదని, తన కుడిభుజం అమిత్ షాని నంబర్ టూ అని చాటి చెప్పడానికే రాజ్‌నాథ్ ప్రాధాన్యం తగ్గించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన మోదీ రాత్రికి రాత్రి కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు మొత్తం ఆరు కమిటీల్లో రాజ్‌నాథ్‌కు స్థానం కల్పించారు. తెరవెనుక ఏం జరిగింది ? బుధవారం పలు కమిటీలు ఏర్పాటు చేసిన ప్రధాని.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు రెండు కమిటీల్లోనే చోటు కల్పించారు. అమిత్ షాను అన్ని కమిటీల్లోనూ పెట్టి, రాజ్‌నాథ్‌ను రెండింటికే పరిమితం చేయడం సహజంగానే కలకలం రేపింది. ‘‘రాజ్‌నాథ్ సింగ్‌కు ఇది తీవ్ర అవమానం. అలాగని ఆయన అవమానాలు దిగమింగుతూ ఉండే నాయకుడైతే కాదు‘‘ అని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టుగానే రాజ్‌నాథ్ చేతులు ముడుచుకొని కూర్చోలేదని, తన హోదాకు భంగం కలగడంతో రాజీనామాకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అంతేకాదు ఆరెస్సెస్ పెద్దల వద్ద కూడా రాజ్‌నాథ్ ఈ విషయం ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రధాని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారని, రాజ్‌నాథ్‌కు ఫోన్ చేసి బుజ్జగించారని, రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నచ్చజెప్పారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ నేత ఒకరు చెప్పారు. ఆ క్రమంలోనే గురువారం రాత్రి రాజ్‌నాథ్‌కు మరిన్ని కమిటీల్లో చోటు కల్పిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించడం వల్ల.. అన్ని అంశాలను పర్యవేక్షించే అధికారం రాజ్‌నాథ్‌కు ఉంటుందని, ఆయన ప్రొటోకాల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని మోదీ మద్దతుదారులు చెబుతున్నారు. -
నెల్లూరు జిల్లా టీడీపీలో ముసలం
-
రచ్చకెక్కిన ఆత్మకూరు రాజకీయం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా వారం నుంచి అధికార పార్టీ ఆత్మకూరు రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతోంది. జిల్లాలో మంత్రి సోమిరెడ్డి ఆయన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య ఆత్మకూరు నియోజకవర్గం వేదికగా వర్గపోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ పరిణామాల క్రమంలో ఆది వారం పరిస్థితి తీవ్రమై గత ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కన్నబాబు పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్షకు అనుచరులతో కలిసి కూర్చోవటంతో హైడ్రామా తారాస్థాయికి చేరింది. మరోవైపు సోమవారం మంత్రి నారాయణ, ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కన్నబాబు దీక్షకు దిగటం, భవిష్యత్తు పరిణమాలు ఎలా ఉంటాయనే దానిపై పార్టీలో తీవ్రంగా చర్చ సాగుతుంది. అధికార పార్టీలో ఆత్మకూరు ఇన్చార్జి చిచ్చు రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అంతర్గతంగా సాగుతున్న విభేదాలు మరింత ముదిరి రచ్చకెక్కాయి. ఈ వ్యవహారంలో జిల్లాలో ఇద్దరు మంత్రలు రెండు గ్రూప్‌లుగా మారి రాజకీయం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆత్మకూరు ఇన్చార్జి నియామకంపై మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, అమర్నా«నాథ్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చర్చించారు. అయితే మంత్రులు ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు ఆత్మకూరులో కొనసాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇన్చార్జి పదవి ఆశిస్తున్న మంత్రి సోమిరెడ్డి వర్గీయుడు కన్నబాబు తన అనుచరులతో సమావేశానికి వచ్చి ఒక్కరినే ఇన్చార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ నేత మెట్టుకూరు ధనుంజయ్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో సమావేశానికి గైర్హాజరై నిరసన తెలపారు. ఈ క్రమంలో ఆత్మకూరు వ్యవహారాన్ని సీఎం నిర్ణయానికి వదిలేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీంతో పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న ఆదాలను తాత్కలిక ఇన్చార్జిగా నియమించాలని పార్టీ ఆదేశించింది. దీంతో మరుసటి రోజునే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన వర్గీయుడు కన్నబాబుతో కలిసి ఆత్మకూరులో పర్యటించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించి, చేజర్లలో బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజకీయంగా మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాలకు వైరం ఉన్న క్రమంలో సోమవారం ఆదాల ప్రభాకర్‌రెడ్డి తాత్కలిక ఇన్చార్జి హోదాలో సోమవారం మంత్రి నారాయణతో కలిసి ఆత్మకూరులో పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆత్మకూరు టీడీపీ నేతలు కొందరు ఆదాలను కలిసి అభినందించారు. దీనిని కన్నబాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనకు దిగింది. పార్టీ కార్యాలయంలో కన్నబాబు ఆమరణ దీక్ష ఈ క్రమంలో ఆదాల నియామకాన్ని వ్యతిరేకిస్తూ కన్నబాబు పార్టీ రాజీనామా చేస్తారని బలంగా ప్రచారం సాగింది. దీనికి అనుగుణంగా ఆత్మకూరు టీడీపీ నేతలు, కొందరు కార్యకర్తలతో కలిసి నగరంలో ఆయన మూడు గంటలకు పైగా సుదీర్ఘ మంతనాలు జరిపారు. చివరిగా పార్టీ కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం ముందు ఆమరణదీక్షను ఆదివారం రాత్రి 9.15 గంటలకు ప్రారంభించి సేవ్ టీడీపీ అంటూ నినాదాలు చేశారు. జిల్లాకు చెందిన పార్టీ మంత్రులు, జిల్లా అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర నేతలు ఎవరూ పట్టించుకోకపోవటంతో పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్ష నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కన్నబాబుతో చర్చలు ప్రారంభించారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు కన్నబాబుతో దీక్ష విరమించాలని కోరినా ఫలితం లేదు. -
‘ మంత్రుల రాజీనామా ఓ డ్రామా’
అనంతపురం : టీడీపీకి చెందిన కేంద్ర మంత్రుల రాజీనామా ఓ డ్రామా అని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం రెండేళ్ల కిందటే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. చంద్రబాబు నాయుడు అప్పుడు స్పందించకుండా, కేవలం కమిషన్ల కోసమే ప్యాకేజీని స్వాగతించారని, ఆయనకు ప్రజల ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని దుయ్యబట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మంత్రులు రాజీనామా చేయడం రాజకీయ క్రీడలో ఒక భాగమని పేర్కొన్నారు. -
రాజీనా.. రాజీనామానా..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (పీడీసీసీబీ) రగడ పతాకస్థాయికి చేరింది. ప్రకాశం కేంద్ర సహకార బ్యాంకులో రూ.25 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, బోర్డు సభ్యులను వంచించి చైర్మన్, సీఈఓ కొందరు అక్రమాలకు పాల్పడ్డారని 14 మంది పీడీసీసీబీ డైరెక్టర్లు ఆరోపించారు. ఈ మేరకు సహకార శాఖ మంత్రి, కమీషనర్, జిల్లా ఎస్పీతో పాటు, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. చైర్మన్ ఈదరను పదవీచుతుడ్ని చేయాలని మెజార్టీ డైరెక్టర్లు పట్టుపట్టారు. ఆయనపై బహిరంగ విమర్శలకు దిగారు. అధికార టీడీపీ మద్ధతుదారుగా ఉన్న డీసీసీబీ చైర్మన్‌ను దింపేందుకు సొంత పార్టీకి చెందిన మెజార్టీ డైరెక్టర్లు పట్టుపట్టడం ఆ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో ఈదర మోహన్‌కు సత్సంబంధాల్లేవు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. డీసీసీబీ వ్యవహారాన్ని బుధవారం రాత్రి ఎమ్మెల్యే జనార్దన్‌తో పాటు మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పంచాయితీ తెంచాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో జనార్దన్ శుక్రవారం డీసీసీబీ వివాదంపై విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ ఈదర మోహన్ ఎట్టి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని గతంలో వైస్ చైర్మన్‌గా ఉన్న మస్తానయ్యతో పాటు 15 మంది డైరెక్టర్లు పట్టుపడుతున్నారు. ఎవరెన్ని చెప్పిన చైర్మన్‌గా ఈదరను అంగీకరించేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. శుక్రవారం దామచర్ల వద్ద జరిగే పంచాయితీలోనూ ఇదే చెబుతామని పలువురు డైరెక్టర్లు సాక్షితో చెప్పారు. ఈదర మోహన్ అధికార పార్టీ మద్ధతుదారుడిగానే కొనసాగుతున్నందున డైరెక్టర్లను ఒప్పించి చైర్మన్‌గా ఈదరను కొనసాగించేలా రాజీ ప్రయత్నాలు జరుగుతాయన్న ప్రచారమూ ఉంది. ఈదరకు పదవి గండం..? డైరెక్టర్లలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచరులున్నారు. అయితే 20 మంది డైరెక్టర్లలో దాదాపు 17 మంది డైరెక్టర్లు ఈదరను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆయన్ను పదవి నుంచి దించేందుకు పట్టుపడుతున్నారు. టీడీపీ అధిష్టానం ఈదరనే చైర్మన్‌గా కొనసాగించే పక్షంలో ఎమ్మెల్యేల ద్వారా డైరెక్టర్లపై ఒత్తిడి పెంచి సమస్యను సర్దుమణిగేలా చేసే అవకాశం ఉంది. అలా కాకుండా డైరెక్టర్ల అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తే పదవి నుంచి తప్పుకోవాలని సూచించే అవకాశం ఉంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో ఈదర మోహన్‌కు విభేదాలున్న నేపథ్యంలో చివరకు ఏం జరుగుతున్నది ప్రశ్నార్థకంగా మారింది. డైరెక్టర్ల అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చే పక్షంలో ఈదర పదవి నుంచి తప్పుకోవడం మినహా గత్యంతరం లేదు. అదే జరిగితే శుక్రవారం సాయంత్రానికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. -
అన్నన్నా..!
రక్తికట్టించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు ‘రాజీ’నామా నాటకం ఒక్క రోజుకే మనసు మార్చుకుని అధికారిక కార్యక్రమాలకు హాజరు ఆయనది పదవీ వ్యామోహమంటున్న గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు గిద్దలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని విభజించిన తీరు బాధించిందని, ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తనకు ఇష్టం లేదని, ఎమ్మెల్యే పదవి తనకు అక్కర్లేదని చెబుతూ రెండు రోజుల క్రితమే రాజీనామా చేసి.. తిరిగి మూడో రోజు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఘనత గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకే దక్కుతుంది. తనకున్న పదవీ వ్యామోహమే గురువారం నియోజకవర్గంలోని అర్ధవీడు మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనేలా చేసిందని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. వివరాలు.. లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లు మూజువాణి ఓటుతో ఈ నెల 18వ తేదీన గట్టెక్కిన విషయం తెలిసిందే. దీనికి ముందే అంటే అదే రోజు ఉదయం ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు గిద్దలూరు మండలంలో హడావుడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సన్మాన కార్యక్రమాలు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాష్ట్ర విభజన జరిగిపోయిందని చెప్పి అప్పటికే షెడ్యూల్లో ఉన్న మిగిలిన ప్రారంభోత్సవ కార్యక్రమాలను వాయిదా వేసుకుని విలేకరులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి తాను ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి వెళ్లిపోయారు. 19వ తేదీ ఒక్కరోజు ఆలోచించుకుని తిరిగి ఎమ్మెల్యేగా కొనసాగాలని అనుకున్నారో ఏమో వెంటనే అర్ధవీడు మండలంలోని మాగుటూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభించారు. నాగులవరం, కాకర్ల, మాగుటూరు, రంగాపురం, వెలగలపాయ, బొమ్మిలింగం, బసిరెడ్డిపల్లె గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శిలాఫలకాలపై పేరు రాయించుకున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యే కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొనడం గమనార్హం. ఎమ్మెల్యేగా రాజీనామా చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడమేంటని నియోజకవర్గ ప్రజలు అన్నాను ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ తనకెందుకన్నట్లు కార్యక్రమాల్లో పాల్గొంటూ అభివృద్ధి చేసిన వారికి ఓటెయ్యాలని చెప్పి ప్రచారం చేసుకోవడం విశేషం. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాజీనామా చేయడం.. తిరిగి ఎమ్మెల్యే హోదాలో ప్రారంభోత్సవాలు చేయడంపై ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అన్నా రాజీనామా డ్రామా అని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి భయపడి విభజనకు ఒప్పుకుని, పైకి నటన చేస్తున్నారని ప్రజలు దుయ్యబడుతున్నారు. తన పదవీ కాలం పూర్తికాకముందే ఆవేశంలో తొందర పడి రాజీనామా చేసినందుకు ఎమ్మెల్యే బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారని జనం బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం. -
టీడీపీ ఎంపీల రాజీ 'డ్రామా'లు బయటపడ్డాయి