
అనంతపురం : టీడీపీకి చెందిన కేంద్ర మంత్రుల రాజీనామా ఓ డ్రామా అని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం రెండేళ్ల కిందటే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. చంద్రబాబు నాయుడు అప్పుడు స్పందించకుండా, కేవలం కమిషన్ల కోసమే ప్యాకేజీని స్వాగతించారని, ఆయనకు ప్రజల ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని దుయ్యబట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మంత్రులు రాజీనామా చేయడం రాజకీయ క్రీడలో ఒక భాగమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment