చంద్రబాబు సినిమా ఇంకా ఉంది: కేసీఆర్
హైదరాబాద్ : 'ఓటుకు నోటు' వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహరంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయని... ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించి సినిమా ఇంకా వుందని ఆయన అనటం రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహరంలో చంద్రబాబుకు సంబంధించి మరికొన్ని కీలక ఆధారాలు వెలుగుచేసే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబే సూత్రధారి అని కేసీఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. మరోవైపు ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఎప్పుడు నోటీసులు ఇస్తారనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలనే దానిపై ఏసీబీ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం.