హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్టైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. విచారణ సమయంలో అన్ని సౌకర్యాలు కల్సిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులకు గురిచేయడం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది.
మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదనడంలో వాస్తవం లేదని ఏసీబీ కోర్టుకు విన్నవించింది. దీంతో మంచినీళ్లు ఇవ్వకుండా ఉంటారా? అని రేవంత్ తరఫు న్యాయవాదులను కోర్టు ప్రశ్రించింది.