హిమాయత్‌నగర్: ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో చర్యలు తీసుకుంటే అందరిపైనా తీసుకోవాలని ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య అన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దళిత క్రైస్తవుడైన తనపై రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఏసీబీ దాడులకు ముందు కానీ, తర్వాత కానీ తాను సంబంధిత వ్యక్తులెవరితోనూ ఫోన్‌లో మాట్లాడలేదన్నారు.
ఎవరో ఒకరిని బలి చేయాలనే తనను వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆ ఫోన్ మాట్లాడింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలితే అతడిపైనా... ఆ ఫోన్‌ను ట్యాపింగ్ చేయించిన కేసీఆర్‌లపై కూడా చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.