ప్రకాశం : ఓటుకు నోటు సిగ్గు చేటని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నా చేపట్టారు. మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఈ ధర్నాలో పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు నోటు సిగ్గుచేటని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొని ప్రసంగించారు.