
నేడు పేట మీదుగా ప్రకాశం జిల్లాకు వైఎస్ జగన్
చిలకలూరిపేట: పేట మీదుగా గురువారం ప్రకాశం జిల్లా వెళుతున్న వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు.
యద్దనపూడిలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి దివంగత గొట్టిపాటి నరసయ్య విగ్రహావిష్కరణకు వైఎస్ జగన్ చిలకలూరిపేట జాతీయరహదారి మీదుగా వెళుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట నియోజకవర్గంలోని పార్టీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు ఉదయం 9.30 గంటలకు నరసరావుపేట సెంటర్ వద్దకు చేరుకొని జననేతకు ఘన స్వాగతం పలకాలని కోరారు.