కేసీఆర్, బాబుల ఫ్లెక్సీ దహనం | KCR and Babu Flexi-burning | Sakshi
Sakshi News home page

కేసీఆర్, బాబుల ఫ్లెక్సీ దహనం

Published Thu, Jun 11 2015 5:51 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

KCR and Babu Flexi-burning

 ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఓటుకు నోటు కేసులో అవినీతి ఆ రోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికార దాహంతో ఎమ్మెల్యేలను చేర్చుకుంటు న్న తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను బుధవా రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో ఈ కా ర్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలను ఇద్దరు చం ద్రులు అవినీతితో భ్రస్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రజాసమస్యలను విస్మరిస్తూ.. అధికారమే బలంగా ఎదిగేం దుకు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదన్నారు. మిషన్ కాకతీయ కమీషన్ దందాగా మారిందన్నారు. ఇష్టానుసారంగా డబ్బులు వెదజల్లుతూ ఆంధ్రా సీఎం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి. పట్టణ అధ్యక్షుడు సాజీద్‌ఖాన్, నాయకులు దిగంబర్‌రావుపాటిల్, నర్సిహారావు, సలీం, సుఖందర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement