శనివారమే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన సండ్ర..
రాజమండ్రి : ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (రాజమండ్రిలో సండ్ర కలకలం) ఆచూకీ ప్రస్తుతం మిస్టరీగా మారింది. చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అక్కడ నుంచి సండ్ర అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
కేవలం పడకకే పరిమితమై విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు చెప్పారని ఏసీబీకి లేఖ రాసిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానంటూ రోజుకో నగరాన్ని మార్చుతున్నారు. ఆస్పత్రిలో విచారణకైనా సిద్ధమంటూనే ఎక్కడ ఉన్నారో మాత్రం సండ్ర...ఏసీబీకి చెప్పడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే సండ్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.