
చంద్రబాబుకు నేడో, రేపో ఏసీబీ నోటీసులు?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో ఏసీబీ సీనియర్ అధికారులు, న్యాయనిపుణులతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటుకు వ్యవహారంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రలోభపెట్టినట్టు ఆడియో టేపులు బహిర్గతమైన నేపథ్యంలో ఆయనకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది. దీనిలో భాగంగానే ఏసీబీ డీజీ ఏకే ఖాన్ .. సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు.
చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అంశంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఓటుకు నోటు కేసు విచారణ కోసం ఏ క్షణంలోనైనా చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.