
కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. టీడీపీ ఓటుకు నోటు వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ముడుపుల కేసులో సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మొదటి నిందితుడిగా చేర్చాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.