ఓటుకు కోట్లు కేసులో సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు గురువారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. సండ్రను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. దాంతో చర్లపల్లి జైలు నుంచి సండ్రను అధికారులు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆయనను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. కస్టడీ అనంతరం సండ్రను అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సండ్ర బెయిల్ పిటిషన్తో పాటు, ఏసీబీ కౌంటర్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది.
Published Thu, Jul 9 2015 11:14 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement