'వారిద్దరూ దొరికిన దొంగలే '
వరంగల్: ' ఓటుకు కోట్లు' లో చంద్రబాబు, 'ట్యాపింగ్' లో కేసీఆర్..ఇద్దరూ దొరికిన దొంగలే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. కేంద్రం మందలించడంతో ఇద్దరూ మాట్లాడటంలేదన్నారు. త్వరలో ప్రజలే వీరికి తగిన బుద్ధి చేబుతారన్నారు. ఆయన శనివారం వరంగల్ లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాగా అవసరమైతే కార్మికులకు మద్దతుగా 48 గంటల దీక్షను చేపడతానని మందకృష్ణ అన్నారు.