'ఓటుకు నోటు'లో కరీంనగర్‌వాసికి నోటీసు | vote for note: acb notice for watchmen | Sakshi
Sakshi News home page

'ఓటుకు నోటు'లో కరీంనగర్‌వాసికి నోటీసు

Published Wed, Sep 2 2015 4:03 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

vote for note: acb notice for watchmen

సిరిసిల్ల: ఓటుకు నోటు కేసులో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సారంపల్లికి చెందిన పాలకుర్తి రాములుకు సోమవారం ఏసీబీ అధికారులు నోటీసు జారీ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాలంటూ ఏసీబీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీసు ఎం.మల్లారెడ్డి నోటీసులో పేర్కొన్నారు. పాలకుర్తి రాములు టెక్స్‌టైల్ పార్క్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల కిందట ఆయన సెల్‌ఫోన్ పోయింది.

రాములు సెల్‌నంబర్ నుంచి ఓటుకు నోటు కేసులో సంభాషణలు జరిగినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రాములు పేరిట ఉన్న ఫోన్ నంబర్ కేసులో ఉండడంతో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు జారీ చేశారు. నోటీసులతో ఆందోళనకు గురైన రాములు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయూడు. ఈ కేసుతో తమకు సంబంధం లేదని, తమ సెల్‌ఫోన్ రెండేళ్ల కింద పోయిందని రాములు భార్య ఇందిర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement