Watchmen
-
వాచ్మెన్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా: మంచిరేవులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న జంగయ్యపై మేస్త్రి అర్జున్ దాడి చేశాడు వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న జంగయ్య స్క్రాప్ అమ్ముకుంటున్నాడని కోపంతో మేస్త్రి అర్జున్ దాడి చేశాడు దాడిలో జంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు మేస్త్రి అర్జున్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గుడిలో చోరీకి యత్నించిన దొంగపై వాచ్మెన్ దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రంగయ్య (60) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఓ యువకుడు చోరీ కోసం గుడిలోకి ప్రవేశించాడు. ఆలయంలోకి వచ్చిన దుండగుడు గర్భగుడిలోని హుండీ దగ్గరకు వెళ్లి దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన రంగయ్య వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతను వాచ్మెన్పై రాళ్లతో దాడికి దిగాడు. దొంగను అడ్డుకునేందుకు వాచ్మెన్ కూడా దగ్గర ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో దొంగ తలకు బలంగా దెబ్బ తగలడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు. ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు, పోలీసులు మృతదేహం చూసి భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటహుటిన ఆలయానికి చేరుకున్న పోలీసులు మృతుడిని పరిశీలించగా.. అతని ఫోన్ దొరికింది. ఫోన్లోని ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు గండం రాజు (23)గా గుర్తించారు. రాజు స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లిగా తెలిపారు. పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. -
సీబీఐ మరో కట్టుకథ: చంపుతుంటే.. పడుకున్నాడు!
సాక్షి, అమరావతి: కళ్లెదుట హత్య జరుగుతోందని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు?.. అడ్డుకోడానికి ప్రయత్నిస్తారు లేదా కనీసం నలుగురిని పోగేసి అప్రమత్తం చేస్తారు. కానీ యజమాని హత్యకు గురవుతున్నట్లు తెలిసినా కిటికీలోంచి చూసి ఏమీ పట్టనట్లుగా వెళ్లిపోయి రాత్రంతా హాయిగా నిద్రపోవడం మానవమాత్రుడికి సాధ్యమేనా..? మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వాచ్మెన్ రంగయ్యతో సీబీఐ ఇప్పించిన స్టేట్మెంట్ అచ్చం ఇలాగే ఉంది. చదవండి: దస్తగిరి చెప్పిందంతా అబద్ధం చిలక పలుకులే.. తనకు కళ్లు సరిగా కనిపించవని... ఏదీ పెద్దగా వినిపించదని గతంలో సిట్ దర్యాప్తు బృందాలకు చెప్పిన రంగయ్య రెండేళ్ల తర్వాత హత్య జరిగిన రోజు రాత్రి విషయాల గురించి పూస గుచ్చినట్లు చెప్పడం చిలక పలుకులను గుర్తు చేస్తోంది. ఇంతకీ రంగయ్యకు ఏం గుర్తొచ్చిందంటే.. 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసంలో నుంచి బాధతో పెద్దగా అరిచిన అరుపులు వినిపించాయి. అవి విని రంగయ్య కిటికీలోకి తొంగి చూశాడట. కిటికీ అద్దం ఒకటి తెరచి ఉందని, కర్టెన్ కొంత పక్కకు జరిగి ఉందని చెప్పాడు. ఆ చిన్న సందులోంచి లోపలికి చూస్తే ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరితోపాటు మరొకరు హాలులో అటూ ఇటూ తచ్చాడుతూ కనిపించారట. తరువాత కాసేపటికి మిగిలిన ముగ్గురు పారిపోగా... ఆదరబాదరగా వచ్చిన ఎర్ర గంగిరెడ్డిని ఏం జరిగిందని ప్రశ్నిస్తే ‘నీకెందుకు...? ఎవరికైనా చెబితే నిన్నూ నరికి పారేస్తా..’ అని హెచ్చరించాడట. ఇదీ క్లుప్తంగా రంగయ్య చెబుతోంది. రంగయ్య కథనం నమ్మశక్యమేనా? ►పెరటి తలుపు ముందుగానే తీసి ఉంచి రాత్రి లోపలికి ప్రవేశించిన హంతకులు కిటికీ తలుపు వేయలేదనడం, కర్టెన్ కొద్దిగా పక్కకు జరిగి ఉన్నా పట్టించుకోలేదంటే ఎంతవరకు నమ్మశక్యం? ►లోపల గట్టిగా కేకలు వినిపించాయంటే వివేకా మీద దాడి జరుగుతోందని అప్రమత్తం కావాలి. కిటికీలో నుంచి ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరిలతోపాటు మరొకరు కనిపించారని రంగయ్యే చెబుతున్నాడు కాబట్టి వాళ్లెవరూ అరవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక మిగిలింది వివేకా మాత్రమే కాబట్టి ఆయనకు ఏమైందో రంగయ్య ఎందుకు అడగలేదు? ►సరే.. రంగయ్య భయంతో అరవలేదని భావించినా కనీసం వీధిలోకి వచ్చి కేకలు వేస్తే జనం పోగై వివేకాను రక్షించే అవకాశం ఉంది. అలా చేయాలని రంగయ్యకు ఎందుకు తోచలేదు? ►ఇంత జరిగాక ముగ్గురు పారిపోగా.. ఎర్ర గంగిరెడ్డి తాపీగా వచ్చి జరిగింది ఎవరికైనా చెబితే నరికేస్తా..! అని రంగయ్యను హెచ్చరించి వెళ్లాడట. తరువాతైనా రంగయ్య లోపలికి వెళ్లి ఏం జరిగిందో చూడాలి కదా? కానీ లోపలికి వెళ్లలేదు. ►మరి అంత భయపడ్డ రంగయ్య ఏం చేయాలి? వెంటనే పారిపోవాలి. అలా కాకుండా ఏమీ జరగనట్లుగా ఆ ఇంటి వాకిట్లోనే నిద్రించాడు. నార్కో పరీక్షల్లో నోరెత్తని వ్యక్తి నేడు.. సిట్ అధికారులు గతంలో రంగయ్యను ఆయన కుమారుల సమక్షంలో విచారించినా తనకేమీ తెలియదనే చెప్పాడు. హత్య జరిగిన మర్నాడు ఆయన పీఏ కృష్ణారెడ్డి నిద్ర లేపేవరకు తనకేమీ తెలియదని చెబుతూ వచ్చాడు. పోలీసులు గుజరాత్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఆయనకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేసినా ఏ విషయాలూ చెప్పలేదు. ప్రస్తుతం తెలుగు రాని సీబీఐ అధికారులు ఒక ట్రాన్స్‌లేటర్‌ను నియమించుకుని అడిగిన ప్రశ్నలకు రంగయ్య స్పందించి పలు అంశాలను వెల్లడించాడనటం సందేహాస్పదంగా మారింది. అంటే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు నిర్వహించే నార్కో అనాలసిస్ పరీక్షలకు విలువ లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రంగయ్యను ప్రలోభపెట్టి ఆయనతో ఎవరైనా సీబీఐ ద్వారా వాంగ్మూలం ఇప్పించారా? అనే సందేహాలు పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. -
Gachibowli: భారీ చోరీకి పాల్పడిన ‘నేపాల్’ వాచ్మెన్ దంపతులు
సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్): నగరంలో నేపాల్ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. వాచ్మెన్, హౌస్ కీపింగ్ పనులు చేసే నేపాల్‌కు చెందిన దంపతులు యజమాని ఇంట్లో 120 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు చోరీ చేసి ఉడాయించారు. రాయదుర్గం సీఐ రాజ్‌గోపాల్ రెడ్డి, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక టెలికాంనగర్‌కు చెందిన వ్యాపారి బీరం గోవిందరావు శనివారం ఉదయం స్నేహితుడు గంగాధర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. రెండు రోజుల్లో వస్తామని వాచ్మెన్ దంపతులు లక్ష్మణ్ (34), పవిత్ర (30)లకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫోన్ చేయగా లక్ష్మణ్ స్పందించ లేదు. దీంతో ఇంట్లో అద్దెకు ఉండే వారితో పాటు స్నేహితులను పురమాయించారు. సర్వెంట్ రూమ్‌కు వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయని, ఎవరూ లేరని తెలిపారు. దీంతో గోవిందరావు, దీప దంపతులు హుటాహుటిన ఆదివారం రాత్రి 7 గంటలకు టెలికాంనగర్ చేరుకున్నారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా కిటికీ గ్రిల్ తొలగించి ఉంది. లోపల గది తాళం పగుల గొట్టి బీరువా తెరిచి, వస్తువులు కింద పడేసి ఉన్నాయి. లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైందని గుర్తించి రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి రెండింటికి... సర్వెంట్ రూమ్‌లో ఉండే లక్ష్మణ్ శనివారం రాత్రి రెండు గంటల సమయంలో మెట్లపైకి ఎక్కినట్లుగా సీసీ పుటేజీలో రికార్డు అయ్యింది. ఆ తర్వాత విద్యుత్ లైట్లు , వీధి లైట్లు ఆపేశారు. ఈ సమయంలోనే చోరీ చేసి పరారయ్యారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర వైపు పరార్ భారీ చోరీకి పాల్పడిన నిందితుల కోసం నాలుగు బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులు పటాన్చెరు మీదుగా మహారాష్ట్రకు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అద్దె వాహనంలో తరలినట్లుగా పేర్కొంటున్నారు. చోరీలో లక్ష్మణ్, పవిత్ర దంపతులు మాత్రమే ఉన్నారా లేక మరికొంత మంది సహాయం తీసుకొని ఉంటారా అనేది తేలాలి. ఇది రెండో ఘటన గత అక్టోబర్ 6న బీఎన్‌ఆర్‌హిల్స్‌లో నేపాల్‌కు చెందిన గ్యాంగ్ ఇదే తరహాలో దోపిడీకి పాల్ప డింది. బోర్వెల్ యజ మాని మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి..రూ.15 లక్షల నగదు, ఆభరణాల చోరీకి పాల్పడిన విషయం విదితమే. నమ్మకంగా ఉంటూ... గోవిందరావు ఇంట్లో మొదట్లో నేపాల్‌కు చెందిన ఎమ్.లాల్ అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. నాలుగు నెలల క్రితం తాను ఊరికి వెళ్లిపోతున్నాని చెప్పి, తమ బంధువులే అంటూ నమ్మించి లక్ష్మణ్, పవిత్రలను పనిలో చేర్చాడు. వాచ్‌మెన్‌గా, ఇంట్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తూ నమ్మకంగా ఉంటున్నారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కనిపెట్టి.. రెండు రోజుల పాటు యజమానులు ఉండరని తెలుసుకుని చోరీకి పాల్పడ్డారు. నాలుగు నెలలుగా నమ్మకంగా ఉండి ముంచేశారని ఈ సందర్భంగా బాధితుడు గోవిందరావు మీడియాతో పేర్కొన్నారు. ఎలాంటి అనుమానం రాకుండా మంచిగా ప్రవర్తించారని చెప్పారు. బీరువాలోనే లాకర్ తాళం చెవి ఉంచడంతో గది తాళం పగులగొట్టి లాకర్‌ను ఓపెన్ చేశారని, దాదాపు 120 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు దోచుకెళ్లారని చెప్పారు. చదవండి: ప్రే‘ముంచాడు’.. వీడు మామూలోడు కాదు! -
కమెడియన్‌ను చంపింది ఎవరు? రోర్‌సాక్ చెప్పింది నిజమేనా?
పూజా హెగ్డేకు ఆటలు, పాటలు ఎంత ఇష్టమోపుస్తకాలుచదవడం కూడా అంతే ఇష్టం. లాక్డౌన్లో ఖాళీ సమయాన్ని పుస్తకాలకు వినియోగించిందట. ఆమెకు నచ్చిన పుస్తకాల్లో ఒకటి గ్రాఫిక్ నావెల్ వాచ్మెన్. ఈ పుస్తకం గురించి... బ్రిటీష్ రచయిత అలెన్ మోర్, ఆర్టిస్ట్ డేవ్ గిబన్స్, కలరిస్ట్ జాన్ హిగ్గిన్స్ల అద్భుత సృష్టి వాచ్మెన్. నిజానికి ఈ పుస్తకానికి ముందు, పుస్తకం తరువాత ఎన్నో కామిక్స్ నావెల్స్ వచ్చాయి. అయితే ‘వాచ్మెన్’ మాత్రం ఒక మైలురాయిగా నిలిచింది. కాలంతో కలిసి నడిచే పుస్తకాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఇది అలాంటి పుస్తకమే. అమెరికన్ పబ్లిషింగ్ హౌజ్ డీసీ కామిక్స్ 1986లో తొలిసారిగా ప్రచురించిన ఈ పుస్తకం ‘లీస్ట్ ఆఫ్ ది 100 బెస్ట్ నావెల్స్’లో ఒకటిగా నిలిచింది. సినిమాగా వచ్చింది. వీడియో గేమ్ సిరీస్‌లతో అలరించింది. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు రెగ్యులర్ కామిక్ బుక్‌లాగా అనిపించదు. ఇంకా చెప్పాలంటే ‘కాంప్లెక్స్ స్టఫ్’గా అనిపిస్తుది. ఎందుకీ కాంప్లెక్స్? ఎందుకంటే ఇది ‘అల్టర్నేటివ్ హిస్టరీ’ జానర్లో వచ్చిన నవల. ఈ నవలలో కనిపించే నిర్ధిష్టమైన కాలానికి సంబంధించిన చరిత్ర (కోల్డ్‌వార్, నిక్సన్ పాలన, న్యూక్లియర్వార్....మొదలైన విషయాలు) ఎంతో కొంత మనకు తెలిసి ఉంటే సంక్లిష్టత దూరం అవుతుంది. ‘ది వాచ్మెన్’ పేరుతో అమెరికన్ గవర్నమెంట్‌కు సహాయపడే సూపర్ హీరోల బృందం ఉంటుంది. అందులో కొందరు... 1. డా.మన్‌హట్టన్ 2. సిల్క్ స్పెక్టర్ 3. ఒజిమాండియస్ 4. నైట్ వోల్ 5. రోర్‌సాక్ 6. కమెడియన్ అమెరికన్ గవర్నమెంట్ ‘కీన్ యాక్ట్’ పాస్ చేయడంతో సూపర్‌హీరోల ప్రాభవం తగ్గుతుంది. నిజానికి ఈ సూపర్‌హీరోలు అప్పటికే దాదాపుగా రిటైరై ఉంటారు. అయితే డా.మన్‌హట్టన్ ప్రభుత్వం తరఫున పనిచేస్తుంటాడు. రోర్‌సాక్ అండర్‌గ్రౌండ్ కార్యకలాపాల్లో బిజీగా ఉంటాడు. అది 1986 సంవత్సరం. అక్టోబర్ నెల...న్యూయార్క్ సిటీలో ఎడ్వార్డ్ బ్లేక్ అనే వ్యక్తి హత్యకు గురవుతాడు. అతడిని చంపి గ్లాస్ విండో నుంచి బయటికి విసిరేస్తారు హంతకులు. డిటెక్టివ్లు రంగప్రవేశం చేస్తారు. అణువణువూ గాలిస్తారుగానీ ఏ ఒక్క ఆధారం వారికి చిక్కదు. పక్కా ప్లాన్‌తో జరిగిన మర్డర్ అనే విషయం అర్థమవుతుంది. సూపర్హీరోల్లో ఒకడైన రోర్‌సాక్ ఈ హత్య గురించి సొంతంగా దర్యాప్తు ప్రారంభిస్తాడు. హత్యకు గురైన ఎడ్వార్డ్ బ్లేక్ ఎవరో కాదని సూపర్ హీరోల్లో ఒకడైన ‘కమెడియన్’ అనే నిజం తెలుస్తుంది. ఇతడి హత్య వెనుక వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు ఏమీ లేవని సూపర్ హీరోలు అందరినీ తుదముట్టించే పనిలో భాగంగానే ఇది జరిగిందని, ఈ హత్య ఒక హెచ్చరిక అని నిర్ధారణకు వస్తాడు. తాను నమ్మింది ఇతర సూపర్ హీరోలకు చెబుతాడు. అయితే వారు ఇతడి మాటలను సీరియస్‌గా తీసుకోరు. కమెడియన్‌ను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? రోర్‌సాక్ చెప్పింది నిజమేనా? మహత్తరమైన శక్తులు ఉన్నవాడిగా పేరున్న డా. మన్‌హట్టన్ అంగారక గ్రహానికి ఎందుకు వెళ్లాడు...ఇలాంటి ఆసక్తికరమైన విషయాలలోకి వెళ్లవచ్చు. నిజానికి ఈ పుస్తకం ‘కథావస్తువు’ గురించి మాత్రమే మాట్లాడడం అంటే కుదరదు. కచ్చితంగా బొమ్మల అద్భుతం గురించి మాట్లాడుకోవాల్సిందే. వావ్! ఆ బొమ్మలను చూసి తరించాల్సిందే. ఆర్టిస్ట్ డేవ్ గిబన్స్ బొమ్మలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ కాలంలో సూపర్ హీరో కామిక్ బుక్స్ పోస్టర్–టైప్ పేజీ లేఔట్లతో, ఒక పెద్ద సీన్ దాని చుట్టూ ప్యానెల్స్‌తో వచ్చేవి. దీంట్లో మాత్రం 9–ప్యానల్ గ్రిడ్ లే ఔట్లో కాగితాల్లోనే సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. -
వాచ్‌మ్యాన్‌ని చితక్కొట్టిన యువతి
-
పెళ్లింట భారీ చోరి.. 2 కోట్లకు పైగానే
సాక్షి, కుషాయిగూడ : ఆ ప్రాంతమంతా వీఐపీల నివాసాలే.. కాలు కదిపితే చాలు మూడోకన్ను కనిపెట్టేస్తుంది. అయినా ఓ ఇంటి కాపలాదారుడు దర్జాగా భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లింట రెండు కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీ 4– ఎవెన్యూ బీ ,–171లో పారిశ్రామికవేత్త ఐలేని నర్సింహారెడ్డి కుటుంబం నివాసముంటోంది. ఆయన చిన్నకుమారుడు సూర్య వివాహం గత నెల 29న జరగ్గా, రిసెప్షన్‌ను పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించారు. (పంగోలిన్ చర్మాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు) రిసెప్షన్లో పాల్గొనేందుకు నర్సింహారెడ్డి కుటుంబసభ్యులంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్లిపోగా, నేపాల్‌కు చెందిన వాచ్‌మన్ భీం ఒక్కరే ఇంట్లో ఉండిపోయారు. ముందస్తు పథకం ప్రకారం భీం మరో సహచరుడిని పిలిపించుకుని ఇంట్లోని లాకర్ తాళాలు పగులగొట్టి వజ్రాలు పొదిగిన హారంతోపాటు బంగారం సహా 25 రకాల ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను రెండు పెద్ద సంచుల్లో నింపుకుని ఇంటి యజమాని స్కూటీపైనే పరారయ్యాడు. సైనిక్‌పురి చౌరస్తాకు వెళ్లిన తర్వాత స్కూటీని ఓ చెత్తకుప్ప సమీపంలో వదిలేసి ఆ సంచులను భుజాన వేసుకుని తాపీగా వారు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రిసెప్షన్ అనంతరం అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో చోరికా గురయ్యాయని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్తోపాటు డాగ్‌స్క్వాడ్‌తో ఘటనాస్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి అక్కడ పలు ఆధారాలను సేకరించారు. సైనిక్‌పురి చౌరస్తా సమీపంలో స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 7 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ పేర్కొన్నారు. (భూతవైద్యం: ప్రాణాలు కోల్పోయిన రజిత) -
పెట్రోల్ దాడిలో గాయపడిన వాచ్మెన్ మృతి
కంటోన్మెంట్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య విబేధాల నేపథ్యంలో గత వారం పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన వాచ్మెన్ శరణప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. శివ ఎన్‌క్లేవ్‌లో ప్రకాశ్ రెడ్డి, సంతోష్‌కుమార్ అనే వ్యక్తులకు చెందిన ప్లాట్లకు శ్రీనివాస్, శరణప్ప అనే వ్యక్తులు వాచ్మెన్లుగా పని చేస్తున్నారు. శ్రీనివాస్ అతని భార్య చిన్నలక్ష్మితో కలిసి వెంచర్‌లోని ఓ గదిలో నివాసముంటుండగా, శరణప్ప పగటి పూట మాత్రమే కాపలాకు వచ్చేవాడు. అయితే సదరు స్థల యాజమాన్య విషయంలో ప్రకాశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌లకు టి. మాధవరెడ్డి, ఎస్. మాధవరెడ్డి మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో యజమానులు సదరు ప్లాట్ల చుట్టూ ప్రహరీ నిర్మించగా ఈ నెల 5న మాధవరెడ్డి వర్గీయులు కూల్చివేయించారు. దీనిని అడ్డుకున్నందుకు శ్రీనివాస్ అతని భార్య చిన్నలక్ష్మిలపై వారు దాడి చేయడంతో బాధితులు బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోలేదు. దాడితో భయాందోళనకు గురైన శ్రీనివాస్ తనకు అండగా ఉండేందుకు శరణప్పను రప్పించుకున్నాడు. మరుసటి రోజు రాత్రి నిందితులు ఎస్. మాధవరెడ్డి, టి. మాధవరెడ్డి శరణప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన శరణప్పను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల నిర్లక్ష్యమే కారణం... వాచ్మెన్ శ్రీనివాస్– అతని భార్య చిన్నలక్ష్మిపై దాడి జరిగిన విషయమై బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకోవడంలో జాప్యం చేశారు. పోలీసుల పరోక్ష సహకారంతోనే నిందితులు పెట్రోల్ దాడికి తెగబడ్డారని శరణప్ప బంధువులు, స్థల యజమానులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసు సంచలనం కావడంతో ఎట్టకేలకు పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే కేసు తీవ్రత నేపథ్యంలో అరెస్టు విషయం బయటికి చెప్పకుండానే విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. కాగా వాచ్మెన్పై పెట్రోల్ దాడిలో ఎస్.మాధవరెడ్డి, టి. మాధవరెడ్డిలతో పాటు మరో ముగ్గురు పాల్గొన్నట్లు సమాచారం. ఎఫ్ఎస్ఎల్కు దాడి వీడియో దృశ్యాలు! వాచ్మెన్లపై వరుస దాడులకు సంబంధించిన పూర్తి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ మేరకు ఆయా సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్ధారణ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపినట్లు తెలుస్తోంది. శరణప్ప చనిపోకముందు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం, ఎఫ్ఎస్ఎల్ నివేదిక కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. -
గొడ్డలితో కసిగా.. వ్యక్తి దారుణహత్య
అర్వపల్లి (తుంగతుర్తి) : ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ రైతు దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన రైతు జడ బుచ్చయ్య(65) గ్రామ శివారులోని బోడుపై ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలరోజుల నుంచి నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రాత్రివేళలో కాపలా ఉండి పగలు వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ఆది వారం సూర్యాపేటలో ఫంక్షన్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి రాత్రి కేంద్రం వద్ద నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి చంపారు. విషయం బయటికి వచ్చిందిలా.... సోమవారం ఉదయం కొమ్మాల గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొని వెళ్లిన సమయంలో బుచ్చయ్య మంచం వద్ద రక్తపు మడుగును చూసి వెంటనే గ్రామస్తులకు తెలియజేయడంతో హత్య విషయం బయటపడింది. మృతుడు బుచ్చయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిల్లలందరి పెళ్లి కాగా వారికి కూడా పిల్లలున్నారు. అయితే సంఘటన విషయం తెలిసిన వెంటనే సూర్యాపేట డీఎస్పీ ఎం.నాగేశ్వర్రావు, నాగారం సీఐ తులా శ్రీనివాస్, ఎస్ఐ కె. మహేష్ సంఘటన స్థలికి చేరుకొని హత్యకు గల కారణాలను ఆరాతీశారు. జెడ్పీటీసీ సభ్యుడు దావుల వీరప్రసాద్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు మన్నె లక్ష్మీనర్సయ్యయాదవ్, కాంగ్రెస్ నాయకులు మోరపాక సత్యం, అనిరెడ్డి రా>జేందర్‌రెడ్డి సంఘటన స్థలికి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్లూస్‌టీం, డాగ్స్క్వాడ్లతో ఆధారాల సేకరణ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్, నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నారు. జాగిలం కాసర్లపహాడ్ గ్రామ శివారు వరకు వెళ్లి వెనక్కి వచ్చింది. ఎవరిపైనా అనుమానంలేదన్న కుటుంబ సభ్యులు బుచ్చయ్య హత్యపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని మృతుడి భార్య, ఇద్దరు కుమారులు పోలీసులకు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారని ఫిర్యాదు చేశారు. ఎందుకు చేశారో తమకు తెలియదని చెబుతున్నారు. వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు బుచ్చయ్య హత్యపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బుచ్చయ్య తన భూమిని కుమారులకు పంచారు. అలాగే గ్రామంలోని గంగదేవమ్మ ఆలయానికి కులపెద్ద (చైర్మన్) పదవికి లక్ష రూపాయలు పాటపాడి పదవి దక్కించుకున్నారు. గతంలో వివాహేతర సంబంధం విషయంలో ఒకసారి ఘర్షణ జరిగింది. దాంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో కసితో హత్య బుచ్చయ్యపై ఎంతో కసితో హత్య జరిగినట్లు మృతదేహాన్ని బట్టి చూస్తే అర్ధమవుతుంది. బుచ్చయ్య ముఖంపై గొడ్డలితో ఎక్కడికక్కడ నరికారు. దీంతో ముఖం చిద్రమైంది. అలాగే ఆయన ముఖం, ఒంటిపై 7 గొడ్డలి గాట్లు ఉన్నాయి. ఇంత కసితో ఎందుకు చంపారనేది చర్చనీయాంశమైంది. ప్రత్యేక బృందం ఏర్పాటు బుచ్చయ్య హత్యకేసును చేధించడానికి డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ శ్రీనివాస్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తున్నారు. శవానికి తుంగతుర్తి ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించారు. -
సినిమా ప్రేక్షకులతో అసభ్య ప్రవర్తన
తార్నాక: అతను సినిమా థియేటర్లో ఓ చిరుఉద్యోగి..అయితే సినిమాకు వచ్చే వారి పట్ల వంకరచూపులు చూస్తాడు.. అదును దొరికితే బెదిరించి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇలా చేస్తూ చివరికు ఓ ప్రేమజంటను కూడా బెదిరించి పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆరాధన థియేటర్లో గురువారం జరిగింది. ఓయూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి ,బాధితులుతెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇంటర్ పూర్తిచేసిన ఓ అమ్మాయి తన మిత్రుడైన ఓ అబ్బాయితో కలిసి తార్నాకలోని ఆరాధన థియేటర్లో సినిమా చూస్తున్నారు. థియేటర్లో గేటుకీపరుగా పని చేస్తున్న వీర్రాజు(29) సినిమా మొదలైన కొద్దిసేపటికి వారి వద్దకు వచ్చాడు. మీరు ఇద్దరు సినిమా థియేటర్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు...ఈ విషయాన్ని నేను సిసీ కెమెరాలో చూశాను .. మీరు బయటకు రండి మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలంటూ బెదిరించాడు. మీ విషయం పోలీసులతో పాటు మీ ఇరు కుటుంబాలకు కూడా చెబుతానంటూ భయపెట్టడం మొదలు పెట్టాడు. తరువాత అబ్బాయిని లోపలికి తీసుకెళ్లి సినిమా చూడమంటూ సీట్లో కూర్చోబెట్టాడు. తరువాత అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితులు తప్పించుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సినిమా థియేటరుకు వచ్చి వీర్రాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వాసన గమనించిన వాచ్మెన్.. ఊరికి తప్పిన ముప్పు
సాక్షి, కొవ్వూరు : పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామస్తులకు తృటిలో పెను ముప్పు తప్పింది. రక్షిత మంచినీటి పథకం ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. అయితే అక్కడ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న పోలయ్య వాసన గమనించి నీళ్లని బయటికి విడుదల చేయలేదు. ఈ ఘటనపై గ్రామ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
తప్పతాగి విద్యార్థుల్ని చితకబాదిన వాచ్‌మన్
రాయపోలు (దుబ్బాక): మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాల వాచ్‌మన్ తప్పతాగి విద్యార్థులను చితకబాదాడు. దీంతో ఓ విద్యార్థి చేతికి తీవ్రంగా గాయమవగా.. మరో విద్యార్థికి వీపు, కాళ్లు, తొడలపై వాతలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. దౌల్తాబాద్ మండల కేంద్రానికి సమీపంలోని బీసీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దౌల్తాబాద్‌కు చెందిన పులుగారి పవన్‌కల్యాణ్ గౌడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేటకు చెందిన విష్ణుతేజలు శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చారు. అదే పాఠశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న శంభులింగానికి వీరు తారసపడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు విద్యార్థులను ఇష్టమొచ్చినట్లు తిట్టి, వాతలు పడేలా కొట్టాడు. పవన్‌కల్యాణ్‌ది దౌల్తాబాద్ కావడంతో అతను వెళ్లి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వచ్చి విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం శంభులింగంపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. శంభులింగం నిత్యం మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్న విషయం ప్రిన్సిపల్, సిబ్బందికి తెలిసినా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని విధుల నుంచి తొలగించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ఉపాధ్యాయులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
వాచ్మెన్పై కత్తితో దాడి.. ఇద్దరు మహిళల అరెస్ట్!
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి వివేకానందనగర్‌లో సాయిభరద్వాజ అపార్టుమెంట్ వాచ్మెన్పై అదే అపార్టుమెంటులో నివసించే ఓ కుటుంబం కత్తితో దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సాయిభరద్వాజ అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో రిటైర్డు ఎస్సై జి.వి.రత్నం కుటుంబం అద్దెకు ఉంటోంది. శనివారం రాత్రి 2 గంటల సమయంలో ఏదో శబ్దం వస్తోందని రత్నం ఎదురు ఫ్లాట్‌లోని వ్యక్తి చెప్పడంతో చూసేందుకు వాచ్‌మన్ పైకి వెళ్లాడు. సౌండ్ చేయవద్దని వాచ్‌మన్ చెప్పడంతో రత్నం కుమార్తె ఒకరు కత్తితో దాడిచేయగా, మరో కుమార్తె సీసీ కెమెరాలపై నీళ్లు చల్లింది. దాడిలో వాచ్మెన్ తుంటిభాగంలో గాయమైంది. అతడి కేకలు విని అందరూ వచ్చి సంఘటన గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రత్నం కుటుంబంపై కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాచ్మెన్ చికిత్స పొందుతున్నాడని, ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ కుటుంబం సైకోలా ప్రవర్తిస్తుంటుందని, అరుపులు కేకలతో అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తారని, దీంతో వాచ్మెన్లు పలువురు మారారని అప్టార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఇతర కుటుంబాలు తెలిపాయి. ఈ సంఘటనతో ఇతర ఫ్లాట్లలో ఉండేవారు భయాందోళనకు గురవుతున్నారు. -
వాచ్మెన్పై కత్తితో దాడి.. ఇద్దరు మహిళల అరెస్ట్!
-
ఐటీఐ నైట్ వాచ్మెన్ ఆత్మహత్య
ఏటూరునాగారం : ఐటీఐలో నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. క్రాస్‌రోడ్డులో నివాసం ఉంటున్న భూక్య సారయ్య (53) ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సారయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా వారికి వివాహాలయ్యాయి. భార్య, కుమారుడితో కలసి సారయ్య క్రాస్‌రోడ్డులో నివాసం ఉంటున్నాడు. కాగా శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన సారయ్య ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. అయితే అంతకుముందే కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న రెండో కుమార్తె ఇంటికి వెళ్లారు. ఒంటిరిగా ఇంట్లో ఉన్న సారయ్య ఉరి వేసుకుని తనువు చాలించాడు. సారయ్య మృతికి కేవలం వ్యక్తిగత కారణాలేనని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. సారయ్య మృతి విషయం తెలుసుకున్న ఐటీఐ విద్యార్థులు, లెక్చరర్లు కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. -
వాచ్మెన్పై పోలీసుల జులుం
-
అవమానం తట్టుకోలేక వాచ్‌మన్ ఆత్మహత్య
మారేడుపల్లి: యజమానితో జరిగిన చిన్న వివాదం వాచ్‌మన్ ప్రాణం బలి గొంది. మారేడుపల్లి సీఐ ఉమామహేశ్వర్ రావు కథనం ప్రకారం... భగవన్నగర్ కాలనీలోని ఫోర్బైవన్ అపార్టుమెంట్ వద్ద కాకినాడకు చెందిన మాచవరపు శ్రీనివాస్(35) వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. భార్య నీలిమ, ఇద్దరు పిల్లలతో కలిసి అపార్టుమెంట్‌లోని ఒక గదిలో ఉంటున్నాడు. ఇంటి ముందు వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేశారని ఆదివారం రాత్రి 9 గంటలకు అపార్టుమెంట్ యజమా శ్రీనివాస్ వాచ్‌మన్ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జ రి గింది. దీంతో యజమాని వాచ్‌మన్ పై చేయి చేసుకున్నాడు. తర్వాత వాచ్‌మన్ తన భార్యాపిల్లలతో కలిసి గదిలోకి వెళ్లిపోయాడు. సోమవారం తెల్లవారుజామున lనిద్రలో ఉన్న వాచ్‌మన్ శ్రీనివాస్ నోటి నుంచి నురగ రావడాన్ని గమనించిన భార్య గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. అపార్టుమెంట్ యజమాని చేయి చేసుకోవడంతో అవమాన భారంతో తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీనివాస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చే సింది. పోలీసులు అపార్టుమెంట్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. -
'ఓటుకు నోటు'లో కరీంనగర్‌వాసికి నోటీసు
సిరిసిల్ల: ఓటుకు నోటు కేసులో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సారంపల్లికి చెందిన పాలకుర్తి రాములుకు సోమవారం ఏసీబీ అధికారులు నోటీసు జారీ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాలంటూ ఏసీబీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీసు ఎం.మల్లారెడ్డి నోటీసులో పేర్కొన్నారు. పాలకుర్తి రాములు టెక్స్టైల్ పార్క్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల కిందట ఆయన సెల్‌ఫోన్ పోయింది. రాములు సెల్‌నంబర్ నుంచి ఓటుకు నోటు కేసులో సంభాషణలు జరిగినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రాములు పేరిట ఉన్న ఫోన్ నంబర్ కేసులో ఉండడంతో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు జారీ చేశారు. నోటీసులతో ఆందోళనకు గురైన రాములు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయూడు. ఈ కేసుతో తమకు సంబంధం లేదని, తమ సెల్‌ఫోన్ రెండేళ్ల కింద పోయిందని రాములు భార్య ఇందిర తెలిపారు. -
హెరిటేజ్ డైరీలో వాచ్మెన్ మృతి
కొండాపురం (నెల్లూరు జిల్లా) : హెరిటేజ్ డైరీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలోని హెరిటేజ్ డైరీలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన నర్సింహా(56) హెరిటేజ్ డైరీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కాగా గురువారం మోటర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విత్తన క్షేత్రానికి నిర్లక్ష్యం చీడ
బూర్జ : మండలంలోని పెద్దపేట విత్తనాభివృద్ధి క్షేత్రం ఒకప్పుడు ఉత్తరాంధ్రకే తలమానికం. ఇప్పుడు నిర్లక్ష్యం చీడ ఆవరించి... సమస్యలతో సతమతమవుతోంది. దీన్ని పట్టించుకునే నాథుడు కరువవ్వడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. 1961లో 122ఎకరాల విస్తీర్ణంలో ఈ విత్తనాభివృద్ధి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యవసాయ పరిశోధనా క్షేత్రం నుంచి సరఫరా అయిన విత్తనాలు వేసి ఇక్కడ ఉత్పత్తయిన పౌండేషన్ సీడ్‌ను జిల్లా కేంద్రానికి తరలించి అక్కడి నుంచి జిల్లాలోని రైతులకు విత్తనాలు అందజేసేది. ఇక్కడి విత్తనాలు చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఎగుమతి అవుతుండేవి. ఏటా 80ఎకరాల విస్తీర్ణంలో సేద్యం చేపట్టి విత్తనాలు సిద్ధం చేసేవారు. కూలీల కొరత, వర్షాబావం, సాగునీటికొరత, నీటినిల్వకోసం ఏర్పాటు చేసిన చెరువులు పూడుకు పోవటం వంటి సమస్యలు దీని మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గత ఏడాది 55 ఎకరాల భూమిలో వరి పండించారు. ప్రతి ఏడాది మార్చి నెలలో ప్రోసెసింగ్ చేసి విత్తనాలు సిద్ధం చేసి గన్నీబేగ్‌లో లోడుచేసి నిలువ వుంచుతారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశాక వీటిని ఏఓలకు సరఫరా చేస్తారు. గత ఏడాది సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ మండలంలోని రైతులను నాశనం చేసిప్పటికి క్షేత్రంలోని పంటలకు సకాలంలో సాగునీరందించి మేలు చేసింది. అయినా అధికారుల నిర్లక్ష్యం,ప్రజాప్రతినిధుల అలక్ష్యం వెరసి క్షేత్రం నాశనమవుతోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత ఈ క్షేత్రంలో ఒక మేనేజర్, ఏఈఓ, ముగ్గురు వాచ్మన్లు ఉండాలి. పెర్మినెంట్‌గా ఒక్క వాచ్‌మన్ తప్ప ఎవ్వరూలేరు. మేనేజర్‌గా వీరఘట్టం ఏఓ స్వర్ణలతకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఏఈఓగా బూర్జ ఏఈఓ సురేష్‌ను తాత్కాలికంగా వారం రోజుల నుండి డెప్యుటేషన్‌పై ఈ సీజన్లో నియమించారు. ఇన్చార్జి అధికారుల్లో చిత్తశుద్ధి లోపించి అనుకున్నస్థాయిలో విత్తనాభివృద్ధిని సాధించడంలేదు. సకాలంలో సాగని వ్యవసాయం రాష్ట్రంలో రైతులంతా విత్తనాలు వేసి వరినారును ఏపుగా పెంచుతూ నాట్లు వేసేందుకు నానా తంటాలు పడుతూ ఖరీఫ్‌సీజన్‌కి సిద్ధమైనా అన్నీ తెలిసిన వ్యవసాయశాఖ అధికారులు మాత్రం ఇంకా క్షేత్రంలో దుక్కులు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పది సంవత్సరాలుగా ఇక్కడ సమయానికి ఉభాలు చేయరు. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గుతోంది. ఇక్కడ మామిడి, చింత చెట్లు ఉన్నాయి. వాటి ఆదాయం ఏమవుతుందో తెలియటం లేదు. క్షేత్రానికి సంబంధించిన ట్రాక్టర్, ఇంజిన్లు వంటి యంత్రాలు మూలకు చేరాయి. ఓనిగెడ్డ నుంచి నీరు విడుదలైతేకాని ఇక్కడ నాట్లు పడవు, ప్రభుత్వం కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించక పోవటంతో ఇక్కడ పనిచేసేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదు. బయటపనులు లేనప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తుంటారు. కూలీలు ఎప్పుడు దొరికితే అప్పుడే ఇక్కడ ఉభాలు ప్రారంభిస్తారు. క్షేత్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు =1966లో ఏర్పాటు చేసిన వ్యవసాయబావులు అడుగంటి పోయాయి. = 1994లో ఒక వ్యవసాయబావి నిర్మించి పక్కనే పంపుషెడ్ నిర్మించి విద్యుత్ మోటారు ఏర్పాటు చేశారు. మూడేళ్ళ క్రితమే అవన్నీ మూలకుచేరాయి. = 2007లో రూ. ఆరు లక్షలతో సాగునీటి నిలువ కోసం 5చెరువులు తవ్వారు. వీటి నిర్వహణ సక్రమంగా చేపట్టక పోవటంతో గత ఏడాది సంభవించిన మూడు తుఫాన్ల కారణంగా అధిక వర్షాలు కురిసినప్పటికి నీరునిలువ వుండలేదు. తుప్పలు, డొంకలు ఏపుగా పెరగటంతో మిగిలిన భూములు బీడుభూములుగా మారాయి. = 2సిమెంటు కల్లాలు పూర్తిగా పాడయ్యాయి, సిబ్బంది క్వార్టరు, విత్తనాలు నిలువచేసే గోడౌన్, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రహ రీ లేక క్షేత్రం ఆక్రమణలపాలవుతోంది. = ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ ప్రతిపాదనలు పంపించారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా ఈ క్షేత్రం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాదికారులు స్పందించి ఈ క్షేత్రాన్ని ప్రగతి పధంలో నడిపించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
బీసీ హాస్టళ్లలో ఖాళీల మోత..!
మొత్తం 549 పోస్టులు ఖాళీ హైదరాబాద్: రాష్ర్టంలోని చాలామటుకు బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్లతో సహా వాచ్మెన్, కామాటీ, వంటవాళ్ల ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యాసంవత్సరం మొదలయ్యేనాటికే అన్ని వసతులను కల్పిస్తామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో లోటు లేకుండా చేస్తామన్న మంత్రి ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ అనే తేడా లేకుండా ఆయా హాస్టళ్లలో ఖాళీల భర్తీకి ప్రభుత్వపరంగా చర్యలు కరువవుతున్నాయి. స్కూల్, కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 239 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీ రాష్ర్టంలోని మొత్తం 490 ప్రీ మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్, వంటవాళ్లు, వాచ్మెన్, కామాటీలు కలుపుకుని 549 పోస్టులు ఖాళీగా ఉండటం హాస్టళ్లలో ఉన్న స్థితికి అద్దం పడుతోంది. ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో 239 హేచ్డబ్ల్యూఓ పోస్టులు ఖాళీగా ఉండగా.. ప్రీమెట్రిక్కు సంబంధించి 177 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో 62 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హేచ్డబ్ల్యూఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్థికశాఖ వద్ద ఫైల్ వార్డెన్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ ద్వారా పంపిన ఫైలు ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. అంతేకాకుండా హాస్టళ్లకు కామాటీలు, వంటవాళ్లు, వాచ్‌మెన్‌ను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకునేందుకు అనుమతినివ్వాలని ఆర్థికశాఖను బీసీశాఖ కోరింది. వార్డెన్ పోస్టుల భర్తీకి సమయం పట్టినా, వంటవాళ్లు, కామాటీ, వాచ్మెన్ పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడవచ్చునని ఈ శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి
హైదరాబాద్ : కొత్తగా నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ రెండో అంతస్తు పై నుండి ప్రమాదవశాత్తూ కిందపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ మలక్‌పేట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ప్రకాశ్(40) అనే వ్యక్తి మలక్‌పేట్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కాగా సోమవారం ఉదయం 11గంటల సమయంలో ప్రమాదవశాత్తూ బిల్డింగ్ రెండో అంతస్తు పై నుండి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను ఆసుపత్రిలో మరణించాడు. -
‘గురుకుల’ అక్రమాల గుట్టు రట్టు
* పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు * అక్రమంగా దాచిన సరుకుల స్వాధీనం * తప్పుదారి పట్టించిన సిబ్బంది * వాచ్‌మన్‌పై పోలీసులకు పిర్యాదు నిజాంసాగర్ : గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న సరుకులలో కోత విధించి వాటిని పక్కదారి పట్టిస్తున్నవారి గుట్టును సోమవారం అధికారులు రట్టు చేశారు. మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గేట్ వద్ద గల తెలంగాణ సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో సరుకులు పక్కదారి పడుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఎంపీడీఓ నాగరాజు, ఈఓపీఆర్డీ సాయిబాబా అకస్మిక తనిఖీలు చేశారు. అధికారుల రాకను గమనించిన ప్రిన్సిపాల్‌తోపాటు ఇతర సిబ్బంది వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సరుకుల వివరాలను తెలిపేందుకు ప్రిన్సిపాల్ గోదావరి వారిని స్టాక్ రూంకు తీసుకెళ్లగా అదేసమయంలో ఇతర సిబ్బంది సమీపంలోని మరోగదిలో అక్రమంగా దాచిన చింతపండు, బియ్యం, గోధుమపిండి, పప్పుకారం, కొబ్బరి ఇతర సరుకులను దగ్గర్లోని వాచ్‌మన్ గదిలోకి మార్పించే ప్రయత్నం చేశారు. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే వాచ్‌మన్ గదిని సోదా చేసి, స్నానాల గదిలో అక్రమంగా దాచిన 30 కిలోల చింతపండు, 20 కిలోల గోధుమపిండి, 40 కిలోల బియ్యం, 25 కిలోల పెసరపప్పు, 5 కిలోల కొబ్బరి, 40 ప్యాకెట్ల కారం, 30 ప్యాకెట్ల సేమియాను స్వాధీనం చేసుకున్నారు. వాచ్‌మన్‌ను పోలీసులకు అప్పగించారు. వెలుగుచూసిన అక్రమాలు అధికారుల తనిఖీలో గురుకుల పాఠశాలలోని అనేక అక్రమాలు వెలుగు చూశాయి. విద్యార్థులకు అందించే సరుకులలో కోత విధించి, అట్టి సరుకులను ప్రతి వారం ఆటోలో నింపి మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటారని విద్యార్థులు తెలిపారు. రోజూ తమకు సన్న బియ్యంతోపాటు దొడ్డు బియ్యం కూడ కలిపి వండి పెడుతున్నారని చెప్పారు. ప్రతి నెలా విద్యార్థులకు ప్రభుత్వం తరపున వచ్చే డబ్బులను సైతం ఇవ్వడంలేదన్నారు. ఈ వివరాలన్నింటితో కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు ఎంపీడీఓ నాగరాజు తెలిపారు. -
కాపలాదారే హంతకుడు
నగల కోసమే దారుణం మహిళ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు మెహిదీపట్నం, న్యూస్‌లైన్: మహిళ అదృశ్యం...హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. అపార్ట్మెంటు వాచ్‌మన్‌ను హంతకుడిగా తేల్చారు. బుధవారం వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని రోలుగుంటకు చెందిన దుర్గాలమ్మ(58) మధురానగర్ ఎఫ్-బ్లాక్‌లోని సమ్రీనాహైస్ అపార్ట్మెంట్ ఉంటూ.. జీటీఎస్ కాలనీలోని ఏపీసీపీడీసీఎల్ ట్రైనింగ్ సెంటర్లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమె రోజూ మెడలో నగలు ధరించి విధులకు వెళ్తుంటుంది. దుర్గాలమ్మ నివాసముండే అపార్ట్మెంటు వద్ద విశాఖ జిల్లాకు చెందిన పి.సన్యాసిరావు(32) వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. ఇతనికి ఇటీవల సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. ఈనెల 6న ఉదయం 11 గంటలకు దుర్గాలమ్మ విధులు ముగించుకొని తానుండే అపార్ట్మెంటు వద్దకు వచ్చింది. మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ఆమె లిఫ్ట్‌లోకి వెళ్లగా.. సన్యాసిరావు కూడా వెళ్లాడు. ఆమెను మాటల్లో పెట్టి లిఫ్ట్ 3వ అంతస్తు బటన్ నొక్కాడు. 3వ అంతస్తుకు వెళ్లగానే ఆమె చీరతోనే నొరు నొక్కి.. అదే అంతస్తులో ఖాళీ ఉన్న 301 ఫ్లాట్‌లోకి తీసుకెళ్లాడు. ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు నగలు లాక్కొని.. ఆ తర్వాత చీరతో గొంతు బిగించి చంపేశాడు. మృతదేహాన్ని అదే ఫ్లాట్‌లోని బాత్రూంలో దాచాడు. తర్వాత కిందకు వెళ్లి వాచ్‌మన్ విధులు నిర్వహించాడు. విధులకు వెళ్లిన దుర్గాలమ్మ రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుమారు నూకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది గమనించిన నిందితుడు సన్యాసిరావు అర్ధరాత్రి 1 గంటకు దుర్గాలమ్మ మృతదేహాన్ని లిఫ్ట్‌లో 3వ అంతస్తు నుంచి తీసుకెళ్లి అపార్ట్మెంటు వెనుక గేటు వద్ద వేశారు. బుధవారం ఉదయం 5.30కి దుర్గాలమ్మ మృతదేహం వెనుక గేటు వద్ద ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాచ్‌మన్ సన్యాసిరావుపై అనుమానం వచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నగలను స్వాధీనం చేసుకొని, అతడిని రిమాండ్‌కు తరలించామన్నారు. -
వాచ్‌మన్‌ను ఈడ్చుకెళ్లిన జూనియర్ డాక్టర్
హైదరాబాద్:అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం పార్కింగ్ విషయమై రభస జరిగింది. ఉస్మానియా ఆసుపత్రి వాచ్‌మన్ సత్యనారాయణ (53)ను అదే ఆసుపత్రి జూనియర్ డాక్టర్ జుబేర్ ఈడ్చుకెళ్లారు. డాక్టర్ జుబేర్ తన కారును నర్సింగ్ స్కూల్ ప్రాంగణంలో పార్కింగ్ చేశారు. సత్యనారాయణ వద్దని వారించాడు. దాంతో కోపోద్రిక్తుడైన జుబేర్ అతడి కాలర్ పట్టుకుని నర్సింగ్ కళాశాల నుంచి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకు వెళ్లారు. ఆసుపత్రి కింది స్థాయి సిబ్బంది వాచ్‌మన్‌ను తీసుకెళ్లవద్దని జుబేర్‌ను వేడుకున్నా మీపైనా కేసు పెడతానంటూ బెదిరించారు. సత్యనారాయణను పోలీసులకు అప్పగించి కారు అద్దాలు పగులగొట్టాడని ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
నారాయణ కాలేజీ వాచ్మెన్ దారుణ హత్య
హైదరాబాద్ : హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలో దారుణం జరిగింది. నారాయణ జూనియర్ కాలేజీలో వాచ్మెన్ రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి చోరీకి వచ్చిన దొంగలు వాచ్మెన్ గొంతుకోసి, తలను గోడకేసి బాదడంతో రాజారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. 50 వేల రూపాయలతో పాటు కంప్యూటర్లు చోరీకి గురైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. -
నేర్చుకోడానికి, మార్చుకోడానికీ బిడియం ఎందుకు?
భోజనం ముగించి డైనింగ్ హాల్ నుంచి తన రూమ్‌కి వచ్చింది మీనా. రూమ్మేట్ సంధ్య కోసం హాస్టల్ మొత్తం వెతికింది. ఎక్కడా సంధ్య లేదు. కిందికి వచ్చి వాచ్మన్ని అడిగింది. ఆమె అసలు కిందికే రాలేదని చెప్పాడతను. తిరిగి పైకి వెళ్లిపోదామనుకుంటూండగా పెద్ద శబ్దం. ఓ గావుకేక. శబ్దం వచ్చిన వైపు చూసింది మీనా. రక్తపు మడుగులో సంధ్య! ఏడడుగుల హాస్టల్ భవనం మీద నుంచి దూకేసింది. పరుగు పరుగున స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది మీనా. కానీ అప్పటికే ఆమె ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోయింది. హైదరాబాద్‌లో కొన్నాళ్ల క్రితం జరిగింది ఈ సంఘటన. సంధ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీనా ద్వారా వెల్లడయింది. సంధ్య విజయనగరం జిల్లాలో ఓ చిన్న గ్రామం నుంచి సిటీకి వచ్చింది. తెలివైన పిల్ల. పీజీ చేసింది. కానీ వెనుకబడిన ప్రాంతానికి చెందినది కావడంతో కాస్త నాగరికత తెలియదంతే. చాలామంది అమ్మాయిల్లాగ సిటీకి అలవాటు పడలేకపోయింది. ఇక్కడి వాళ్లతో పోటీ పడలేకపోయింది. అంత యాక్టివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండలేక ప్రతి ఇంటర్వ్యూలోనూ ఓడిపోసాగింది. దాంతో తాను ఎందుకూ పనికిరానేమోనన్న న్యూనతను ఏర్పరచుకుంది. చివరికి అదే పెరిగి పెద్దదై ఆమె ప్రాణాలను తీసింది. మన దేశంలో ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎనభై శాతం మంది చదువుకున్నవారే. వారిలో సగానికి పైగా మహిళలే. కొందరు ప్రేమవ్యవహారాల వంటి వాటికి ప్రాణం తీసుకుంటుంటే... ఎక్కువమంది మాత్రం ఒత్తిడిని భరించలేక, న్యూనతను జయించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి న్యూనతను జయించడం అంత కష్టమేమీ కాదు. ఏదైనా విషయంలో మనం విజయం సాధించలేకపోతున్నామంటే... దిగులు పడే బదులు, ఎక్కడ దెబ్బతింటున్నామో చూసుకోవాలి. కారణం తెలిశాక దాని గురించి స్నేహితులు, ఇంట్లోవాళ్లతో చెప్పాలి. అప్పుడు వాళ్లేదైనా మార్గం చెబుతారు. లేదంటే మీరే ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం చేయవచ్చు. కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఖర్చు గురించి భయపడక్కర్లేదు. కొన్ని సంస్థల వారు ఉచితంగా కూడా నేర్పుతారు. అలాంటివేమీ అందుబాటులో లేవు, ఖర్చు పెట్టలేరు అనుకుంటే... మీకు లేవు అనుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్లండి. మొహమాట పడకుండా, నేను నీలా అవాలంటే ఏం చేయాలని అడగండి. నేర్చుకోవడం మీదే మనిషి ఎదుగుదల ఆధారపడి ఉంటుంది కాబట్టి... సంకోచం, సిగ్గు అవసరం లేదు. ఇక మరీ ముఖ్యమైనది... మీ బలాలేమిటో తెలుసుకోవడం. ఒకదాంట్లో సక్సెస్ కాలేనప్పుడు, ఒకటి మీకు చేతకానప్పుడు... మీరేం చేయగలరో దానిమీద ఎందుకు శ్రద్ధ పెట్టకూడదు? ఆ వైపుగా ఎందుకు అడుగులు వేయకూడదు? అవ్వదు అనుకున్నదానికోసం అవస్థ పడే బదులు, అవుతుంది అనుకున్న దానికోసం ఎందుకు సమయాన్ని వెచ్చించకూడదు? అందుకే మీ బలహీనతలను తెలుసుకోవడంతో పాటు మీ బలాలను గుర్తించడం కూడా ఎంతో అవసరం. అలా చేయకుండా... మీరు దేనికీ పనికి రారని, మీరేమీ సాధించలేరని కుమిలిపోవడం కరెక్ట్ కాదు. ఈ లోకంలో ఏ మనిషీ పర్ఫెక్ట్ కాదు. ప్రతివారిలోనూ కొన్ని బలాలుంటాయి. కొన్ని బలహీనతలుంటాయి. బలాలను ఉపయోగించుకుంటూ, బలహీనతలను అధిగమించుకుంటూ పోవడం నేర్చుకోవాలి. జీవితాన్ని మనకు నచ్చినట్టు, మనకు వచ్చినట్టు జీవించాలి. అప్పుడు మీలైఫ్ మీకు అందంగా కనిపిస్తుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. న్యూనత మీ నుంచి దూరంగా పారిపోతుంది!