మారేడుపల్లి: యజమానితో జరిగిన చిన్న వివాదం వాచ్‌మన్ ప్రాణం బలి గొంది. మారేడుపల్లి సీఐ ఉమామహేశ్వర్ రావు కథనం ప్రకారం... భగవన్‌నగర్ కాలనీలోని ఫోర్‌బైవన్ అపార్టుమెంట్ వద్ద కాకినాడకు చెందిన మాచవరపు శ్రీనివాస్(35) వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. భార్య నీలిమ, ఇద్దరు పిల్లలతో కలిసి అపార్టుమెంట్‌లోని ఒక గదిలో ఉంటున్నాడు. ఇంటి ముందు వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేశారని ఆదివారం రాత్రి 9 గంటలకు అపార్టుమెంట్ యజమా శ్రీనివాస్ వాచ్‌మన్ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జ రి గింది. దీంతో యజమాని వాచ్‌మన్ పై చేయి చేసుకున్నాడు. తర్వాత వాచ్‌మన్ తన భార్యాపిల్లలతో కలిసి గదిలోకి వెళ్లిపోయాడు. సోమవారం తెల్లవారుజామున lనిద్రలో ఉన్న వాచ్‌మన్ శ్రీనివాస్ నోటి నుంచి నురగ రావడాన్ని గమనించిన భార్య గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. అపార్టుమెంట్ యజమాని చేయి చేసుకోవడంతో అవమాన భారంతో తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీనివాస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చే సింది. పోలీసులు అపార్టుమెంట్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.