Wrath
-
చెత్త దేశాల పౌరులు మాకెందుకు?
వాషింగ్టన్: నోటి దురుసుకు కేరాఫ్‌గా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుజారారు. హైతీ, ఎల్సాల్వడార్లతో పాటు ఆఫ్రికాలోని అత్యంత చెత్త(షిట్ హోల్) దేశాల పౌరుల్ని అమెరికాలోకి ఎందుకు అనుమతించాలని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడిక్కడి ఓవల్ కార్యాలయంలో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల సెనెటర్లతో సమావేశమైన ట్రంప్ ఈ మేరకు స్పందించారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్‌తో పాటు ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ ఎట్టకేలకు స్పందించారు. హైతీ, ఎల్‌సాల్వడార్, ఆఫ్రికా దేశాలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ట్రంప్ తెలిపారు. డీఏసీఏ సమావేశంలో తాను సీరియస్ కామెంట్స్ మాత్రమే చేశానని స్పష్టం చేశారు. అమెరికా రక్షణ కల్పిస్తున్న పౌరుల జాబితా నుంచి హైతీ దేశస్తుల్ని తొలగించాలని తాను ఆదేశించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ట్వీటర్లో తెలిపారు. ఇదంతా డెమొక్రటిక్ పార్టీ సభ్యులు చేసిన కుట్రనీ, భవిష్యత్‌లో అన్ని సమావేశాలను రికార్డు చేస్తామని వెల్లడించారు. ఓవల్ కార్యాలయంలో గురువారం ఇరుపార్టీల సెనెటర్లతో సమావేశమైన ట్రంప్.. బాల్యంలో అమెరికా వచ్చినవారిపై చర్యల వాయిదా(డీఏసీఏ) బిల్లును తిరస్కరించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు హైతీ, ఎల్సాల్వడార్తో పాటు ఆఫ్రికా దేశాల పౌరుల రక్షణ కోసం పోరాడటంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మన దేశంలో అత్యంత చెత్త(షిట్ హోల్) దేశాలకు చెందిన పౌరులంతా ఎందుకున్నారు? వీరందరినీ అసలు ఎందుకు అనుమతించాలి? అమెరికా ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూర్చే కొన్ని ఆసియా దేశాలతో పాటు నార్వే నుంచి వలసల్ని ప్రోత్సహించండి’ అని వారితో ట్రంప్ వ్యాఖ్యానించినట్లు పలు అమెరికన్ పత్రికలు గురువారం వార్తలు ప్రచురించాయి. లండన్‌లో ఎంబసీని ప్రారంభించను లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఫిబ్రవరిలో బ్రిటన్ వెళ్లాల్సిన ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ‘ఒబామా ప్రభుత్వం లండన్‌లో కీలకమైన మేఫైర్లో ఉన్న అమెరికా ఎంబసీని చిల్లరకు అమ్మేసి 1.2 బిలియన్ డాలర్లతో ఎక్కడో మారుమూలన నైన్ ఎల్మస్లో ఎంబసీని నిర్మించింది’ అని ట్రంప్ వరుస ట్వీట్లు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఐరాస ఆఫ్రికా దేశాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఐరాస మానవహక్కుల కార్యాలయం అధికార ప్రతినిధి రూపర్ట్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికాలోని వలసదారులు, మైనారిటీలపై దాడులు పెరిగే ప్రమాదముందన్నారు. ఆఫ్రికన్ యూనియన్(ఏయూ) ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. కాగా, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో పలు ఆఫ్రికా దేశాలు ఈ విషయంలో స్పందించేందుకు నిరాకరించాయి. అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ విప్ హోయర్ స్పందిస్తూ..‘జాత్యహంకారంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని తెలియజేస్తున్నాయ్. ఓ అమెరికన్‌గా సిగ్గుపడుతున్నాను’ అని అన్నారు. -
నేనేం ఉగ్రవాదిని కాదు.. సీఎంను: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గెస్ట్ టీచర్ల రెగ్యులరైజ్ బిల్లును ఎల్జీ వ్యతిరేకించడాన్ని ఢిల్లీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేజ్రీవాల్ తప్పుబట్టారు. ‘రెగ్యులరైజ్‌కు సంబంధించిన ఫైళ్లను డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ప్రభుత్వ యంత్రాంగం ఇంతవరకు చూపించలేదు. స్వయానా విద్యామంత్రి అయిన మనీశ్‌కు సైతం ఆ ఫైళ్లను చూపకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులను ఆదేశించారు. మాకు చూపించనంతగా ఆ ఫైళ్లలో అంత రహస్యమేముంది? ఎల్జీకి ఒకటి చెప్పదల్చుకున్నా. నేను ప్రజ్వాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్రముఖ్యమంత్రిని. ఉగ్రవాదిని కాదు. మనీశ్ విద్యాశాఖ మంత్రి. ఉగ్రవాది కాడు. మేం ఢిల్లీ పాలకులం. ప్రభుత్వ ఉద్యోగులం కాదు. దేశంలో డెమోక్రసీ నడుస్తోంది. బ్యూరోక్రసీ కాదు’ అని కేజ్రీవాల్ ఆవేశంగా మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉద్యో గులుగా పనిచేస్తున్న 15,000 మంది గెస్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించారు. -
అమ్మకు ఆగ్రహం తెప్పించరాదు
ఆత్మీయం మహిషాసుర సంహారం వల్ల శరన్నవరాత్రుల పూజలు ఆరంభమయ్యాయని భావిస్తారందరూ. కాని, వీటికి మూలకారకుడు కృతయుగంలోని దుర్గముడు. హిరణ్యాక్షుని మనుమడుదుర్గముడు. వాడు బ్రహ్మను గురించి తపస్సు చేసి, విప్రులు వేదాలు మరచిపోవాలనీ, అవి తనకే చెందాలనీ వరం కోరాడు. ఆ వరంతో వి్రçపులు వేదాలు మరచిపోయారు, యజ్ఞాలు ఆగిపోయాయి. వర్షాలు కురవక భూలోకవాసులు తల్లడిల్లిపోయారు. వారంతా అమ్మను ప్రార్థించగా, ఆమె వారికి ముందుగా ఆహారాన్ని పెట్టింది. అప్పటినుంచి అమ్మవారిని శాకంభరి అన్నారు. ఆపై దుర్గముడిని చంపివేసింది. వాడి చావుతో బ్రహ్మ ఇచ్చిన వరం తొలగిపోయి యథాస్థితి ఏర్పడింది. లోకం సుభిక్షమైంది. దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారికి దుర్గ అని పేరు వచ్చిందని శ్రీమద్దేవీ భాగవతం చెప్తోంది. తల్లి, తన బిడ్డలు ఆకలితో ఉండటాన్ని చూడలేదు. అదేవిధంగా ఒకరి చెడు ప్రవర్తన మూలంగా మిగిలిన వారు బాధపడటాన్ని కూడా అమ్మ సహించలేదు. తప్పు చేసిన వారికి ఎంతటి శిక్ష అయినా విధిస్తుంది. మిగిలిన అందరికీ సుఖాన్ని, శుభాన్ని ప్రసాదిస్తుంది. అమ్మకు ఆగ్రహం తెప్పించకూడదు. ఆడవారికి కన్నీరు రానివ్వకూడదు. అది అర్ధాంగి అయినా, ఆడబిడ్డ అయినా... -
అవమానం తట్టుకోలేక వాచ్‌మన్ ఆత్మహత్య
మారేడుపల్లి: యజమానితో జరిగిన చిన్న వివాదం వాచ్‌మన్ ప్రాణం బలి గొంది. మారేడుపల్లి సీఐ ఉమామహేశ్వర్ రావు కథనం ప్రకారం... భగవన్నగర్ కాలనీలోని ఫోర్బైవన్ అపార్టుమెంట్ వద్ద కాకినాడకు చెందిన మాచవరపు శ్రీనివాస్(35) వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. భార్య నీలిమ, ఇద్దరు పిల్లలతో కలిసి అపార్టుమెంట్‌లోని ఒక గదిలో ఉంటున్నాడు. ఇంటి ముందు వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేశారని ఆదివారం రాత్రి 9 గంటలకు అపార్టుమెంట్ యజమా శ్రీనివాస్ వాచ్‌మన్ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జ రి గింది. దీంతో యజమాని వాచ్‌మన్ పై చేయి చేసుకున్నాడు. తర్వాత వాచ్‌మన్ తన భార్యాపిల్లలతో కలిసి గదిలోకి వెళ్లిపోయాడు. సోమవారం తెల్లవారుజామున lనిద్రలో ఉన్న వాచ్‌మన్ శ్రీనివాస్ నోటి నుంచి నురగ రావడాన్ని గమనించిన భార్య గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. అపార్టుమెంట్ యజమాని చేయి చేసుకోవడంతో అవమాన భారంతో తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీనివాస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చే సింది. పోలీసులు అపార్టుమెంట్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. -
రాజధానికి రావాలన్న ఉత్తర్వులపై ఉద్యోగుల ఆగ్రహం
-
రుత్వికులకు టీటీడీ చైర్మన్ చీవాట్లు
సమాచారం లోపంతో ఆలస్యంగా వచ్చిన చదలవాడ అప్పటికే ముగిసిన యాగం తిరుమల: టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి ఆగ్రహం వ చ్చింది. తను వచ్చేలోపే వరుణయాగం పూర్తి చేయడం పై శుక్రవారం ఆయన రుత్వికులకు చీవాట్లు పెట్టారు. తిరుమల పారువేట మండపం వద్ద నిర్వహించే వరుణయాగంలో మూడోరోజు కార్యక్రమం కోసం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు రావాలని పండితులు ఆహ్వానించారు. ఆ సమాచారం చైర్మన్‌కు అందలేదు. దీంతో ఆయన సతీసమేతంగా మధ్యాహ్నం 12.50 గంటలకు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే యాగం ముగిసింది. దీంతో చైర్మన్ నిర్ఘాంతపోయారు. ‘‘మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించాల్సిన యాగాన్ని 12 గంటలకే ఎలా ముగి స్తారు? అలా చేయడం సరికాదు? నాకు అందిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం 1 గంట వరకు యాగం ఉంటుందని చెబితేనే నేను వచ్చాను? లేనిపక్షంలో రాను?’’ అని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి యాగాన్ని పర్యవేక్షించే టీటీడీ పండితుడు వడ్లమానిని నిలదీశారు. ‘‘మధ్యాహ్నం కాకముందే ఆకలవుతోందా?’’ అంటూ చీవాట్లు పెట్టారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 8.30 గంటల నుంచి 12 గంటలకే పూర్తి చేశామని వడ్లమాని బదులిచ్చారు. తర్వాత చైర్మన్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. -
అనుయాయులకు పనులు..అధికారులకు చీవాట్లు
పన్నెండేళ్లకోసారి పుష్కరాలొస్తాయి. ఈ విషయం సామాన్యులకే కాదు ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకూ తెలుసు! కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలకు వచ్చే ఈ క్రతువు మరో రెండు రోజుల్లో రానే వస్తోంది. కానీ ఏర్పాట్లు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉన్నాయి. ఈ తరుణంలో కూడా పుష్కరాల పనులు పూర్తి చేయని, అస్తవ్యస్తంగా చేసిన కాంట్రాక్టర్లను పల్లెత్తు మాట కూడా అనని సీఎం శనివారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో కనిపించిన ప్రతి అధికారిపైనా ఆగ్రహం వ్యక్తం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, రాజమండ్రి :పుష్కరాలు ఈ నెల 14 నుంచే ప్రారంభమవుతున్నప్పటికీ 13వ తేదీ సాయంత్రం నుంచే భక్తుల హడావుడి ప్రారంభమైపోతుంది. ఇప్పటివరకూ పనులను సమీక్షించడమో, ఘాట్లను చూసి వెళ్లిపోవడమో చేసిన చంద్రబాబు.. శనివారం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆకస్మిక తనిఖీలకు తెర తీశారు. ఉదయం 10.40 గంటలకే మధురపూడి విమానాశ్రయానికి సీఎం వస్తారని అధికారులు ముందుగా ప్రకటించినా.. ఆయన వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది. భారీ సంఖ్యలో వాహనాలతో బయల్దేరిన సీఎం కాన్వాయ్ మూడుసార్లు దారి తప్పింది. తొలుత ఆర్అండ్బీ అతిథి గృహానికి వెళ్లి తర్వాత ఘాట్ల పరిశీలనకు వెళ్తారని అధికారులు మొదట చెప్పారు. కానీ సీఎం నేరుగా ఘాట్లకు బయల్దేరారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అవసరమైన స్థాయిలో పోలీసు సిబ్బంది లేరు. దీనికితోడు తనిఖీ కోసం ఎక్కడికక్కడ ఆగుతుండటంతో కాన్వాయ్ మొత్తం నిలిచిపోయేది. అసలే మధ్యాహ్నం మండుటెండ, ఉక్కపోతతో సతమతమవుతున్న వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి నానా అవస్థలూ పడ్డారు. కోటిలింగాల రేవును పరిశీలించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో దేవీచౌక్‌లోని పశువైద్యకేంద్రం వద్ద సీఎం ఆగారు. అక్కడ డ్రైన్లో చెత్త పేరుకుపోవడం, పారిశుధ్య లోపం కనిపించడంపై సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్‌ను, మేస్త్రిని సస్పెండ్ చేస్తూ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అయితే నగరమంతా పరిస్థితి ఇలాగే ఉందని, కాంట్రాక్లర్ల నిర్లక్ష్యం వల్ల ఏ పనీ పూర్తి కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే మార్గంలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సీఎం ఆగారు. అక్కడ పోలీసు హోప్ ల్యాండ్‌ను పరిశీలించారు. అది తుప్పుపట్టి ఉండటంతో రంగులు వేయలేదా? అని రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణను నిలదీశారు. అప్పటికే బ్యారికేడ్ల ఏర్పాటుపై ఆగ్రహంతో ఉన్న సీఎం ఈ సందర్భంలో ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత సీఎం ఆర్యాపురంలో ఆగి నల్లా చానల్‌ను పరిశీలించారు. అక్కడ దుర్గంధాన్ని తట్టుకోలేకపోతున్నామని స్థానిక మహిళ ఒకరు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గంటల తరబడి విద్యుత్తు వెతలు సిటీలో హైటెన్షన్ విద్యుత్ వైర్ల మార్పిడి పనులు ఆలస్యం కావడం, ప్రధాన రహదారుల వెంబడి గృహ వినియోగ సర్వీసు వైర్లను రోడ్డుకు అడ్డంగా లేకుండా మార్చడం తదితర పనులన్నీ ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ అవి కొలిక్కిరాకపోవడంతో రోజుల తరబడి విద్యుత్తు కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనిని స్థానికులు సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఆయన పెద్దగా స్పందించలేదు. లోపాలు కనిపించకుండా డ్రామా! పుష్కరాల పనుల్లో లోటుపాట్లపై ఇప్పటికే ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి నారాయణ కలిసి నిర్వహించిన సమీక్షలోనే అనేక లోటుపాట్లు కళ్లకు కట్టాయి. అవన్నీ ఈ రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకా శం కనిపించటం లేదు. కాంట్రాక్టు పనులు చేపట్టింది ‘పచ్చ’ నేతల వందిమాగదులు కావడంతో ఆ లోటుపాట్లను కప్పిపుచ్చేందుకే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజల నుంచి మార్కులు కొట్టేసేందు కు సీఎం కొత్త ఎత్తు వేసినట్టుగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. -
రైతన్నల రణభేరి
సీఎం బాబుపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు సాక్షి, యంత్రాంగం : వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాననే హామీతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు రకరకాల మాటలు మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘నరకాసుర వధ’ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, డ్వాక్రా మహిళల్లో వెల్లువెత్తిన ఆగ్రహం మూడోరోజు మరింత ఉధృతంగా కనిపించింది. నరకాసురవధ చివరిరోజు ‘సీఎం డౌన్ డౌన్’ నినాదాలు గుంటూరు జిల్లాలో మార్మోగాయి. బాపట్ల రూరల్ మండలం వెదుళ్ళపల్లిలో రుణమాఫీ తీరుపై ఆగ్రహించిన మహిళల రాస్తారోకోతో రెండు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల నిరసనలు నిరసనలు వెల్లువెత్తాయి. పెద్దదోర్నాల, పెద్దారవీడు మండలాల్లో యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, మద్దిపాడులో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలో రైతులు, డ్వాక్రా మహిళలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆందోళనలు హోరెత్తాయి. రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో న్యాయవాదులు ‘నమూనా ప్రజాకోర్టు’ నిర్వహించారు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో చెన్నై, బెంగళూరు జాతీయ రహదారిపై ఆందోళనలు చేస్తున్న రైతులు, డ్వాక్రా మహిళలు, వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కర్నూలు, వెఎస్సార్, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. -
కేంద్రమంత్రి ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, విజయనగరం:పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంపై కేం ద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గుర్రుగా ఉన్నారు. పలువురు ఇంజనీరింగ్ అధికారులు ఐదేళ్ల కాలంలో అడ్డగోలుగా వ్యవరించారన్న అభిప్రాయం తో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2009 నుంచి చేపట్టిన ఇంజనీరింగ్ పనులపై అధ్యయనం చేయాలన్న ఆలోచనకొచ్చారు. అనుకున్న దే తడువుగా ఇంజనీరింగ్ అధికారులు తననుకలవాల ని శుక్రవారం సాయంత్రం సమాచారమిచ్చారు. కానీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సకాలం లో స్పందించలేదు. దీంతో మంత్రి చిర్రెత్తిపోయారు. ఇంజనీరింగ్ అధికారుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల కాలంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌కుమార్ అనుసరించిన తీరుపై టీడీపీ ఎమ్మె ల్యేలు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ ప నులవిషయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి అడ్డగోలుగా వ్యవహరిం చారని అభిప్రాయ పడుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి అశోక్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ పనుల ప్రగతిని అధ్యయనం చేయాలన్న ఆలోచనకొచ్చినట్టు సమాచారం. ఇంజనీరింగ్ అధికారులు తననొచ్చి కలవమని శుక్రవారం సాయంత్రం కబురు పంపించారు. అయితే ఇంజనీరింగ్ అధికారు లు వెంటనే స్పందించకపోవడంతో కలెక్టరేట్ వర్గాలు జోక్యం చేసుకుని, శనివారం ఉదయం బంగ్లాకెళ్లి కల వాలని మరోసారి సమాచారమిచ్చారు. దీంతో ఉద యం పంచాయతీరాజ్ ఎస్ఈ నేరుగా అశోక్‌ను కలిసా రు. ’మీరు కాదు,...మీ ఈఈ కావాలని’ ఎస్ఈను ఆదేశించారు. పక్కనే ఉన్న మరో ఇంజనీరింగ్ అధికారి జోక్యం చేసుకుని గృహనిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళినితో తిరుగుతున్నారని చెప్పగానే అశోక్ చిర్రెత్తిపోయారు. ఆయన ఎకడ తిరిగితే నాకేంటి? నేను మంత్రిని కాదా!. హౌసింగ్ మంత్రిని అడిగి తెలుసుకోలేనా! అదంతా అనవసరం ఆయనొస్తారా?లేదా? అని కోపోద్రిక్తులయ్యారు. ఈఈ శ్రీనివాస్‌కుమార్ విషయంలో కాస్త ఘాటుగా మాట్లాడారు. దీంతో ఎస్ఈ మరోమాట ఆడకుండా వెనక్కి వచ్చేసారు. తక్షణమే అశోక్ గజపతిరాజును కలవాలని ఈఈని ఆదేశించా రు. దీంతో మధ్యాహ్నం సమయంలో బంగ్లాలో ఉన్న అశోక్‌ను ఈఈ శ్రీనివాస్‌కుమార్ కలిసారు. ఐదేళ్లలో చేపట్టిన పనులు..?వాటిలో పూర్తయినవి? పెండింగ్ లో ఉన్న వెన్నీ? ప్రారంభించనివెన్ని? ప్రారంభించిన పనులు పూర్తయ్యేది ఎప్పటికీ? తదితర వివరాలను కూడిన నివేదికను యుద్ధప్రాతిపదికన అందజేయాల ని ఆయన్ను ఆదేశించారు. పదేపదిసార్లు కోపం తీసుకురాని వ్వద్దని, చెప్పినట్టు చేయాలని హెచ్చరించారు. -
ఆరని చిచ్చు
పార్టీ కోసం కష్టనష్టాలకోర్చిన వారిని కరివేపాకుల్లా తీసిపారేసి, చంద్రబాబు పెట్టిన చిచ్చు.. రోజురోజుకీ ప్రజ్వరిల్లుతోంది. అభ్యర్థులుగా స్థానికేతరులను ఎంపిక చేయడం.. స్థానిక శ్రేణులను చివరికి హింసకు సైతం పురిగొల్పుతోంది. ఆదివారం చేబ్రోలులో మాజీ మంత్రి, టీడీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం కాన్వాయ్‌పై వర్మ వర్గీయులు విరుచుకుపడడం, ఆయన వర్గీయులే పిఠాపురంలో అసెంబ్లీ అభ్యర్థి పోతుల విశ్వం అనుచరులను చంపుతామని బెదిరించడం.. బాబు నిర్వాకం పర్యవసానాలే! గొల్లప్రోలు/పిఠాపురం, న్యూస్‌లైన్ :పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం శ్రేణుల్లో శనివారం రగిలిన ఆగ్రహం ఆదివారం మరింత భగ్గుమంది. పిఠాపురంలో నియోజకవర్గ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని పోతుల విశ్వంకు, పెద్దాపురంలో ఆశావహులైన స్థానిక నేతలను పక్కనపెట్టి నిమ్మకాయల చినరాజప్పకు టిక్కెట్లు ఇవ్వడంతో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటుకు దిగారు. ఆ నియోజకవర్గాల్లో విశ్వం, రాజప్పలు నామినేషన్ వేయబోవడాన్ని అడ్డుకున్నారు. చివరికి వారు పోలీసుల సాయంతో ఆ పని కానిచ్చారు. కాగా పార్టీ స్థానిక శ్రేణుల కోపాగ్ని ఆదివారం తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి , టీడీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం ప్రచారం కాన్వాయ్‌పై వర్మ వర్గీయులు రాత్రి 8.30 గంటలకు చేబ్రోలులో దాడి చేశారు. కాకినాడ నుంచి కత్తిపూడి వైపు వెళుతున్న కాన్వాయ్‌లో తోట కారును పంచాయతీ కార్యాలయం ఎదురుగా నిలువరించిన వారు తోటపై దాడికి యత్నించారు. తోట అనుచరులు కారు దిగి వారి ప్రయత్నాన్ని నిరోధించారు. కోపోద్రిక్తులైన వర్మ వర్గీయులు వారిపై కర్రలతో దాడి చేశారు. కిర్లంపూడికి చెందిన చదలవాడ బాబీకి కంటిపై తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాంతో భీతిల్లిన వారు కారును ఒక్కసారిగా ముందుకు పోనివ్వడంతో.. వర్మ అనుచరులు వెనుక వచ్చిన అద్దాలను పగలగొట్టారు. ప్రచారవాహనంపై ఉన్న సిబ్బందిని కిందకు నెట్టి దాడి చేశారు. పోస్టర్లను, స్టిక్కర్లను చెల్లాచెదరుగా పడేసి నిప్పు పెట్టారు. దీంతో అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి చేసిన వారు ‘జై వర్మ’ అంటూ నినాదాలు చేశారు. కాగా.. ఈ సంఘటన గురించి తెలిసి పోలీసులు వచ్చేసరికే తోట కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తమపై దాడి గురించి తోట అనుచరులు ఫోన్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాగా పిఠాపురంలో ఆదివారం సాయంత్రం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి పోతుల విశ్వం అనుచరులపై వర్మ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. స్థానిక లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన సామగ్రి సిద్ధం చేసే పనిలో ఉండగా.. అక్కడకు చేరుకున్న వర్మ అనుచరులు కార్యాలయం ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని, వెంటనే వెళ్లిపోవాలని బెదిరించారు. అంతటితో ఆగకుండా తాము వచ్చిన కారు అద్దాలను పగల కొట్టి, కుర్చీలను విరగగొట్టి, తమపై దాడి చేశారని విశ్వం వర్గీయులు ఆరోపిస్తున్నారు. పిఠాపురంలో అడుగు పెట్టినా, ప్రచారం చేసినా చంపుతామని బెదిరించారని పిఠాపురం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ ఎస్సై సన్యాసినాయుడు విచారణ చేపట్టారు.