కేంద్రమంత్రి ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, విజయనగరం:పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంపై కేం ద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గుర్రుగా ఉన్నారు. పలువురు ఇంజనీరింగ్ అధికారులు ఐదేళ్ల కాలంలో అడ్డగోలుగా వ్యవరించారన్న అభిప్రాయం తో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2009 నుంచి చేపట్టిన ఇంజనీరింగ్ పనులపై అధ్యయనం చేయాలన్న ఆలోచనకొచ్చారు. అనుకున్న దే తడువుగా ఇంజనీరింగ్ అధికారులు తననుకలవాల ని శుక్రవారం సాయంత్రం సమాచారమిచ్చారు. కానీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సకాలం లో స్పందించలేదు. దీంతో మంత్రి చిర్రెత్తిపోయారు. ఇంజనీరింగ్ అధికారుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు.
ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల కాలంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌కుమార్ అనుసరించిన తీరుపై టీడీపీ ఎమ్మె ల్యేలు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ ప నులవిషయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి అడ్డగోలుగా వ్యవహరిం చారని అభిప్రాయ పడుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి అశోక్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ పనుల ప్రగతిని అధ్యయనం చేయాలన్న ఆలోచనకొచ్చినట్టు సమాచారం. ఇంజనీరింగ్ అధికారులు తననొచ్చి కలవమని శుక్రవారం సాయంత్రం కబురు పంపించారు.
అయితే ఇంజనీరింగ్ అధికారు లు వెంటనే స్పందించకపోవడంతో కలెక్టరేట్ వర్గాలు జోక్యం చేసుకుని, శనివారం ఉదయం బంగ్లాకెళ్లి కల వాలని మరోసారి సమాచారమిచ్చారు. దీంతో ఉద యం పంచాయతీరాజ్ ఎస్‌ఈ నేరుగా అశోక్‌ను కలిసా రు. ’మీరు కాదు,...మీ ఈఈ కావాలని’ ఎస్‌ఈను ఆదేశించారు. పక్కనే ఉన్న మరో ఇంజనీరింగ్ అధికారి జోక్యం చేసుకుని గృహనిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళినితో తిరుగుతున్నారని చెప్పగానే అశోక్ చిర్రెత్తిపోయారు. ఆయన ఎకడ తిరిగితే నాకేంటి? నేను మంత్రిని కాదా!. హౌసింగ్ మంత్రిని అడిగి తెలుసుకోలేనా! అదంతా అనవసరం ఆయనొస్తారా?లేదా? అని కోపోద్రిక్తులయ్యారు. ఈఈ శ్రీనివాస్‌కుమార్ విషయంలో కాస్త ఘాటుగా మాట్లాడారు. దీంతో ఎస్‌ఈ మరోమాట ఆడకుండా వెనక్కి వచ్చేసారు.
తక్షణమే అశోక్ గజపతిరాజును కలవాలని ఈఈని ఆదేశించా రు. దీంతో మధ్యాహ్నం సమయంలో బంగ్లాలో ఉన్న అశోక్‌ను ఈఈ శ్రీనివాస్‌కుమార్ కలిసారు. ఐదేళ్లలో చేపట్టిన పనులు..?వాటిలో పూర్తయినవి? పెండింగ్ లో ఉన్న వెన్నీ? ప్రారంభించనివెన్ని? ప్రారంభించిన పనులు పూర్తయ్యేది ఎప్పటికీ? తదితర వివరాలను కూడిన నివేదికను యుద్ధప్రాతిపదికన అందజేయాల ని ఆయన్ను ఆదేశించారు. పదేపదిసార్లు కోపం తీసుకురాని వ్వద్దని, చెప్పినట్టు చేయాలని హెచ్చరించారు.