
ఈ ఘటనపై గ్రామ కార్యదర్శి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాక్షి, కొవ్వూరు : పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామస్తులకు తృటిలో పెను ముప్పు తప్పింది. రక్షిత మంచినీటి పథకం ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. అయితే అక్కడ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న పోలయ్య వాసన గమనించి నీళ్లని బయటికి విడుదల చేయలేదు. ఈ ఘటనపై గ్రామ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.