హైదరాబాద్:అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం పార్కింగ్ విషయమై రభస జరిగింది. ఉస్మానియా ఆసుపత్రి వాచ్‌మన్ సత్యనారాయణ (53)ను అదే ఆసుపత్రి జూనియర్ డాక్టర్ జుబేర్ ఈడ్చుకెళ్లారు. డాక్టర్ జుబేర్ తన కారును నర్సింగ్ స్కూల్ ప్రాంగణంలో పార్కింగ్ చేశారు. సత్యనారాయణ వద్దని వారించాడు. దాంతో కోపోద్రిక్తుడైన జుబేర్ అతడి కాలర్ పట్టుకుని నర్సింగ్ కళాశాల నుంచి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకు వెళ్లారు.
ఆసుపత్రి కింది స్థాయి సిబ్బంది వాచ్‌మన్‌ను తీసుకెళ్లవద్దని జుబేర్‌ను వేడుకున్నా మీపైనా కేసు పెడతానంటూ బెదిరించారు. సత్యనారాయణను పోలీసులకు అప్పగించి కారు అద్దాలు పగులగొట్టాడని ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.