సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో భాగంగా నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజి స్వామి, నందకుమార్‌ను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మొదటిరోజు విచారణలో భాగంగా పలు కీలక ప్రశ్నలకు సంధించారు సిట్ అధికారులు.
ఇక, నిందితుల కస్టడీలో రెండో రోజు కూడా విచారణ జరుగుతోంది. కాగా, రెండో రోజు కస్టడీలో భాగంగా పోలీసులు.. నిందితుల వాయిస్ రికార్డ్ చేయనున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌లో నిందితుల వాయిస్ పరిశీలన పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కీలకం కానుంది. కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు సూత్రధారులు, పాత్రధారులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీ అనంతరం నిందితులను కోర్టులో కోర్టులో హాజరపర్చనున్నారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment