ఆ నివేదిక వస్తే సంచలనాలే! | acb thinks of sensational decisions after getting forensic science lab report | Sakshi
Sakshi News home page

ఆ నివేదిక వస్తే సంచలనాలే!

Published Mon, Jun 22 2015 3:07 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

ఆ నివేదిక వస్తే సంచలనాలే! - Sakshi

ఆ నివేదిక వస్తే సంచలనాలే!

ఓటుకు కోట్లు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం తెలంగాణ ఏసీబీ వర్గాలు వేచి చూస్తున్నాయి. ఇప్పటి వరకు సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన ఏసీబీ, త్వరలోనే మరి కొంతమందికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని పరిశీలిస్తున్న ఏసీబీ వర్గాలు.. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు కూడా తమ చేతికి అందుతుందని భావిస్తున్నాయి. స్టీఫెన్సన్‌ ఇప్పటికే తన వాంగ్మూలంలో చంద్రబాబే కుట్రకు సూత్రధారుడని చెప్పటంతో బాబుకు నోటీసులు ఇచ్చే అంశంపై న్యాయ నిపుణులతో ఏసీబీ సంప్రదిస్తోంది.

అయితే చంద్రబాబు, స్టీఫెన్‌సన్‌ ఆడియో టేపులకు సంబంధించిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు వచ్చిన తర్వాత, వాటిని పరిశీలించి.. వాటి ఆధారంగానే నోటీసులు ఇస్తే బాగుంటుందని న్యాయ నిపుణులు ఏసీబీకి సూచించినట్లు తెలుస్తోంది.. దీంతో ఇప్పటికే స్తబ్దుగా ఉన్న ఏసీబీ మరో రెండు రోజులపాటు ఇదే నిశ్శబ్దాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఆ తర్వాత సంచలనాలే ఉంటాయని ఏసీబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement